అన్వేషించండి

JP Nadda Speech: ఆంధ్రాకి బీజేపీ చాలా అవసరం - అవన్నీ జగన్ స్కీంలు కావు, మోదీవి: జేపీ నడ్డా

JP Nadda: బీజేపీ శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌ల సమావేశం విజయవాడలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో నడ్డా పాల్గొని ప్రసంగించారు.

JP Nadda in Vijayawada Meet: ఆంధ్రప్రదేశ్ కు ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ అవసరం బాగా ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధిపై సమష్ఠిగా చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు. మార్పు కోసం మనం ప్రతి ఇంటి తలుపు తట్టాలని, దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కులమతాలకు అతీతంగా అందరం కలిసి పనిచేయాలని జేపీ నడ్డా పిలుపునిచ్చారు. బీజేపీ శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌ల సమావేశం విజయవాడలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో నడ్డా పాల్గొని ప్రసంగించారు.

విజయవాడలో సమావేశం అవ్వడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకే మనం ఉన్నామని అన్నారు. అర్జునుడు తపస్సు చేసిన ప్రాంతం ఇదని అన్నారు. ఏపీలో పదివేలకు పైగా శక్తి కేంద్రాలున్నాయని, ప్రతి శక్తి కేంద్రంలోకి ఐదారు పోలింగ్ బూత్ లు వస్తాయని అన్నారు. ప్రతి బూత్ కమిటీలో అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిథ్యం ఉండాలని అన్నారు. కమిటీల ఏర్పాటు ప్రక్రియ నెలలో పూర్తి కావాలని సూచించారు.

దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రతి చోట బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కొత్త వారిని పార్టీలో చేర్చుకొనే అంశంపై పని చేయాలని చెప్పారు. బూత్ కమిటీల్లో అన్ని వర్గాల భాగస్వామ్యం ఉండేలా చూడాలని నిర్దేశించారు. బీజేపీ అన్ని వర్గాల పార్టీ అనే భావన వచ్చేలా పని చేయాల్సిన శక్తి కేంద్ర ప్రముఖులపై ఉంటుందని అన్నారు. 

ఆయుష్మాన్ భారత్ నిధులతోనే ఆరోగ్య శ్రీ - జేపీ నడ్డా
ఆయుష్మాన్ భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన పథకాన్ని అమలు చేస్తోందని, దాన్ని ఆరోగ్య శ్రీ పేరుతో జగన్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటూ లాభం పొందుతోందని విమర్శించారు. అది జగన్ ప్రవేశపెట్టిన పథకం కాదని, నరేంద్ర మోదీ పెట్టిన పథకం అని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా రూ.5 లక్షల వరకూ కేంద్రం నుంచి వైద్య సాయం అందుతున్న విషయాన్ని బీజేపీ కార్యకర్తలే ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ ఎక్కడైనా పని చేస్తుందని, అదే ఆరోగ్య శ్రీ అయితే, రాష్ట్రం దాటితే పని చేయబోదని జేపీ నడ్డా అన్నారు. పీఎం కిసాన్ యోజన కింద ఏటా రూ.6 వేలను రైతుల ఖాతాల్లో తామే వేస్తున్నామని జేపీ నడ్డా చెప్పుకొచ్చారు. దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వ ముద్ర వేసుకొని చెలామణి అవుతున్నారని విమర్శించారు.

మన్ కీ బాత్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెలా ఇచ్చే సందేశాన్ని పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి వినాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత ప్రధాని సందేశాన్ని అక్కడి ప్రజలతో చర్చించి వారికి చేరవేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ఏపీ బీజేపీ ప్రత్యేక పుస్తకం విడుదల చేసిందని అన్నారు. అందులోని విషయాలను ప్రజలకు చేరవేయాలని నడ్డా కోరారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో జగన్‌ సమావేశం
రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో జగన్‌ సమావేశం
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే

వీడియోలు

Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget