Kesineni Nani: ఊర కుక్కలు గురించి నేను మాట్లాడను - ఎంపీ కేశినేని వివాదాస్పద వ్యాఖ్యలు
Kesineni Nani Comments: ఇటీవలే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కేశినేని నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, టీడీపీ నేతలను ఘాటు పదజాలంతో దూషించారు.
Vijayawada MP Kesineni Nani Comments: విజయవాడ పార్లమెంటరీ వైసీపీ సమన్వయకర్త, ఎంపీ కేశినేని నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని ఎంపీ కేశినేని అన్నారు. ఆయనకు ఇవే చివరి ఎన్నికలు అంటూ విమర్శించారు. నారావారిపల్లెలో వాళ్ళ తాతకు తప్ప చంద్రబాబుకు సొంతిల్లు లేదని అన్నారు. చంద్రబాబు కుమారుడు ఒక పనికి మాలినోడు అంటూ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన వెంట కొంత మంది ఊర కుక్కలను పెట్టుకుంటాడని.. పార్టీ నుంచి వెళ్ళే వారిపై విమర్శలు చేయడమే వారి పని అని ఎంపీ కేశినేని వ్యాఖ్యలు చేశారు. జాతీయ అధికార ప్రతినిధి అనే ఒక ఊర కుక్కని పెట్టుకుని సీఎంను బోసడికె అని తిట్టించిన నైజం చంద్రబాబుది అంటూ ఎంపీ కేశినేని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘‘వీళ్ళు సమాజానికి మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా అనేది చంద్రబాబు, లోకేష్ ను అడగాలి. ఊర కుక్కల మాటలను పట్టించుకోను, నాపై చెప్పు పెట్టి కొడతా అంటూ మాట్లాడిన మాటలు ప్రజలందరికి తెలుసు. ఎవరిని ఎక్కువగా తిడితే ఆ ఊర కుక్కలకు 5 పదవులు, కాల్ మనీ కుక్కలకు పదవులు దక్కుతుంటాయి. ఆ ఊర కుక్కల గురించి నేను ఎక్కువగా మాట్లాడను. మాలాంటి వ్యక్తులను దూరంగా చేసుకున్న వ్యక్తికి ఇవే చివరి ఎన్నికలు అవుతాయి’’ అని ఎంపీ కేశినేని వ్యాఖ్యలు చేశారు.
‘‘తిరువూరు నియోజకవర్గం పరిధిలో 65 వాటర్ ట్యాంకర్లు ఎంపీ నిధులతో అందజేశాం. చింతలపూడి ఎత్తిపోతల పదకాన్ని రూ.5 వేల కోట్లతో ఎలక్షన్ ముందర శంకుస్థాపన చేశారు చంద్రబాబు. అందులో కమీషన్లు బాగా మిగులుతాయని హడావుడిగా చేశారు. ఏ. కొండూరు ప్రాంతంలో కిడ్నీ రోగుల గురించి చంద్రబాబు ఏ రోజు పట్టించుకోలేదు. కానీ, జగన్ నిజాయతీగా పనులు చేశారు. ధనికులు పిల్లలతో చదువులో పోటీ పడేలా నాడు - నేడు కార్యక్రమం ద్వారా సీఎం జగన్ స్కూళ్లను అభివృద్ధి చేశారు’’ అని కేశినేని నాని అన్నారు.