News
News
X

Somu Veerraju : ప్రధాని మోదీ సభలో పవన్ పాల్గొంటారా? సోము వీర్రాజు ఏమన్నారంటే?

Somu Veerraju : అమరావతి రాజధానికే బీజేపీ కట్టుబడి ఉందని సోము వీర్రాజు తెలిపారు. ప్రధాని విశాఖ పర్యటన వివరాలను ఆయన తెలిపారు.

FOLLOW US: 

Somu Veerraju : ప్రధాని మోదీ ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖలో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనలో పార్టీ పరంగా కార్యక్రమాలకు ఏపీ బీజేపీ ఏర్పాట్లు చేస్తుంది. విశాఖలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రధాని పర్యటనపై మాట్లాడారు. ప్రధాని మోదీ ఈనెల 11 సాయంత్రం 6:25 కు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారన్నారు. పార్టీ తరపున ఘన స్వాగతం పలికి, అనంతరం రోడ్ షో నిర్వహిస్తామన్నారు. ఇవాళ సాయంత్రానికి అధిష్ఠానం  రోడ్ షో మార్గాన్ని నిర్ణయిస్తుందన్నారు. తాము రెండు రూట్లు పంపామని, ఒకటి ఎన్ఎడి వద్ద పాత ఐటిఐ నుంచి, రెండోది బీచ్ రోడ్ అన్నారు. 12వ తేదీ ఉదయం ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్ లో పలు కేంద్ర ప్రభుత్వ పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉంటాయన్నారు. బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతారని సోము వీర్రాజు తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 12.15 కు ప్రధాని మోదీ తెలంగాణకు బయలుదేరివెళతారన్నారు. 

విపక్షాలపై అణచివేత చర్యలు 

కేంద్రం ఇంతకాలం ఎన్నో పథకాలకు నిధులు ఇచ్చిందని సోము వీర్రాజు అన్నారు. ఆ పథకాలను ప్రధాని దేశానికి అంకితం చేస్తారని తెలిపారు. రాష్ట్ర పరంగా ఏ అభివృద్ధి లేదన్నది స్పష్టం అయిందన్నారు. వైసీపీ ప్రభుత్వం విపక్షాల మీద అణచివేత చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఏపీలో అయిదువేల ఎస్సీ బస్తీల్లో సంపర్క్ అభియాన్  కార్యక్రమం నిర్వహిస్తున్నామని సోము వీర్రాజు అన్నారు. కడప జిల్లాలో ఎస్సీలు ఈ అభియాన్ కు తరలి వస్తే అధికార పార్టీ అడ్డుకుంటోందని ఆరోపించారు. దీనిపై పోరాడుతామన్నారు.  

పవన్ ను పిలుస్తారా? 

News Reels

ఏపీ రాజధాని అమరావతికే బీజేపీ కట్టుబడి ఉందని సోము వీర్రాజు తెలిపారు. రాజధానిపై మరో వివాదానికి తావు లేదని స్పష్టం చేశారు. మూడు రాజధానుల పేరుతో ప్రజల్ని మభ్యపెడుతున్నారని వైసీపీపై మండిపెట్టారు.  ఈనెల 11న విశాఖలో ప్రధాని మోదీ పర్యటించనున్నారని, ఈ పర్యటన వివరాలను ఎంపీ జీవీఎల్‌ నరసింహారావుతో కలిసి సోము వీర్రాజు మీడియాకు తెలిపారు. ప్రధాని పర్యటన వివరాలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ముందే ప్రకటించారని మీడియా ప్రతినిధులు ఆయనను అడిగారు. కేంద్రం చేస్తున్న అభివృద్ధిపై క్రెడిట్‌ కొట్టేసేందుకు వైసీపీ తొందరపడుతోందన్నారు. ప్రధాని సభకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను పిలుస్తారా? అని అడిగిన ప్రశ్నకు సోము వీర్రాజు సమాధానం దాటవేశారు.  

స్టీల్ ప్లాంట్ అంశం ముగిసిన విషయం 
 
విశాఖలో ఏ అభివృద్ధి చేసినా అది కేంద్ర నిధులతో జరిగినది మాత్రమే అని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. మోదీ సభకు రావటానికి అన్ని రాజకీయ పక్షాలూ ఆసక్తి చూపుతున్నాయన్నారు. హోదా, స్టీల్ ప్లాంటు వంటి అంశాలు గడిచిపోయిన విషయాలు అన్నారు. ప్రస్తుతం అభివృద్ధి అజెండా నడుస్తోందన్నారు. 

Published at : 07 Nov 2022 05:13 PM (IST) Tags: BJP AP News Visakha News Pawan Kalyan Somu Veerraju PM Modi Tour

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: నేడు టీటీడీ‌ పాలక మండలి సమావేశం, చర్చించే అంశాలివే

Breaking News Live Telugu Updates: నేడు టీటీడీ‌ పాలక మండలి సమావేశం, చర్చించే అంశాలివే

CM Jagan Kadapa Tour: రెండ్రోజుల పాటు కడప పర్యటనకు సీఎం జగన్!

CM Jagan Kadapa Tour: రెండ్రోజుల పాటు కడప పర్యటనకు సీఎం జగన్!

TTD News: నేడు టీటీడీ‌ పాలక మండలి సమావేశం, ఆ సమయాల మార్పులపై చర్చ!

TTD News: నేడు టీటీడీ‌ పాలక మండలి సమావేశం, ఆ సమయాల మార్పులపై చర్చ!

AB Venkateshwar Rao: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టు షాక్, ఏమైందంటే?

AB Venkateshwar Rao: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టు షాక్, ఏమైందంటే?

TTD News: నేడు తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యం ఇదే! నిన్నటి హుండీ ఆదాయం, దర్శన సమయం వివరాలు

TTD News: నేడు తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యం ఇదే! నిన్నటి హుండీ ఆదాయం, దర్శన సమయం వివరాలు

టాప్ స్టోరీస్

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Ram Charan New Movie: రాంచరణ్‌తో జతకట్టేందుకు జాన్వీ గ్రీన్ సిగ్నల్? బుచ్చిబాబు-చెర్రీ మూవీలో హీరోయిన్‌ ఆమేనా?

Ram Charan New Movie: రాంచరణ్‌తో జతకట్టేందుకు జాన్వీ గ్రీన్ సిగ్నల్? బుచ్చిబాబు-చెర్రీ మూవీలో హీరోయిన్‌ ఆమేనా?