By: ABP Desam | Updated at : 21 May 2023 11:06 PM (IST)
టీడీపీ ఎంపీ కేశినేని నాని, వైసీపీ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు
TDP MP Kesineni Nani and YSRCP MLA Jagan Mohan Rao Praises each other at an Event
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రాజకీయం ఆసక్తిగా మారింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని, నందిగామ శాసన సభ్యుడు, వైసీపీ ఎమ్మెల్యే మెండితోక జగన్ మోహన్ రావు పరస్పరం ప్రశంసించుకున్నారు. ఇది ఏపీ రాజకీయాల్లోనే ఆసక్తికర విషయంగా చెప్పవచ్చు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలకు మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గు మనేలా ఏపీలో రాజకీయాలు ఉన్నాయి. కానీ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కి కలసి వస్తున్నారంటూ ఇరువురు నేతలు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. స్థానిక తోటరావులపాడు గ్రామంలో ఎంపీ కేశినేని నిధులు రూ.47 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన 60,000 లీటర్ల కెపాసిటీ గల మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్ ను ప్రారంభించారు ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు.
ఆ తరువాత ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు ఎలక్షన్ వరకే పరిమితమైతేనే బావుంటుంది అన్నారు. అయితే అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఎంపీ నాని. గత నాలుగేళ్లుగా నందిగామ నియోజకవర్గంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ లు వెంటనే స్పందిస్తూ అభివృద్ధికి సహకరిస్తున్నారని నాని అన్నారు. ప్రజలకు పనిచేయటమే ప్రభుత్వ ధ్యేయం .. పార్టీలు వేరైనా ప్రజల కోసం పనిచేయటమే ముఖ్యమని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు వ్యాఖ్యానించారు.
Also Read: Top 5 Headlines Today: నెల్లూరులో ఎమ్మెల్యే అనిల్ ఒంటరి అవుతున్నారా? - తెలంగాణ బీజేపీలో చేరికలు అందుకే లేవా ?
నందిగామ నియోజకవర్గం లో టాటా ట్రస్ట్ ద్వారా ఎంపీ కేశినేని నాని అందించిన సేవలను ఎమ్మెల్యే అభినందించారు. ప్రజా సేవ చేస్తే ప్రజలు ఆదరిస్తారనడానికి నిదర్శనం ఎంపీ కేశినేని నాని ని మొండితోక జగన్ మోహన్ రావు అన్నారు. నందిగామ నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ నిధులు కేటాయిస్తూ.. నందిగామలో ఎంపీ నిధుల ద్వారా చేసే ప్రతి అభివృద్ధి పని వివరాలు స్థానిక ఎమ్మెల్యే అయిన నాకు సమాచారం ఇస్తున్న కేశినేని నానికి నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు అని ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలిచిన ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి అధికార, ప్రతిపక్షం అని చూడకుండా కలిసి కట్టుగా పనిచేస్తూ ప్రజలకు మేలు చేయాలన్నారు. టీడీపీ ఎంపీ నాని తమ నియోజకవర్గంలో పలు పనులకు నిధులు అందజేశారని, తోడ్పాటు అందించారని వైసీపీ ఎమ్మెల్యే చెప్పారు. ఎంపీ నాని వ్యవహారంపై టీడీపీలో చర్చ మొదలైంది. గత కొంతకాలం నుంచి కేశినేని నాని వ్యవహరంపై టీడీపీకి అంతు పట్టడం లేదని తెలిసిందే.
Also Read: Guntur News: జగన్‌కు విభజించి పాలించడం అలవాటైంది, బీసీ కార్పొరేషన్లన నామమాత్రం చేశారు: అచ్చెన్నాయుడు
APSSS KGBV: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీలో 1,358 టీచింగ్ పోస్టులు - వివరాలు ఇలా!
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!
Kodali Nani: వచ్చే ఎన్నికల్లో చెప్పు దెబ్బ తప్పదు, దమ్ముంటే అక్కడి నుంచి పోటీ చేయండి - బాబు, లోకేశ్‌కు కొడాలి నాని సవాల్
కడుపున పుడితే వారసులు కారు, ఎన్టీఆర్‌కు అసలైన వారసుడు ఆయనే - జగన్‌కు జీవితాంతం రుణపడతా: లక్ష్మీ పార్వతి
మహానాడు వేదికగా టీడీపీ తొలి మేనిఫెస్టో విడుదల - జగన్ వదిలేసిన హామీలపైనే ఫోకస్
Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం
IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి