Youtuber Ravan Case: రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
Youtuber Ravan Case: యుట్యూబర్ రావణ్ కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అతని ఇంట్లో రెండోరోజు తనిఖీలు చేపట్టారు. పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

Youtuber Ravan Case: యుట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ కేసులో విచారణ వేగంగా సాగుతోంది. ఇప్పటికే ఆయనపై ఉపా యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆయన ఇంట్లో తనిఖీలు చేపట్టారు. గురువారం మూడు గంటల పాటు తనిఖీలు చేపట్టిన అధికారులు, శుక్రవారం ఉదయం మరోసారి సోదాలు జరిపారు. ఆయన భార్యను ప్రశ్నించారు. పలు పత్రాలు, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.
యుట్యూబర్ రావణ్ ఇంట్లో రెండవ రోజు ఏపీ పోలీసుల సోదాలు నిర్వహించారు. గన్నవరం పోలీసుల బృందం విస్తృత తనిఖీలు చేపట్టింది. నిన్న మూడు గంటల పాటు కొనసాగిన పోలీసుల సోదాలు, ఇవాళ ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు. కొన్ని దస్త్రాలు, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి అమీన్‌పూర్‌లోని ఫ్లాట్‌లో తనిఖీలు చేశారు. ఇంటి తనిఖీలను వీడియోలో రికార్డు చేశారు.
తనిఖీలు చేయడమే కాకుండా రావణ్ భార్యను కూడా పోలీసులు ప్రశ్నించారు. ఇంటికి ఎవరెవరు వస్తుంటారు, ఆయన ఎవరెవరితో మాట్లాడుతుంటారు. యాక్టివిటీస్ ఎలా ఉంటాయి. జాబ్, ఆర్థిక వివరాలు చాలా అంశాలపై దర్యాప్తు బృందం ప్రశ్నించింది. వివారలన్నింటినీ ల్యాప్‌టాప్‌లో నమోదు చేశారు. పలుపత్రాలపై రావణ్ భార్య సంతకాలు తీసుకున్నారు.
ట్రెండింగ్ వార్తలు





















