Vizag Beach Wooden Box: విశాఖ బీచ్ కు కొట్టుకొచ్చిన భారీ పెట్టె, తెరిచిన అధికారులు - అందులో ఏముందంటే?
Vizag Beach Mystery Wooden Box: విశాఖ సాగర తీరానికి ఓ భారీ పెట్టె కొట్టుకు వచ్చింది. విషయం గుర్తించిన అధికారులు ఆ పెట్టెను తీసుకెళ్లి తెరిచి చూశారు. అయితే అందులో ఏముందంటే..?
Vizag Beach Wooden Box: విశాఖ సాగర తీరానికి అలలతో పాటే ఓ భారీ పెట్టె కొట్టుకు వచ్చింది. అయితే ముందుగా దీనిని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు వచ్చిన అధికారులు దాన్ని ముందుగా పరిశీలించారు. బరువు సుమారు వంద టన్నుల వరకు ఉంటుందని అంచనా వేశారు. ప్రొక్లెయిన్ సాయంతో పెట్టెను ఒడ్డుకు చేర్చారు.
పెట్టెలో ఏముందో తేల్చిన అధికారులు
వైఎంసీఏ బీచ్‌కు కొట్టుకు వచ్చిన ఈ భారీ చెక్క పెట్టే బ్రిటీష్ కాలం నాటిదిగా అధికారులు భావిస్తున్నారు. అలాగే దీన్ని ఆర్కియాలజీ అధికారులకు చూపిస్తే బాగుంటుందని వారికి సమాచారం అందించారు. మరోవైపు బీచ్ లో ఉన్న సందర్శకులు అందరూ ఆ పెట్టె ఏంటి, అందులో ఏముందో చూడాలని పరుగుపరుగును అక్కడకు చేరుకున్నారు. పోలీసులు వీరిని కట్టడి చేయగా.. ఆర్కియాలజీ అధికారులు ఆ పెట్టెను తెరిచి చూశారు. ఇది చెక్కలతో చేసిన దిమ్మెగా అధికారులు తేల్చారు. బీచ్ లో పడవలకు లంగర్ వేసేందుకు ఉపయోగించే చెక్క దిమ్మె అని ఖరారు చేశారు.
గతంలో కూడా విశాఖ తీరానికి చాలా వస్తువులు కొట్టుకు వచ్చాయి. అయితే ఇంత పెద్ద పెట్టె కొట్టుకు రావడం మాత్రం ఇదే మొదటి సారి. అందుకే ఈ పెట్టెలో ఏముందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కానీ చివరకు అది చెక్క దిమ్మెగా తేలడంతో అంతా లైట్ తీసుకున్నారు.
Read Also: Hyderabad Crime News: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాలుడి కిడ్నాప్, సీసీటీవీల ఆధారంగా దర్యాప్తు