అన్వేషించండి

AP New Districts: ఏపీలో మరో 13 కొత్త జిల్లాలు... ఉగాదిలోపు అమల్లోకి వచ్చే అవకాశం... నేడో, రేపో నోటిఫికేషన్ విడుదల..!

రాష్ట్రంలో కొత్త జిల్లాలో ఏర్పాటు మరోసారి తెరపైకి వచ్చింది. ఉగాదిలోపు కొత్త జిల్లాలను అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తుంది. ఈ మేరకు ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు మరోసారి వెలుగులోకి వచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఉగాదిలోపు ఈ ప్రక్రియ పూర్తిచేసి కొత్త జిల్లాలను అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలోని ప్రతీ లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటుచేస్తామని వైసీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది.  అయితే జనాభా లెక్కల సేకరణ ఇంకా పూర్తికాకపోవడంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు జాప్యం జరుగుతోందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. జనాభా లెక్కల సేకరణ పూర్తయ్యేంత వరకు జిల్లాల భౌగోళిక సరిహద్దులు మార్చవద్దని కేంద్ర మార్గదర్శకాలు ప్రస్తుతానికి అమల్లో ఉన్నాయి. 2021 మే నాటికి జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ పూర్తి కావలసి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. 

కొత్తగా 13 జిల్లాలు

రాష్ట్రంలో 25 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో మొత్తం జిల్లాల సంఖ్య 26కు చేరనుంది. లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలనుకున్నా అరకు లోక్‌సభ స్థానం భౌగోళికంగా ఎక్కువ ప్రాంతంలో విస్తరించి ఉండడంతో దానిని రెండు జిల్లాలుగా విభజించాలని గతంలో సీఎస్ కమిటీ ప్రతిపాదనలు చేసింది. దీంతో అరకు పార్లమెంట్ స్థానాన్ని రెండు జిల్లాలుగా చేస్తే రాష్ట్రంలో కొత్తగా రెండు గిరిజన జిల్లాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం ఏదో ఒక జిల్లాలో ఉండేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Also Read: నేడే మహిళల ఖాతాల్లో నగదు జమ... ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్

ఉగాదిలోపు ప్రకటన..!

కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందుగా రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ నోటిఫికేషన్ పై సూచనలు, సలహాల కోసం 30 రోజుల గడువు ఇస్తుంది. ఈ సూచనల మేరకు అవసరమైతే మార్పులు, చేర్పులు చేస్తారు. అనంతరం జిల్లాల పునర్వ్యస్థీకరణ తుది నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. ఈ నోటిఫికేషన్‌లో కొత్త జిల్లాలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో తెలుపుతారు. ఆ తేదీ నుంచి కొత్త జిల్లాలు ఏర్పాడినట్లు ప్రభుత్వం నోటిఫై చేస్తుంది. ఈలోపు కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా స్థాయి అధికారులను ప్రభుత్వం నియమిస్తుంది. ఈ ప్రక్రియను ఉగాదిలోపు పూర్తిచేసి కొత్త జిల్లాలను ప్రకటించాలని ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తుంది. 

Also Read: మహేష్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌‌పై సైబర్ అటాక్.. ప్లాన్ ప్రకారం ఖాతాలు తెరిచి రూ.12 కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్లు

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఏపీలో మారిన రాజకీయం.. స్థానిక ఎన్నికల్లో పొత్తుపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో మారిన రాజకీయం.. స్థానిక ఎన్నికల్లో పొత్తుపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Allagadda Politics: ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?
ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Embed widget