అన్వేషించండి

Prashna Ravan: రావణ్‌తో సంబంధం లేదంటున్న వైసీపీ - ఇప్పటి వరకూ చేసిన సపోర్టు తూచ్ - ఎందుకు ఈ యూటర్న్?

Joseph Ravan Issue: నిన్నటి వరకూ జోసెఫ్ అలియాస్ రావణ్‌కు అటు రాజకీయంగా.. ఇటు మీడియా,సోషల్ మీడియా పరంగా మద్దతిచ్చిన వైసీపీ ఇప్పుడు హఠాత్తుగా మాట మార్చింది. తమ పార్టీతో ఆయనకు సంబంధంలేదని అంటోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పవన్, సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేసిన జోసఫ్ రావణ్ అరెస్ట్.
  • ఉపా కేసులో చిక్కగా, వైసీపీ అతడికి దూరం పెట్టింది.
  • హిందూ వ్యతిరేక వ్యాఖ్యలతో బీజేపీ ఆగ్రహానికి భయపడినట్టు తెలుస్తోంది.

Why YSRCP distancing from Joseph Ravan after arrest:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా సాగే ట్రోలింగ్, వ్యక్తిగత దూషణల పర్వం ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను, సనాతన ధర్మాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ బచ్చలకూరి జోసఫ్ అలియాస్ ప్రశ్న రావణ్  అరెస్టు, అతనిపై అత్యంత కఠినమైన దేశద్రోహ వ్యతిరేక చట్టం  ఉపా కింద కేసు నమోదు కావడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం రేపింది. అయితే, నిన్నటివరకు ఇతని వీడియోలను నెత్తిన పెట్టుకుని, సోషల్ మీడియాలో భారీగా షేర్ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఇప్పుడు హఠాత్తుగా అతనికి, తమకు ఎలాంటి సంబంధం లేదంటూ చేతులు కడిగేసుకోవడం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఒక్కసారిగా ప్లేట్ మార్చిన పెద్దలు..  

జోసఫ్ చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుసుకోవడంతో వైసీపీ సీనియర్ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని సహా పలువురు ముఖ్యులు ఒక్కసారిగా వ్యూహాత్మక మౌనాన్ని దాటి.. అతడు తమ వాడు కాదనే వాదనను గట్టిగా వినిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి కొడాలి నాని ఒక అడుగు ముందుకు వేసి..  జోసఫ్ అసలు వైసీపీ వ్యక్తే కాదు, అతను వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి  అనుకూలమైన వ్యక్తి. అతను కమ్మ సామాజికవర్గానికి చెందినవాడు, అందుకే ఎప్పుడూ లోకేష్, బాలకృష్ణ, చంద్రబాబులను విమర్శించడు  అంటూ ఒక కొత్త పొలిటికల్ ట్విస్ట్ ఇచ్చారు. నిన్నటివరకు తమ అనుకూల యూట్యూబర్‌గా చలామణీ అయిన వ్యక్తిని ఇప్పుడు కులం, పార్టీల ముసుగులో దూరం పెట్టేందుకు వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తోందని అర్థమవుతోంది.

 కత్తి మహేష్ తరహాలోనే ఎటాక్.. అసలు పేరు జోసఫ్! 

గతంలో జనసేనాని పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలతో పాపులర్ అయిన కత్తి మహేష్ తరహాలోనే.. ఈ బచ్చలకూరి జోసఫ్ కూడా గత కొంతకాలంగా యూట్యూబ్‌లో ప్రశ్న రావణ్  పేరుతో అగ్రెసివ్ వీడియోలు చేస్తూ లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. అధికారికంగా తన పేరును జోసఫ్ నుంచి రావణ్‌గా మార్చుకున్నప్పటికీ.. ఇతని తండ్రి పేరు డానియల్ కావడంతో ఇతడు క్రైస్తవ మతానికి చెందినవాడనే విషయం అందరికీ తెలుసు. అయితే, గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ కుటుంబంపై, సనాతన ధర్మంపై ఇతడు చేసిన వ్యాఖ్యలు శ్రుతిమించడంతో జనసేన శ్రేణుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.  జోసఫ్ అలియాస్ రావణ్‌ను తెరవెనుక ఉండి నడిపించింది, ఆర్థికంగా, రాజకీయంగా ప్రోత్సహించింది వైసీపీ సోషల్ మీడియా వింగేననేది రాజకీయ వర్గాల్లో బహిరంగ రహస్యం. ఇతడు వీడియోలు పెట్టిన ప్రతిసారీ వైసీపీ అధికారిక పేజీలు, వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు వాటిని విపరీతంగా ప్రమోట్ చేసేవారు. పోలీసులు ఇతనిపై వరుస కేసులు పెట్టిన ప్రారంభంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు వంటి వారు ప్రెస్‌మీట్ పెట్టి మరీ కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా యాక్టివిస్టులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని జోసఫ్‌కు మద్దతుగా మాట్లాడారు.  జగన్ కూడా హే రామ్ అంటూ ట్వీట్ చేశారు.  

 బీజేపీ ఆగ్రహానికి భయపడే  రివర్స్ గేర్’? 

జోసఫ్‌ను వైసీపీ ఇంత వేగంగా దూరం పెట్టడం వెనుక బలమైన రాజకీయ భయాలు ఉన్నాయని   భావిస్తున్నారు. రిమాండ్ రిపోర్టు ప్రకారం.. జోసఫ్ కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, హిందూ దేవుళ్లను అవమానించడం, సనాతన ధర్మంపై ఘోరమైన వ్యాఖ్యలు చేయడం, అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సిద్ధాంతాలను తీవ్రంగా దూషించడం చేశాడు. ఇలాంటి తీవ్రమైన దేశద్రోహ, మత విద్వేషాల కేసులో ఉన్న వ్యక్తికి తాము అండగా నిలిస్తే.. కేంద్రంలోని బీజేపీ అధినాయకత్వానికి ఆగ్రహం వస్తుందని, అది జగన్ మోహన్ రెడ్డికి ఢిల్లీ స్థాయిలో మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతుందని వైసీపీ భయపడుతోంది. అందుకే, తమ పార్టీకి ముప్పు రాకుండా ఉండేందుకే జోసఫ్‌ను  డిటాచ్  చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.

 వాడుకుని వదిలేసే రాజకీయమా ?

రాజకీయాల్లో అవసరం ఉన్నంతవరకు వాడుకుని, సమస్యల్లో పడగానే ముఖం చాటేసే సంస్కృతికి జోసఫ్ వ్యవహారం మరో ఉదాహరణగా నిలుస్తుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై విషం చిమ్మేందుకు ఇలాంటి వారిని ఉసిగొల్పే రాజకీయ పార్టీలు.. తీరా  ఉపా  లాంటి కఠిన చట్టాలు చుట్టుముట్టేసరికి "ఆయనెవరో మాకు తెలియదు.. ఆయన మా పార్టీ కానే కాదు  అని బోర్డు తిప్పేయడం చూస్తుంటే, సోషల్ మీడియాలో రెచ్చిపోయే మిగతా పెయిడ్ యాక్టివిస్టులకు ఇదొక పెద్ద హెచ్చరిక లాంటిదన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.  

Frequently Asked Questions

యూట్యూబర్ ప్రశ్న రావణ్ (జోసఫ్) ను ఎందుకు అరెస్టు చేశారు?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను, సనాతన ధర్మాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు అతన్ని అరెస్టు చేశారు. దేశద్రోహ వ్యతిరేక చట్టం ఉపా కింద కేసు నమోదు చేశారు.

జోసఫ్ అరెస్టు తర్వాత వైసీపీ అతనికి దూరంగా ఉండటానికి కారణం ఏమిటి?

జోసఫ్ హిందూ దేవతలను, సనాతన ధర్మాన్ని, కేంద్రంలోని బీజేపీ సిద్ధాంతాలను దూషించాడు. దీనివల్ల బీజేపీ ఆగ్రహించి, జగన్‌కు ఇబ్బందులు కలుగుతాయని భయపడి వైసీపీ దూరమవుతోంది.

జోసఫ్ రావణ్ తమ వాడు కాదని వైసీపీ నాయకులు ఎవరు పేర్కొన్నారు?

వైసీపీ సీనియర్ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నానితో సహా పలువురు ప్రముఖులు జోసఫ్‌కు తమ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు. కొడాలి నాని అతను టీడీపీ మద్దతుదారుడని అన్నారు.

జోసఫ్ రావణ్‌కు మద్దతుగా వైసీపీ గతంలో ఎలా వ్యవహరించింది?

గతంలో వైసీపీ అతని వీడియోలను భారీగా ప్రచారం చేసేది. అంబటి రాంబాబు వంటి నేతలు అతనికి మద్దతుగా మాట్లాడారు. సోషల్ మీడియా వింగ్ అతన్ని ప్రోత్సహించిందని బహిరంగ రహస్యం.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Ongole Politics: కూటమి ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తున్న బాలినేని - కోవర్ట్ అంటున్న దామచర్ల - టీడీపీ, జనసేనకు మరో గండం తప్పదా?
కూటమి ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తున్న బాలినేని - కోవర్ట్ అంటున్న దామచర్ల - టీడీపీ, జనసేనకు మరో గండం తప్పదా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
AP Assembly: అసెంబ్లీకి రాకుండా ముట్టడి అంటే అనర్హతే - వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ కఠిన చర్యలకు రెడీ అయ్యారా?
అసెంబ్లీకి రాకుండా ముట్టడి అంటే అనర్హతే - వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ కఠిన చర్యలకు రెడీ అయ్యారా?
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
Embed widget