అన్వేషించండి

Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 

గుంటూరులో అమానుషమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళలను కొందరు వ్యక్తులు నీచంగా వివస్త్రను చేసి దాడి చేశారు. దీనిపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. బాధ్యులను అరెస్టు చేయాలని ఆదేశించారు.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • గుంటూరులో నీటి మోటార్ వివాదంపై మహిళను వివస్త్రను చేసి దాడి.
  • టీడీపీ నేత మల్లెల మూర్తి సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు.
  • సీఎం చంద్రబాబు స్పందన, నిందితుడి అరెస్టు, పార్టీ సస్పెన్షన్.

Guntur Crime News: గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో తాగునీటి విషయంలో జరిగిన గొడవలో ఓ మహిళను అతి నీచంగా కొట్టారు. ఆమెను వివస్త్రను చేసి దాడి చేశారు. ఈ దాడిలో మల్లెల మూర్తి అనే టీడీపీ నేత హస్తం ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఓ మహిళ ఇంటి మోటార్ తొలగించడంపై వివాదం మొదలైంది. 

చాలా కాలంగా ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న మహిళ ఇంటి పైప్‌లైన్‌కు ఒక మోటార్‌ ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ మధ్య ఆ ప్రాంతంలో సిమెంట్ రోడ్డువేశారు. దీంతో ఆ మోటార్‌ను తొలగించాలని స్థానిక నేత మల్లెల వెంకటరమణ మూర్తి మహిళకు చెప్పారు. వినకపోవడంతో అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు జోక్యం చేసుకున్నప్పటికీ మోటార్‌తో సిమెంట్ రోడ్డుకు ఎలాంటి ఇబ్బంది లేదని వాదించారు. ఈ క్రమంలోనే వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూర్తి అనే వ్యక్తి బెదిరిస్తున్నాడని అందులో పేర్కొన్నారు.  

పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వచ్చిన తర్వాత ఆ మహిళపై దాడి జరిగింది. మూర్తీ, ఆయన చెల్లి వరుస అయ్యే ట్రాన్స్‌ జెండర్‌ మాధవితోపాటు అంతా కలిసి మహిళపై దాడి చేశారు. ఆమెను కిందపడేసి తొక్కారు.ఆమె వేసుకున్న బట్టలను చించేశారు. బూతులు తిడుతూ కొట్టారు. స్థానికులు వచ్చి నిలదీయడంతో అక్కడి నుంచి వారంతా జారుకున్నారు. చుట్టుపక్కల వారంతా ఆమెను నగరంపాలెం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు మూర్తితోపాటు దాడి చేసిన 8 మందిపై కేసులు నమోదు చేశారు. 

గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం చంద్రబాబు సీరియస్

దీని గురించి తెలుసుకున్న ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై ఎక్స్‌వేదికగా స్పందించారు. ఘటన తనను కలచివేసిందని అన్నారు. ఏ మహిళనైనా అవమానించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఇలాంటి ఘటనలకు సమాజంలో తావు లేదని స్పష్టం చేశారు. ఘటనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం ఎక్స్ వేదికగా తెలిపారు. నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారని, ఘటనకు సంబంధం ఉన్న వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, రాజకీయ పార్టీల పేరు చెప్పుకుని తప్పులు చేయాలనుకునే వారికి ఎలాంటి రక్షణ ఉండదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి మహిళకు గౌరవం, భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

ఇప్పటికే దీనిపై హోంశాఖ మంత్రి అనిత స్పందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని అన్నారు. గుంటూరులో మహిళపై దాడి చేసిన వారని చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలని ఆదేశించారు.. ఎస్పీతో మాట్లాడిన ఆమె కేసు పూర్తి వివరాలు తెలుసుకున్నారు. 

Frequently Asked Questions

గుంటూరులో మహిళపై దాడికి కారణం ఏమిటి?

కృష్ణబాబు కాలనీలో తాగునీటి మోటార్ తొలగింపు విషయంలో మొదలైన వివాదం దాడికి దారితీసింది. మల్లెల మూర్తి అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ గొడవ పెద్దదైంది.

మహిళపై దాడిలో ఎవరు పాల్గొన్నారు?

మల్లెల మూర్తి, అతని చెల్లి వరుస అయ్యే ట్రాన్స్‌జెండర్ మాధవితో పాటు మరో ఆరుగురు (మొత్తం 8 మంది) ఈ దాడిలో పాలుపంచుకున్నారు. పోలీసులు వీరిపై కేసులు నమోదు చేశారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా స్పందించారు?

సీఎం చంద్రబాబు ఈ ఘటన తనను కలచివేసిందని పేర్కొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశించారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

ఈ దాడిపై పోలీసులు తీసుకున్న చర్యలు ఏమిటి?

బాధితురాలు ఫిర్యాదు చేయగా, పోలీసులు మల్లెల మూర్తితో సహా దాడికి పాల్పడిన 8 మందిపై కేసులు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసినట్లు సీఎం తెలిపారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget