Raghurama Vs Vijaisai : నువ్ తమలపాకుతో ఒకటంటే..నే తలుపు చెక్కతో రెండంటా ! హాట్ టాపిక్‌గా విజయసాయిరెడ్డి - రఘురామ ట్వీట్ వార్
ఇద్దరూ అధికార పార్టీ ఎంపీలే. కాకపోతే ఒకరు పార్టీకి దూరంగా ఉన్నారు. ఒకరు అసభ్యంగా ట్వీట్ చేయడం.. దానికి అదే లాంగ్వేజ్‌లో మరోకరు కౌంటర్ ఇవ్వడం రోజూ సాగుతోంది
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల మధ్య ట్వీట్ వార్ వ్యక్తిగత దూషణల స్థాయికి వెళ్లిపోతోంది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి .. రఘురామకృష్ణరాజును ఉద్దేశించి నాటు పదాలను ఉపయోగించి రోజు ఓ ట్వీట్ ఖచ్చితంగా పెడుతున్నారు. దానికి రఘురామకృష్ణరాజు కూడా అదే స్థాయిలో రిప్లయ్ ఇస్తున్నారు. దీంతో రోజూ వీరిద్దరి ట్వీట్లు నెటిజన్లకు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇద్దరూ ఒకే పార్టీకి చెందినప్పటికీ రఘురామకృష్ణరాజు కొంత కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో విభేదిస్తున్నారు.
సంక్రాంతి పండుగ అయిపోయి చాలా రోజులైన తర్వాత హఠాత్తుగా కోడి పందాల ప్రస్తావన తీసుకు వచ్చి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి .. రఘురామకృష్ణరాజుపై విమర్శలు గుప్పించారు. ఆయన ఫారం కోడి అని.. టీడీపీ ట్యూన్లకు రికార్డింగ్ డాన్సులు వేస్తారని మండిపడ్డారు.
కోడి పందాలు మా సంస్కృతి అంటూ సుప్రీం కోర్టు వరకు వెళ్ళాడు. అందరూ అతన్ని పందెం కోడి అనుకున్నారు. కానీ అతను ఫారం కోడి అని తేలిపోయింది. టీడీపీ ట్యూన్లకు రికార్డింగ్ డాన్స్ వేసే డాన్సింగ్ రాజా అతను. ఆ నర్సాపురం పంజరం చిలుక ఢిల్లీలో కూర్చుని పలికేవన్నీ పచ్చ గ్యాంగ్ రాసిచ్చిన పలుకులే.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 24, 2022
దీనికి వెంటనే రఘురామకృష్ణరాజు కూడా కౌంటర్ ఇచ్చారు. కోడి కత్తిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చారని విమర్శించారు. తన మీద పోటీకి పందెం కోడిగా రావాలని ఈకలు పీకి పంపిస్తానని సవాల్ చేశారు.
కోడి కత్తిని అడ్డంపెట్టుకుని వచ్చిన మీరు ఇంత కన్నా ఏమంటారులే. ఎలాగో నీకు రాజ్యసభ రెన్యువల్ లేదు కాబట్టి నువ్వు నా మీదకు పందెం కోడిగా రా. నీ ఈకలు పీకి పంపిస్తా! అవునుకానీ, నువ్వు ఏ1 ట్యూన్స్ కి డాన్స్ చేస్తున్నావా లేక విశాఖలో ఇంకెవరైనా కడుతున్న ట్యూన్స్ కి డాన్స్ చేస్తున్నావా? https://t.co/2u9qvFMIBH
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) January 24, 2022
నాలుగు రోజుల క్రితం రఘురామకృష్ణరాజుకు పాంటోఫోబియా అనే వ్యాధి ఉందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి చెప్పిన వ్యాధి లక్షణాలను పోస్ట్ చేసిన రఘురామ..అవన్నీ ఎవరికి ఉన్నాయో చూసుకోవాలని కౌంటర్ ఇచ్చినట్లుగా ట్వీట్ చేశారు
A message from a learned person highlighting the stupidity of A2! https://t.co/nGDeM5strP pic.twitter.com/IkAR592Ibi
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) January 21, 2022
అదే రోజు ఎవరి మెప్పు కోసం విప్పుకు తిరగడం వంటి పదాలతో విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తే.. కౌంటర్‌కు విశాఖ యువతుల మీద ప్రేమ బాణాలు విసురుతున్నావని రఘురామ కౌంటర్ఇచ్చారు. వీరిద్దరి ట్వీట్లు.. నెటిజన్లలో పలు రకాల చర్చలు.. అనుమానాలకు కారణం అయ్యాయి.
నువ్వు నీ ప్రేమ బాణాలు విశాఖ నవ యువతుల మీద విసురుతున్నావు అంట కదా! పని చెయ్యకుండా ప్రజలను పీక్కుతింటున్న మిమ్మల్ని త్వరలో ఆ ప్రజలే రాళ్లతో కొడతారు. నువ్వు ఎన్ని ట్వీట్లు పెట్టినా ఏ1 నీకు రాజ్యసభ రెన్యువల్ చెయ్యడు అంట. ముందు నువ్వు ఏ1 చేతిలో తన్నులు తినకుండా ఉండేలా చూసుకో. https://t.co/FlBmvkjyau— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) January 21, 2022
Also Read: Also Read: మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్‌పై సైబర్ అటాక్.. ప్లాన్ ప్రకారం ఖాతాలు తెరిచి రూ.12 కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్లు
ఇలా ఇద్దరు అధికార పార్టీ ఎంపీలు ఇలా సోషల్ మీడియాలో తిట్టుకోవడం హాట్ టాపిక్‌గా మారుతోంది. వీరిని కంట్రోల్ చేయడానికి వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ కూడా ప్రయత్నించడం లేదు . దీంతో ఎంపీల భాష ఇలా ఉంటుందేంటి అని నెటిజన్లు కూడా ఆశ్చర్యపోవాల్సిన పరస్థితి ఏర్పడింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి