అన్వేషించండి

Andhra Pradesh: చీరాలలో సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి హత్య- కారణం తెలిస్తే షాక్ అవుతారు

Andhra Pradesh Crime News: చీరాలలో ఓ యువకుడి హత్య సంచలనంగా మారింది. సైకిల్‌పై వెళ్తన్న వ్యక్తిని ఐదుగురు వ్యక్తులు హత్య చేసి పారిపోయారు.

Chirala Murder: బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలో దారుణం జరిగింది. సైకిల్‌పై వెళ్తున్న 18 ఏళ్ల సయ్యద్ ఆరీఫ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు పొడిచి పడేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యువకుడు చనిపోయాడు. 

మంగళవారం రోజున చీరాల నుంచి ఈపూరుపాలెం  వస్తున్నాడు ఆరీఫ్. అతనితో స్నేహితుడు మనోజ్ కూడా ఉన్నారు. ఇతను సైకిల్‌పై ఉంటే మనోజ్‌ బైక్‌పై వెళ్తున్నాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఆదినారాయణపురం వద్దకు వచ్చేసరికి ఓ కారు వాళ్ల వెనకాలే వచ్చింది. హారన్ మోగించింది. వాళ్లు పక్కకు తప్పుకున్నారు.  

రెండు అడుగులు దూరం వెళ్లిన కారు ఆగింది. ఆరీఫ్‌, మనోజ్‌ వెళ్తుండగా వారిని పట్టుకొని కొట్టడం ప్రారంభించారు కారులోని వ్యక్తులు. ఏం జరుగుతోందని తెలుసుకునేలోపు బూతులు తిడుతూ కారు వస్తుంటే తప్పుకోవడం తెలియదా అంటు ఐదుగురు వచ్చి రుబాబు చేశారు. 

సైకిల్‌పై వెళ్తున్న ఆరీఫ్‌ను కొట్టిన ఐదుగురు వ్యక్తులు కారులో ఉన్న కత్తులు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు పొడిచారు. దీంతో మనోజ్ భయపడిపోయాడు. ఆరీఫ్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆరీఫ్ చనిపోయినట్టు వైద్యులు చెప్పారు. 

స్థానికుల సమాచారంతో స్పాట్‌కు వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. స్పాట్‌లోనే ఉన్న మనోజ్‌ స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ఏం జరిగిందో తెలుసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. కేవలం కారుకు సైడ్ ఇవ్వలేదని హత్య చేశారా లేకుంటే ప్లాన్ ప్రకారం జరిగిందా అనేది తేల్చే పనిలో ఉన్నారు.మృతుడి తండ్రి చీరాలలో ఓ వస్త్ర దుకాణ యజమానికి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 

టాప్ హెడ్ లైన్స్

Jogi Ramesh Latest News:మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు! జోగి రాజీవ్ భార్య మేఘన ఫిర్యాదు
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు! జోగి రాజీవ్ భార్య మేఘన ఫిర్యాదు
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Brezza Facelift: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
Embed widget