Punch Prabhakar: పంచ్‌ప్రభాకర్ ఇంటి అడ్రెస్ తెలిసింది.. త్వరలోనే అరెస్టు చేస్తాం.. హైకోర్టులో సీబీఐ అఫిడవిట్
న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది సీబీఐ. పంచ్ ప్రభాకర్ అరెస్టుకు చేస్తున్న ప్రయత్నాలను వివరించింది.
న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పంచ్‌ప్రభాకర్‌ను అరెస్టు చేసే ప్రయత్నాలు తీవ్ర తరం చేశామంటోంది సీబీఐ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ కేసులో ఉన్న తీసుకున్న చర్యలను వివరించింది కేంద్రదర్యాప్తు సంస్థ.
హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో సీబీఐ డైరెక్టర్ జైస్వాల్ అఫిడవిట్ దాఖలు చేశారు. కేసులో ఉన్న పురోగతి కోర్టుకు ఆయన వివరించారు. ఆ అఫిడవిట్‌ను పిటిషనర్లకు కూడా సీబీఐ ఇచ్చింది.
న్యాయమూర్తులను కించపరిచే విధంగా పదే పదే వీడియోలు పెడుతున్న పంచ్ ప్రభాకర్ కోసం చేస్తున్న ప్రయత్నాన్ని హైకోర్టుకులు కేంద్రదర్యాప్తు సంస్థ వివరించింది. నవంబర్ 1న లుక్ ఔట్ సర్క్యులర్‌ను హోం మంత్రిత్వ శాఖ ద్వారా జారీ చేశామని పేర్కొంది. ఇంటర్‌పోల్ జారీ చేసిన బ్లూ నోటీసుతో కొంత పురోగతి సాధించినట్టు పేర్కొంది దర్యాప్తు సంస్థ. అమెరికాలోని ఎప్‌బీఐ ద్వారా పంచ్ ప్రభాకర్ ఉంటున్న ఇంటి చిరునామా పట్టుకున్నట్టు తెలిపింది సి.బి.ఐ.
అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ఇచ్చిన వివరాలతో నవంబరు 8న పంచ్ ప్రభాకర్ అరెస్టు చేసేందుకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశామని కోర్టుకు తెలిపింది దర్యాప్తు సంస్థ. ఈనెల 9వ తేదీన ఇంటర్ పోల్‌కు పంచ్ ప్రభాకర్ అరెస్టు రిక్వెస్ట్‌ను పంపామని వివరించింది.
ప్రభాకర్ అరెస్ట్‌కు సంబంధించి ఇంటర్‌పోల్‌తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని హైకోర్టుకు కేంద్రదర్యాప్తు సంస్థ వివరించింది. పంచ్ ప్రభాకర్ తాజా వీడియోలపై ఈనెల 15న యూట్యూబ్ ఛానల్‌తో వర్చువల్‌గా సమావేశమైనట్టు కూడా చెప్పారు సిబిఐ అధికారులు. పంచు ప్రభాకర్ యూట్యూబ్ ఛానల్స్ మొత్తాన్ని తొలగించాలని యూట్యూబ్‌ను సీబీఐ కోరింది.
ఒక్క పంచ్ ప్రభాకర్‌నే కాదు ఈ కేసులో సంబంధం ఉన్న మిగతా వారందర్నీ విచారిస్తున్నామని పేర్కొంది సి.బి.ఐ. ఈ కేసులో 17వ నిందితుడిగా పంచ్ ప్రభాకర్ పేరును చేర్చామని తెలిపింది.
అమెరికాలో ఉన్న పంచ్ ప్రభాకర్ అలియాస్ చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు నవంబర్ 11న ఇంటర్ పోల్ సాయంతో బ్లూకార్నర్ నోటీసును సీబీఐ జారీ చేసింది. ఈ నోటీసు వల్లే పంచ్ ప్రభాకర్ ఎక్కడ ఉన్నాడో సీబీఐకి స్పష్టమైన సమాచారం వచ్చింది. ఈ సమాచారం ఆధారంగా అతను ఇండియాలో నేరం చేశాడని అతనిని అరెస్ట్ చేసి తమకు అప్పగించాలని కోరింది. ఒక వేళ అలా అప్పగించడానికి అవకాశం లేకపోతే అతనిని అమెరికా నుంచి స్వదేశానికి పంపేలా చర్యలు తీసుకునే చాన్సులు ఉన్నాయి.
అమెరికాలో పశువైద్యునిగా పని చేస్తున్న చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి యూట్యూబ్‌లో పంచ్ ప్రభాకర్ పేరుతో ఓ యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నారు. అందులో లైవ్‌లో మాట్లాడుతూ న్యాయవ్యవస్థపై దారుణమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఉద్దేశపూర్వకంగా న్యాయవ్యవస్థను కించ పరిచేలా మాట్లాడారని.. ఓ పెద్ద కుట్రతోనే ఇలా చేశారని ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. అయితే విదేశాలలో ఉన్న కారణంగా అరెస్ట్ చేయలేకపోయారు. కేసు నమోదైన తరవాత కూడా పంచ్ ప్రభాకర్ న్యాయవ్యవస్థపై తీవ్ర ఆరోపణలు, దూషణలు కొనసాగిస్తున్నారు. దీంతో హైకోర్టు సీబీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read: Chandrababu Naidu: తండ్రి తాగితేనే అమ్మ ఒడి.. అలాంటి పథకాలు మనకు అవసరమా?
Also Read: Tomato Farmers : ఆ రైతు పంట పండించిన టమాటా .. ఒక్క సీజన్‌లో రూ. 80 లక్షలు !
Also Read: Chiru : దేశమంతా ఒకే జీఎస్టీ - టిక్కెట్ రేట్లూ అలాగే ఉండాలి.. జగన్ సర్కార్‌కు చిరంజీవి విజ్ఞప్తి !
Also Read: TDP Jr NTR : జూ. ఎన్టీఆర్ ప్రకటనపై టీడీపీలో అసంతృప్తి .. ఘాటుగా స్పందించలేదని విమర్శలు !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి