అన్వేషించండి

Nanidgam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ మళ్లీ అరెస్ట్‌, 2 వారాలు రిమాండ్

Andhra Pradesh News | టీడీపీ సెంట్రల్ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టై ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను మరో కేసులో తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు.

YSRCP EX MP Nanidgam Suresh arrested in Mariyamma Death Case | అమరావతి: వైసీపీ నేత నందిగం సురేష్ కు కష్టాలు తప్పడం లేదు. వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. మంగళగిరి కోర్టులో సోమవారం ఆయనను పోలీసులు ప్రవేశపెట్టారు. గతంలో టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నందిగం సురేష్ అరెస్ట్ కావడం తెలిసిందే. మాజీ ఎంపీ గుంటూరులో జైలులో ఉన్నారు. నందిగం సురేష్ కు ఏపీ హైకోర్టు ఇటీవల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ పూచీకత్తూ సమర్పించని కారణంగా వైసీపీ నేత ఇంకా జైలులోనే ఉన్నారు. 

మంగళగిరి కోర్టు పీటీ వారెంట్ అనుమతి ఇవ్వడంతో తుళ్లూరు పోలీసులు నందిగం సురేష్ ను అరెస్ట్ చేశారు. మరియమ్మ మహిళ హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీని తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా నందిగం సురేష్ కు అక్టోబర్ 21 వరకు రిమాండ్ విధించింది. వెలగపూడిలో 2020లో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తగా.. ఆ వివాదంలో మరియమ్మ అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పేరును సైతం ఈ కేసులో చేర్చడం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గత ఐదేళ్లలో ఏపీలో జరిగిన పలు ఘర్షణలు, వివాదాలు, దాడులపై కేసుల విచారణ కొనసాగుతోంది.

Also Read: Drone Show: ఈ నెల 22, 23 తేదీల్లో అమ‌రావ‌తిలో డ్రోన్ సమ్మిట్‌- పోటీల్లో విజేతలకు భారీ ప్రైజ్ మనీ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Mulugu News: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Crime News: పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
Miss Universe 2024: విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
Embed widget