అన్వేషించండి

Andhra Pradesh News: ఏపీలో హృదవిదారక ఘటన- బిడ్డ శవాన్ని భుజాన వేసుకొని 8 కిలోమీటర్ల పయనం

Vizag News: కుమారుడు చనిపోయాడన్న బాధ ఓవైపు, ఊరికి చేరే దారి లేక మరో బాధ. అన్నింటినీ దిగమింగుతూ బిడ్డ శవాన్ని భుజాన వేసుకొని ఒకటి రెండు కాదు ఏకాగ 8 కిలోమీటర్లు ప్రయాణించాడో తండ్రి

Andhra Pradesh News: అల్లూరి సీతారామరాజు జిల్లాలో హృదయవిదారకర ఘటన కన్నీళ్లు పెట్టిస్తోంది. అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయితీ చిన్న కోనల గ్రామంలో జరిగిందీ ఘటన. ఈ గ్రామానికి సారా కొత్తయ్య, భార్య సీత ఇద్దరూ గుంటూరు జిల్లాలోని ఓ ఇటుక బట్టీలో పని చేస్తున్నారు. 

గుంటూరు జిల్లా కొల్లూరు ఏరియా ఇటుక బట్టి పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలతో అక్కడే ఉంటున్నారు. రెండో కుమారుడికి రెండు రోజుల క్రితం జబ్బు చేసింది. తీవ్ర అనారోగ్యంపాలైన ఆ బాలుడిని గుంటూరు ఆసుపత్రిలో చేర్పించారు. 

చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందారు. బాలుడిని స్వగ్రామానికి తరలించేందుకు ఇటుక బట్టి యాజమాన్యం ప్రత్యేక అంబులెన్స్‌ను ఏర్పాటు చేసింది. రావులపాలెం గ్రామంలో అంబులెన్స్ ఎక్కించారు. సాయంత్రం బయల్దేరిన అంబులెన్స్‌ తెల్లవారుజాము రెండు గంటలకి విజయనగరం జిల్లా మెంటాడ మండలం వనిజ గ్రామానికి చేరుకుంది. అంతకంటే ముందుకు వెళ్లేందుకు రోడ్డు సరిగా లేని కారణంగా బాలుడి శవాన్ని అక్కడ విడిచిపెట్టి వెళ్లిపాయాడా డ్రైవర్. 

అక్కడి నుంచి బాలుడు శవాన్ని తీసుకెళ్లేందుకు వాహనాలు రాక వేరే వాళ్లు సాయం చేయలేదు. అంతే తండ్రి తన బిడ్డ శవాన్ని భుజంపై వేసుకొని వేకువజామున బయల్దేరాడు. రెండు ఎత్తైన కొండలు, ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉదయం 8 గంటలకు ఊరు చేరుకున్నాడు. కుమారుడి శవాన్ని అంత్యక్రియలు నిర్వహించాడు. దారి లేకపోవడంతో 8కిలోమీటర్లు శవాన్ని భుజాన వేసుకొని ప్రయాణించిన వీడియో మాత్రం వైరల్‌గా మారుతోంది. 

షర్మిల ఆగ్రహం 

ఈ వార్తపై ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ షర్మిల స్పందించారు. మీ ఇంటికి, మీ గ్రామానికి మేలు చేస్తేనే ఓటు వెయ్యండి అని అడిగేవాళ్లకు ఈ వార్త చూసైనా కనువిప్పు కలగాలన్నారు." ఆరోగ్యశ్రీని అట్టకెక్కించడంతో ఆసుపత్రిలో సరైన వైద్యం ఎలాగూ అందటంలేదు. కనీసం చనిపోయిన మృతదేహాన్ని కూడా ఇంటికి చేర్చుకోలేని దుస్థితిలో ప్రజలు  ఉన్నారంటే  అధికార పార్టీ సిగ్గుపడాలి. మేము అది చేశాం ఇది చేశాం అని డబ్బాలు కొట్టుకోవటం కాదు. పేదోడి కనీస అవసరాలు తీర్చలేని మీ ప్రభుత్వం ఎందుకు?. మళ్లీ మీరు రాజన్న వారసులం అని చెప్పుకుంటారు? ఇలానే ఉంటుందా రాజన్న పాలనా? అందుకే చెబుతున్నాం ఓటు అనే ఆయుధంతో వీళ్లకు బుద్ది చెప్పండి. అని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget