కేశినేని నానీ, ఏందయ్యా నీ బిల్డప్, సోది ఆపు: పీవీపీ
ట్విట్టర్ వేదికగా విజయవాడ ఎంపీ కేశినేని నానిపై పీవీపీ ఫైర్ అయ్యారు. ఈ మధ్య కాలంలో కేశినేని కామెంట్స్ తేడాగా ఉండటంతో ఆయన వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
విజయవాడ పార్లమెంట్ పరిధిలోనే కాకుండా యావత్ రాష్ట్రంలోనే కేశినేని నాని హాట్‌టాపిక్ అవుతున్నారు ఏదో కాంట్రవర్సీతో మీడియాలో ఆయన పేరు మారుమోగుతోంది. బుధవారం రోజున ఆయన చేసిన కామెంట్స్ మరింత వైరల్‌గా మారాయి. దీనిపై అటు వైసీపీ, టీడీపీ రెండూ సైలెంట్‌గానే ఉన్నాయి. అయితే ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన పీవీపీ మాత్రం సీరియస్‌గా స్పందిచారు.
ట్విట్టర్ వేదికగా విజయవాడ ఎంపీ కేశినేని నానిపై పీవీపీ ఫైర్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే... కేశినేని నానీ నీ బిల్డప్ ఏందయ్యా... నువ్వేదో అల్లూరికి ఎక్కువ, నేతాజీకి తక్కువ అన్నట్టు....ప్రజాసేవ కోసం పుట్టానంటావు అని మండిపడ్డారు.
నీ బిల్డప్ ఏందయ్యా @kesineni_nani
— PVP (@PrasadVPotluri) June 1, 2023
నువ్వేదో అల్లూరి కి ఎక్కువ, నేతాజీకి తక్కువ అన్నట్టు..
ప్రజాసేవ కోసం పుట్టానంటావు.. కానీ, దొబ్బెది బ్యాంకులని,జీతాలు ఎగదొబ్బేది కార్మికులకు.. వెరసి మన బెజవాడోళ్ళందరికి చేతిలో చిప్ప.. నోటిలో మట్టి.. వేదవ సోది ఆపి,కాస్త కొవ్వు కరిగించే పనిలో ఉండు..…
అంతే కాదు నాని బ్యాంకులను మోసాలు చేస్తూ కార్మికుల జీతాలను ఎగ్గొట్టారని కూడా ఆరోపణలు చేశారు పీవీపీ. ట్విట్టర్‌లో ఏముందంటే... బ్యాంకులని దోచి, కార్మికుల జీతాలను ఎగ్గొట్టావు.. వెరసి మన బెజవాడోళ్ళందరికి చేతిలో చిప్ప.. నోటిలో మట్టి కొట్టావని ఆరోపించారు.
అక్కడితో ఆగిపోలేదు పీవీపీ. వెదవ సోది ఆపి, కాస్త కొవ్వు కరిగించే పనిలో ఉండు అని సలహా ఇచ్చారు. తర్వాత ఎన్నికల బరిలో దొర్లుకుంటూ వద్దువుగాని అని ఎద్దేవా చేశారు. తనను విమర్శించే వారిపై సెటైరిక్‌గా పంచ్‌లు వేసే నాని ఈసారి పీవీపీపై ఎలా విరుచుకుపడతారో అనే ఆసక్తి ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో కనిపిస్తోంది.