By: ABP Desam | Updated at : 17 Feb 2023 05:20 PM (IST)
రుషికొండ తవ్వకాలపై కమిటీ
Rushikonda : విశాఖలోని రుషికొండ తవ్వకాలపై మరో కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ హైకోర్టుకు తెలిపింది. గతంలో ఏర్పాటయిన కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉండటాన్ని తప్పుపట్టిన నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వ అధికారులతోనే కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో సెంట్రల్ ప బ్లిక్ వర్క్సు డిపార్టుమెంట్ కార్యనిర్వాహక ఇంజనీరు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ప్రధాన శాస్త్రవేత్త వీఎస్‌ఎస్ శర్మ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాస్త్రవేత్త డీ సౌమ్య, నేషనల్ సెంటర్ ఫర్ సస్టయినబుల్ కోస్టల్ మేనేజిమెంట్ శాస్త్రవేత్త డాక్టర్ మహాపాత్రలతో కొత్త కమిటీని నియమించింది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం తరుపున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎన్ హరినాథ్ కోర్టుకు మెమో రూపంలో సమర్పించారు.
నివేదిక కోసం ఎనిమది వారాల గడువు అడిగిన సొలిసిటర్ జనరల్ - నాలుగు వారాల గడువిచ్చిన హైకోర్టు
నివేదిక సమర్పించేందుకు 8 వారాల గడువు కావాలని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ కోర్టును కోరారు. వివరాలను పరిశీలించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం నాలుగు వారాల్లో నివేదికను అందించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ మార్చి 16వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలో సముద్రం ఒడ్డున ఉండే రుషికొండలో గతంలో టూరిజం రిసార్ట్స్ ఉండేవి. వాటిని కూల్చి వేసి.. కొండను మొత్తం తవ్వేశారు. అక్కడ టూరిజంకు సంబంధించిన పెద్ద హోటల్ కడుతున్నామని చెప్పుకొచ్చారు.
నిబంధనలు ఉల్లంఘిచి కొండను ధ్వంసం చేస్తున్నారని పిటిషన్లు
అయితే పర్యావరణ నిబంధనలు అన్నింటినీ ఉల్లంఘించి రుషికొండలో తవ్వకాలు జరుపుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే ప్రభుత్వం మాత్రం అనుమతి ఉన్న వరకే తవ్వుతున్నామని వాదించింది. కానీ 9.88 ఎకరాలకు అనుమతి ఇస్తే, 20 ఎకరాల్లో తవ్వకాలు చేశారని పిటీషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు మ్యాపులు సమర్పించారు. విచారణలో అనుమతి ఇచ్చిన దాని కన్నా మూడు ఎకరాలు అదనంగా తవ్వామని అంగీకరించింది. కానీ అంతకు మించి తవ్వారని పిటిషనర్లు వాదించడంతో సర్వేకు ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సజావుగా సర్వే నిర్వహిస్తే ప్రభుత్వ బండారం బయట పడుతుందని విపక్షాలు అంటున్నాయి.
నలుగురు కేంద్ర అధికారులతో విచారణ
కోస్టల్ రెగ్యులేషన్ జోన్‌కి విరుద్ధంగా విశాఖజిల్లా, చినగదిలి మండలం, ఎండాడ గ్రామం పరిధిలోని సర్వేనెంబరు 19లో రుషికొండను తవ్వేయడంతో పాటు చెట్లను తొలగిస్తున్నారని పేర్కొంటూ విశాఖ తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన నాయకుడు పీవీఎన్‌ఎన్ మూర్తి యాదవ్ వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. అనుమతులకు మించి కొండను తవ్వేశారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటోందని, ఈ విషయంలో అధికారులపై కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయి. అందుకే కేంద్ర అధికారులతో విచారణ కమిటీని నియమించారు.
వైజాగ్ లో ఆకట్టుకుంటున్న " ఐ లవ్ వైజాగ్ "
APSWREIS: గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
MP GVL On Rahul Gandhi : ఎస్సీ జాబితాలో దళిత క్రైస్తవులను చేర్చే తీర్మానం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే- ఎంపీ జీవీఎల్
AP Power Tariff : ఏపీ వాసులకు గుడ్ న్యూస్, ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల మోత లేదోయ్
ఆ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే రాహుల్ గాంధీపై అనర్హత వేటు- మాజీ ఎంపీ హర్షకుమార్
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా