అన్వేషించండి

Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ

Prashna Ravan UAPA Case | నాలుగు కేసుల్లో బెయిల్ పొందిన యూట్యూబర్ 'ప్రశ్న రావణ్'పై జనసేన నేత ఫిర్యాదుతో తాజాగా గన్నవరంలో రాజద్రోహం, ఉపా (UAPA) చట్టం కింద కేసు నమోదైంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై UAPA కింద రాజద్రోహం కేసు నమోదు.
  • దేశ సార్వభౌమత్వానికి భంగం, అశాంతి రేకెత్తించారని గన్నవరంలో ఫిర్యాదు.
  • నాలుగు కేసులలో బెయిల్ వచ్చినా, కఠిన సెక్షన్లతో పోలీసులు అరెస్టు.
  • ప్రశ్నించేవారి గొంతు అణచివేయడమేనని లాయర్, నాయకుల విమర్శ.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ (Prashna Ravan) వ్యవహారం మరిన్ని మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే వరుసగా నాలుగు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ అయ్యి, ఆ నాలుగు కేసుల్లోనూ బెయిల్ పొంది విడుదలైన ప్రశ్న రావణ్‌కు చిక్కులు తప్పడం లేదు. తాజాగా ఆయనపై అత్యంత కఠినమైన రాజద్రోహం కేసును నమోదు చేశారు. దేశంలోనే అత్యంత కఠినమైన చట్టంగా పరిగణించే అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్—(UAPA) కింద ఈ కేసు నమోదైంది.

గన్నవరంలో జనసేన నేత గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా స్థానిక పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ప్రశ్న రావణ్ తన సోషల్ మీడియా వేదికల ద్వారా చేస్తున్న వ్యాఖ్యల ద్వారా దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు తీవ్ర భంగం కలిగిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, సమాజంలో అశాంతిని రేకెత్తిస్తూ దేశద్రోహ చర్యలకు పాల్పడుతున్నాడనే  ఆరోపణలతో ఈ కేసును నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ కేసులో ప్రశ్న రావణ్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS),ఉపా చట్టంలోని పలు కఠినమైన సెక్షన్లను చేర్చారు. ఇందులో U/s 147, 148, 152, 192, 197(1)(d), 353(1)(b) తో పాటు యుఏపీఏ యాక్ట్ 1967 (UAPA Act 1967) లోని సెక్షన్ 13, సెక్షన్ 39 కింద గన్నవరం పోలీసులు కేసులు నమోదు చేశారు. వరుసగా బెయిళ్లు వస్తున్న నేపథ్యంలో, అతన్ని అదుపులో ఉంచేందుకే పోలీసులు ఈ తీవ్రమైన సెక్షన్లను ప్రయోగించారని అతడి లాయర్ జడ శ్రవణ్ కుమార్, వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం ఇలాంటి పిచ్చి పనులు చేస్తుందని విమర్శించారు. నటుడు ప్రకాష్ రాజ్ సైతం ప్రశ్న రావణ్‌కు మద్దతు తెలిపారు. పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించాడని ఓ వ్యక్తిని పదే పదే అరెస్ట్ చేస్తున్నా కోర్టులు బెయిల్ ఇవ్వడం నిజం కాదా అని ప్రశ్నించారు. రావణ్‌పై నమోదైనవి ఉద్దేశపూర్వకంగానే పెట్టిన కేసులు అని ఆరోపించారు.

Also Read: YouTuber Prashna Ravan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!

అత్యంత కఠినమైన సెక్షన్లతో ప్రశ్న రావణ్ పై కేసు నమోదు

యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్, ఆయనపై మోపిన సెక్షన్ల గురించి ఆయన తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు..  గన్నవరం పోలీసులు రావణ్‌పై ఎఫ్ఐఆర్ నంబర్ 188/2026 కింద అత్యంత కఠినమైన సెక్షన్లతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని జడ శ్రవణ్ కుమార్ తెలిపారు. రావణ్‌పై సెక్షన్ 147, 148, 152, 192, 197, ఉపా (UAPA) చట్టంలోని సెక్షన్ 39 కింద కేసులు పెట్టారని ఆయన వివరించారు. ముఖ్యంగా సెక్షన్ 147 అనేది ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడం లేదా దానికి ప్రయత్నించడం వంటి నేరాలకు వర్తిస్తుందని, దీనివల్ల మరణశిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు

 గరిపాటి శివశంకర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైనట్లు శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. జూన్ 28, 2026న గన్నవరంలో జరిగిన ఒక కార్యక్రమంలో రావణ చేసిన ప్రసంగం నిషేధిత సిపిఐ మావోయిస్టు సంస్థను కీర్తించేలా ఉందని, యువతను తీవ్రవాద భావజాలం వైపు ప్రేరేపించేలా ఉందని పోలీసులు ఆరోపిస్తున్నట్లు తెలిపారు.  అయితే, ఆ సభలో పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ మాట్లాడారే తప్ప, మావోయిస్టుల ప్రస్తావన ఎక్కడా రాలేదని న్యాయవాది స్పష్టం చేశారు

ప్రభుత్వ వైఖరిపై విమర్శలు
 రావణ్‌పై ఉన్న పాత సోషల్ మీడియా కేసుల్లో బెయిల్ వస్తుండటంతో, ఆయనను ఎలాగైనా జైలులోనే ఉంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చీకటి ఒప్పందం చేసుకుందని శ్రవణ్ కుమార్ విమర్శించారు. రావణ్‌పై ఉన్న సుమారు 102 కేసుల్లో వరుసగా పిటి (PT) వారెంట్లు వేస్తూ, ఒకటి రెండు ఏళ్ల పాటు ఆయనను జైలుకే పరిమితం చేయాలనేది ప్రభుత్వ కుట్ర అని ఆయన మండిపడ్డారు. ఒక యూట్యూబర్‌ను దేశద్రోహిగా, తీవ్రవాదిగా చిత్రీకరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన పేర్కొన్నారు

పోలీసులు సమర్పించిన వీడియో ఆధారాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి సాంకేతికతతో మానిప్యులేట్ చేసినవి అయి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకను అణచివేయడానికి 164 సీట్లను, అధికార బలాన్ని వాడుకుంటున్నారని, ఈ అప్రజాస్వామిక చర్యలకు ప్రజలు 2029 ఎన్నికల్లో తగిన సమాధానం చెబుతారని జడ శ్రవణ్ కుమార్ హెచ్చరించారు

Frequently Asked Questions

యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై ఏ చట్టం కింద రాజద్రోహం కేసు నమోదైంది?

యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై అత్యంత కఠినమైన UAPA (అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) చట్టం కింద రాజద్రోహం కేసు నమోదైంది. దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తున్నాడని ఆరోపణ.

ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదుకు కారణం ఏమిటి?

జనసేన నేత గరికపాటి శివశంకర్ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. రావణ్ తన వ్యాఖ్యల ద్వారా దేశ సమగ్రతకు భంగం కలిగిస్తూ, సమాజంలో అశాంతిని రేకెత్తిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రశ్న రావణ్‌పై ఈ కేసుతో పాటు ఇతర కేసులు ఉన్నాయా?

అవును, ఇదివరకు నాలుగు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ అయ్యి, బెయిల్ పొందిన తర్వాత తాజాగా UAPA కింద ఈ రాజద్రోహం కేసు నమోదైంది. అతడిని అదుపులో ఉంచడానికే ఈ కేసులు పెడుతున్నారని లాయర్లు ఆరోపిస్తున్నారు.

ప్రశ్న రావణ్‌పై నమోదైన కేసులపై ఏమైనా విమర్శలు ఉన్నాయా?

అవును, అతడి లాయర్, వైఎస్సార్సీపీ నేతలు, నటుడు ప్రకాష్ రాజ్ వంటి వారు ఈ కేసులు ఉద్దేశపూర్వకంగానే పెట్టినవని ఆరోపించారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికే కూటమి ప్రభుత్వం ఇలా చేస్తోందని విమర్శించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం, మండలిలో మెగా డీఎస్సీపై వైసీపీ ప్రశ్నలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం, మండలిలో మెగా డీఎస్సీపై వైసీపీ ప్రశ్నలు!
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Embed widget