MLA Kodali Nani: చంద్రబాబు మాటలే ప్రభావితం చేసుంటాయి, అందుకే మాచర్ల ఘటన - కొడాలి నాని ఎద్దేవా
MLA Kodali Nani: రాజకీయాల్లో గొడవలు ఇదే మొదటి, చివరి సారి కాదు.. గొడవలు సర్వ సాధారణం అని ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. మాచర్ల గొడవపై ఆయన మాట్లాడుతూ ఇలాంటి కామెంట్లు చేశారు.
MLA Kodali Nani: పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ నాయకులు.. వైసీపీ కార్యకర్తలపై దాడి పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనపై కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందిస్తూ.. రాజకీయాల్లో గొడవలు ఇదే మొదటి, చివరి సారి కాదని.. ఇలాంటి ఘటనలు సర్వ సాధారణం అన్నారు. శనివారం గుడివాడలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. పట్టణంలోనే ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన టీడీపీపై, రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఏడు పదుల వయసు ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును బట్టలూడదీసి బహిరంగంగా కొడతానని రోజూ అంటున్నారని గుర్తు చేశారు. ఆయన అడుగు జాడల్లోనే నడుస్తూ.. మాచర్లలో కొంత మంది చంద్రబాబును ఆదర్శంగా తీసుకొని ఉంటారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలు మాచర్ల ప్రజలను ప్రభావితం చేసి ఉంటాయని అన్నారు.
చంద్రబాబు అండతో వైయస్ఆర్ సీపీ కార్యకర్తలపై టిడిపి గూండాల దౌర్జన్య కాండ
— Kodali Nani (@IamKodaliNani) December 16, 2022
ప్రశాంతంగా ఉన్న సంక్షేమ రాజ్యంలో, ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి తనకివే చివరి ఎన్నికలు అని ఎంతకైనా దిగజారుతున్న నీచుడు#TDPGoons pic.twitter.com/q4UOFQ7Qgw
పల్నాడులో టీడీపీ రౌడీల రావణకాష్టం.
— YSR Congress Party (@YSRCParty) December 17, 2022
ఇదేం కర్మ కార్యక్రమంలో టీడీపీ గుండాల దౌర్జన్యం...
రెచ్చిపోయి వైసీపీ కార్యకర్తల తలలు పగులగొట్టిన టీడీపీ గుండాలు.#TDPGoons #ENDOfTDP#TDPAntiAP pic.twitter.com/IHBwBdxvoC
వారం రోజుల క్రితం ఎన్టీఆర్ ను తొక్కేస్తున్నారంటూ ఫైర్..
మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి టీడీపీపై ఫైర్ అయ్యారు. లోకేశ్ కు అడ్డువస్తాడనే జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేస్తున్నారని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తుందని కొడాలి నాని ఆరోపించారు. లోకేశ్ ను ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా చేసే ప్రయత్నాలను ప్రజలు అడ్డుకోవాలన్నారు. బీసీలను మళ్లీ వెనకకు నెట్టేందుకు టీడీపీ కుట్రలు చేస్తుందన్నారు. ఏపీని ఆక్రమించాలని పన్నాగాలు పన్నుతున్నారన్నారు.
జోగి రమేష్ మంత్రి అయితే తాను, పేర్ని నాని, వల్లభనేని వంశీ మంత్రులు అయినట్లే అని కొడాలి నాని స్పష్టం చేశారు. ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరి దమ్ము ధైర్యం కేవలం జగన్ లో మాత్రమే ఉన్నాయన్నారు. అలాంటి జగన్ ను కాపాడుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉందన్నారు. జోగి రమేష్ మంత్రి అయితే నేను మంత్రినే! ఏపీని ఆక్రమించేందుకు ఓ కులం పన్నాగాలు పన్నుతోందని మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి చెందిన ఓ సామాజిక వర్గం ఈ రాష్ట్రాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తనను మంత్రివర్గం నుంచి తొలగించడంపై ఆయన స్పందించారు. ఎమ్మెల్యే జోగి రమేష్ ను మంత్రిని చేయడంపై ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు కొడాలి కౌంటర్ ఇచ్చారు. జోగి రమేష్ మంత్రి అయితే తాను, మాజీ మంత్రి పేర్ని నాని, గన్నవరం ఎమ్మెల్యే వంశీ మంత్రులు అయినట్లే అన్నారు.