అన్వేషించండి

Sai Krishna Murder Case: లాకప్ డెత్ ఒప్పుకోవాలని బలవంతం చేస్తున్నారు, ప్రాణహాని ఉంది: సీఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు

సాయికృష్ణ కేసులో నిజాలు రాబట్టేందుకు సీఐ నాగరాజును 12 రోజులు కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరింది. అయితే లాకప్ డెత్ కేసు ఒప్పుకోవాలని తనను బలవంతం చేస్తున్నారని న్యాయాధికారికి వీడియో కాల్ ద్వారా తెలిపారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సాయికృష్ణ కేసులో బలవంతం చేస్తున్నారని సీఐ నాగరాజు ఆరోపించారు.
  • సాయికృష్ణ హత్య నిజాలు తెలుసుకోవడానికి సిట్ కస్టడీ కోరింది.
  • కస్టడీకి ఇస్తే ప్రాణహాని అని నాగరాజు తరఫు లాయర్లు వాదించారు.
  • న్యాయస్థానం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

CI Nagaraju |  అమరావతి: సాయికృష్ణ హత్యకేసు వివాదంతో సస్పెండయిన కృష్ణలంక సీఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.  లాకప్ డెత్ కేసు ఒప్పుకునేలా బలవంతం చేస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న సీఐ నాగరాజుతో న్యాయాధికారి శ్రీకాంత్ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. 12 రోజుల పోలీస్ కస్టడీ కోరడంపై నిందితుడు నాగరాజు అభిప్రాయాన్ని అడగ్గా.. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే తనను ఇందులో ఇరికించారని చెప్పాడు. కస్టడీకి ఇస్తే పోలీసులు తనను శారీరకంగా ఇబ్బంది పెడతారని, తనకు ప్రాణహాని ఉందని వాపోయాడు. దీనిపై అభ్యంతరాలను జైలు అధికారుల ద్వారా ఈ-మెయిల్ చేయాలని సూచించిన న్యాయాధికారి, ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.

సంచలనం సృష్టించిన సాయికృష్ణ హత్య కేసులో నిజాలు బయటకు రావాల్సి ఉందనీ, ప్రధాన నిందితుడైన నాగరాజును పోలీస్ కస్టడీకి అప్పగించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం కోరింది. ఈ మేరకు సిట్ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ మంగళవారం రెండో AJMFC కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది సత్యవాణి కోర్టులో వాదనలు వినిపించారు. మృతదేహాన్ని మాయం చేసిన విధానం, సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసం చేయడం, రక్తపు మరకలున్న వస్తువుల వెనుక ఉన్న నిజా నిజాలను రాబట్టడానికి నిందితుడిని 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఆమె కోర్టును అభ్యర్థించారు.

నిందితుడి తరఫు లాయర్ల అభ్యంతరాలు
మరోవైపు, నిందితుడైన సీఐ నాగరాజు తరఫు న్యాయవాదులు రామచంద్రరావు, సాంబయ్య ఈ కస్టడీ పిటిషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే నిందితుడు 24 గంటల పాటు పోలీసుల ఆధీనంలోనే ఉన్నాడని, ఇప్పుడు మళ్లీ 12 రోజులు కస్టడీకి ఇస్తే తప్పుడు వాంగ్మూలం కోసం పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించి శారీరకంగా హింసించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ కోర్టు కస్టడీకి అనుమతించాలనుకుంటే కేవలం రెండు రోజులు సరిపోతుందని, విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోరారు. లేనిపక్షంలో రాజమహేంద్రవరం జైల్లోనే విచారణ జరుపుకోవాలని లేదా సీఐ ప్రాణాలకు ఎలాంటి హాని జరగదని పోలీసులు అఫిడవిట్ దాఖలు చేయాలని డిమాండ్ చేస్తూ మెమో ఫైల్ చేయడానికి 2 రోజుల గడువు కోరారు.

లాకప్ డెత్ అని తేల్చిన సిట్
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేస్తూ కోర్టుకు సంచలన రిమాండ్ రిపోర్టు సమర్పించింది. విచారణ పేరుతో స్టేషన్‌లో సాయికృష్ణపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడమే మరణానికి కారణమని సిట్ తేల్చింది.

దీనిపై స్పందించిన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, ఈ కేసు కేవలం సీఐ నాగరాజుకే పరిమితం కాలేదని, ఇందులో మరికొంతమంది పోలీసుల హస్తం కూడా ఉందని ఆరోపించారు. స్టేషన్‌లో తన కుమారుడిపై ఇంకా చాలా మంది పోలీసులు దాడి చేశారని, ఆ రోజు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌తో సహా బాధ్యులందరినీ వెంటనే అరెస్టు చేసి చట్టం ముందు నిలబెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. పోలీసులు తన బాధను పట్టించుకోకుండా కోర్టుకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ఉల్లంఘనపై సిట్ అధికారులు ఇప్పటికే సీఐ నాగరాజును అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తున్నారు.

Frequently Asked Questions

సీఐ నాగరాజును ఎందుకు సస్పెండ్ చేశారు?

సాయికృష్ణ హత్యకేసు వివాదంతో కృష్ణలంక సీఐ నాగరాజు సస్పెండయ్యారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో రిమాండ్‌లో ఉన్నారు.

సీఐ నాగరాజు చేసిన ప్రధాన ఆరోపణలు ఏమిటి?

లాకప్ డెత్ కేసు ఒప్పుకునేలా తనను బలవంతం చేస్తున్నారని, ప్రాణహాని ఉందని నాగరాజు ఆరోపించారు. ఈ కేసులో తనను ఉద్దేశపూర్వకంగానే ఇరికించారని వాపోయారు.

సీఐ నాగరాజును కస్టడీకి అప్పగించాలని పోలీసులు ఎందుకు కోరారు?

సాయికృష్ణ హత్య కేసులో నిజాలు బయటకు తీయడానికి సిట్ బృందం కస్టడీ కోరింది. మృతదేహాన్ని మాయం చేయడం, సీసీటీవీ ధ్వంసం వెనుక నిజాలను రాబట్టడానికి 12 రోజుల కస్టడీ అభ్యర్థించారు.

నాగరాజు తరఫు న్యాయవాదులు కస్టడీని ఎందుకు వ్యతిరేకించారు?

పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించి హింసించే ప్రమాదం ఉందని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. విచారణను ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని లేదా జైల్లోనే జరపాలని కోరారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget