By: ABP Desam | Updated at : 25 Jan 2022 07:59 AM (IST)
Edited By: Satyaprasad Bandaru
సీఎం జగన్(ఫైల్ ఫొటో)
అగ్రవర్ణ మహిళలకు ఆర్థిక సాధికారత లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించింది. ఆర్థికంగా వెనుకబడిన వారిలో 45-60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఈ పథకం ద్వారా ఏటా రూ.15 వేల ఆర్థికసాయం అందిస్తారు. ఈ ఏడాది నిధుల విడుదల సంబంధించిన కార్యక్రమాన్ని సీఎం జగన్ మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఒక్కో మహిళకు ఏటా రూ.15 వేల చొప్పున మూడేళ్లపాటు అందిస్తారు. రాష్ట్రంలోని రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతోపాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 3.93 లక్షల మంది మహిళలకు ఆర్థిక సాయం అందనుంది. రూ.589 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ బటన్ నొక్కి వీరి ఖాతాల్లో వేయనున్నారు.
మహిళల సాధికారతే లక్ష్యంగా
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకంలో 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతోపాటు ఓసీ వర్గాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఏటా రూ. 15 వేలు మూడేళ్లలో మొత్తం రూ. 45,000 ఆర్థిక సాయం అందిస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే వైఎస్ఆర్ చేయూత పథకం కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద మహిళలకు ఏటా రూ. 18,750 చొప్పున నాలుగేళ్ల పాటు అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే వైఎస్ఆర్ కాపునేస్తం ద్వారా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల్లోని మహిళలకు ఏటా రూ. 15 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నారు. మేనిఫెస్టోలో పెట్టకపోయినా అగ్రవర్ణ పేద మహిళలకు వైఎస్ఆర్ ఈజీసీ నేస్తం పథకం ద్వారా ఏటా రూ. 15 వేలు అందివ్వడంతో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల వయసు గల పేద మహిళలకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది.
మహిళల ఆర్థిక సాధికారతతో పాటు సంక్షేమం, ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అందులో భాగంగా గర్భవతులు, బాలింతలు, చిన్నారుల కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం అందిస్తున్నట్లు వెల్లడించింది. మహిళ ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొంది. మహిళల భద్రత కోసం అభయం, దిశ యాప్, గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్ల నియామకం చేపట్టినట్లు వెల్లడించింది. మహిళలకు సాధికారతే లక్ష్యంగా ఇళ్ల పట్టాలు వాళ్ల పేరు మీద ఇస్తున్నట్లు పేర్కొంది.
Also Read: అసలు నేనెలా పుట్టాను.. ఏదో శబ్దం వచ్చింది.. చూసేసరికి ఇక్కడ పడి ఉన్నాను
Kakinanda News : ఎమ్మెల్సీ అనంతబాబు ఇగో హర్ట్ అయి నెట్టడంతో డ్రైవర్ మృతి - ఎస్పీ రవీంద్రనాథ్
AP News : విశాఖ రుషికొండ తవ్వకాల స్టే, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్
Mlc Anantababu Arrest : ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు, కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు
Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, రేపు ఆర్జితసేవా టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల
Nellore Crime : సినిమా స్టైల్ లో వెంటాడి మరీ దొంగతనం, పట్టించిన సీసీ కెమెరాలు
Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!
Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!