అన్వేషించండి

శ్రీకృష్ణదేవరాయలు రాజీనామాకు కారణాలేంటి ?- టీడీపీలో సీటు కన్ఫామ్ అయిందా?

టికెట్ దక్కని నేతలు...సిట్టింగ్ స్థానం కాదని మరో చోట టికెట్ ఇచ్చిన నేతలు సైతం పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా చేశారు.

Why Mp Lavu Resigned : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైసీపీ (Ycp)కి షాకుల మీదు షాకులు తగులుతున్నాయి. నేతలు వరుసబెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్  రెడ్డి(Jaganmohan Reddy) ఝలక్ ఇస్తున్నారు. వైసీపీ గుడ్ బై చెబుతున్నారు. తెలుగుదేశం (Tdp), జనసేన (Janasena) కండువాలు కప్పుకుంటున్నారు.  ఎప్పుడు ఎవరు వైసీపీకి షాకిస్తారో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. పొద్దున్నే వైసీపీలో ఉన్న నాయకులు..సాయంత్రానికి ఉంటారో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుపొందిన కీలక నేతలంతా ఒక్కొక్కొరుగా పార్టీని వీడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోపాటు రీజినల్ కో-అర్డినేటర్లు నచ్చజెబుతున్నా పట్టించుకోవడం లేదు. కొందరికి సీఎంవో నుంచి పిలుపు వచ్చినా వెళ్లడం లేదు. కొందరు ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడిన తర్వాత కూడా పార్టీకి బై బై చెప్పేస్తున్నారు. మొన్న మాజీ మంత్రి పార్థసారథి, నిన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, తాజాగా నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చారు. పార్టీకి రాం రాం చెబుతున్నట్లు సుభాష్ ప్రకటించారు. 

టికెట్ దక్కని నేతలు...సిట్టింగ్ స్థానం కాదని మరో చోట టికెట్ ఇచ్చిన నేతలు సైతం పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా చేశారు. పార్లమెంట్ సభ్యత్వానికి సైతం గుడ్ బై చెప్పారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు...తొలిసారి ఎంపీగా గెలుపొందారు. ఈ సారి గుంటూరు నుంచి పోటీ చేయాలని వైసీపీ హైకమాండ్ ఒత్తిడి చేయడంతో...పోటీ చేసేందుకు నిరాకరించారు. నర్సరావుపేట నుంచే పోటీ చేస్తానని...గుంటూరుకు మారేది లేదని తెగేసి చెప్పారు. వైసీపీ నర్సరావుపేట టికెట్ ఇవ్వకపోవడంతో...ఆ పార్టీకి రాజీనామా చేశారు. లావు శ్రీకృష్ణదేవరాయలు మార్చవద్దంటూ పల్నాడు జిల్లాకు చెందిన నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామక్రిష్ణారెడ్డిలు అధిష్ఠానాన్ని కోరారు. గత పది రోజులుగా అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇంతలోనే లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. 

నర్సరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి కొత్త అభ్యర్థిని బరిలోకి దించాలని వైసీపీ హైకమాండ్ భావించింది. లావు శ్రీకృష్ణదేవరాయలును గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించింది. దీనికి ఆయన ససేమిరా అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కే డైరెక్ట్ గా నర్సరావుపేట నుంచే పోటీ చేస్తానని, ఈ విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికే గుంటూరు నుంచి పోటీ చేయలేనని చెప్పడం...నర్సరావుపేట సీటే కావాలని పట్టుబట్టడం వైసీపీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. నరసరావుపేట లోక్‌సభ స్థానంలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని పార్టీ ఆలోచిస్తోందని లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో కార్యకర్తలు కొంత అయోమయానికి గురవుతున్నారని, దానికి తెరదించేందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు లావు ప్రకటించారు. తన అభిప్రాయాలతో సీఎం కన్విన్స్‌ అయ్యారని అనుకోవడం లేదన్న లావు... గుంటూరు నుంచి పోటీ చేయాలనే సీఎం ప్రతిపాదనను అంగీకరించలేదని వెల్లడించారు. సీఎం బిజీగా ఉన్నందున మళ్లీ ఇప్పట్లో కలిసే పరిస్థితి లేదంటూ కుండబద్దలు కొట్టారు.  నాలుగున్నరేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేశానని చెప్పారు. కొన్ని రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబును నాయుడు...హైదరాబాద్ లో కలిశారు. సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఆయన నర్సరావుపేట నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. దీనికి టీడీపీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
AP Pensions: 5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
Teenmar Mallanna: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP DesamFlash Floods in Kullu Manali | బియాస్ నదికి ఆకస్మిక వరదలు | ABP DesamSuriya Jyothika With Kids First Time | సూర్య, జ్యోతిక పిల్లలు ఎంత పెద్ద వాళ్లైపోయారో | ABP DesamSLBC Tunnel Incident vs Uttarakhand Tunnel | ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ సక్సెస్..SLBC లో దేనికి ఆటంకం.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
AP Pensions: 5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
Teenmar Mallanna: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు
Rambha Re Entry: రీ ఎంట్రీకి రెడీ... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన రంభ... సెకండ్ ఇన్నింగ్స్ షురూ!
రీ ఎంట్రీకి రెడీ... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన రంభ... సెకండ్ ఇన్నింగ్స్ షురూ!
SBI PO: ఎస్‌బీఐ పీవో-2024 ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఎస్‌బీఐ పీవో-2024 ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Crime News: తోటి డాన్సర్ జీవితంతో ఆడుకున్న ఢీ డాన్సర్ -ఆత్మహత్య - కన్నీరు పెట్టిస్తున్న చివరి వీడియో
తోటి డాన్సర్ జీవితంతో ఆడుకున్న ఢీ డాన్సర్ -ఆత్మహత్య - కన్నీరు పెట్టిస్తున్న చివరి వీడియో
Skype: చరిత్రలో కలిసిపోతున్న స్కైప్ - డిస్‌కంటిన్యూ చేయాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయం
చరిత్రలో కలిసిపోతున్న స్కైప్ - డిస్‌కంటిన్యూ చేయాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయం
Embed widget