News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Top Headlines Today: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు!- సోనియా సమక్షంలో కాంగ్రెస్‌లోకి తుమ్మల

Top 5 Telugu Headlines Today 01 September 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

FOLLOW US: 
Share:
Top 5 Telugu Headlines Today 01 September 2023: 
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు- ఓ జాతీయ న్యూస్‌ పోర్టల్ సంచలన కథనం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఆదాయ పన్ను శాఖ షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్టు ప్రచారం. రూ.118 కోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై నోటీసులు జారీ చేసినట్లు ప్రముఖ న్యూస్ వెబ్ సైట్ హిందుస్తాన్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఇన్ఫ్రా  సంస్థల సబ్ కాంట్రాక్టుల ద్వారా ఆయన వంద కోట్లకుపైగా అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలు ఆయనపై ఉన్నాయని ఆ కథనం సారాంశం. చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించిన తర్వాత.. ఆగస్టు 4వ తేదీనే హైదరాబాద్‌ ఐటీ సెంట్రల్‌ సర్కిల్‌ కార్యాలయం సెక్షన్ 153C కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. షోకాజ్‌ నోటీసుల్లో..  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థల నుంచి వచ్చిన రూ.118 కోట్ల మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదని ఐటీ శాఖ ప్రశ్నించిందట.  పూర్తి వివరాలు
 
కోర్టు అనుమతితో విదేశీ పర్యటనకు సీఎం జగన్ రెడీ- నేతలకు టాస్క్‌లు ఇవ్వకపోవడంపై చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటకు రెడీ అయ్యారు. సీబీఐ న్యాయ స్థానం నుంచి కూడా అనుమతి రావటంతో ఇక ఆయన ఫ్లైట్ ఎక్కటమే తరువాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విదేశీ పర్యటనకు వెళుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరిగి రాగానే ఏదో అద్భుతం జరుగుతుందనే అభిప్రాయంలో పార్టీ వర్గాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ఇంకా ప్రారంభం కాకుండానే ఆయన తిరిగి రాగానే సమ్ థింగ్ అనే ఊహాగానాలు మాత్రం పార్టీలో హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. పార్టీ వర్గాలు కూడా ఇదే విషయం పై చర్చిస్తున్నాయి.  పూర్తి వివరాలు
 
సోనియా సమక్షంలో కాంగ్రెస్‌లోకి-ముహుర్తం ఫిక్స్ చేసుకున్న తుమ్మల
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు...హస్తం కండువా కప్పుకోనున్నారు. ఈ నెల 5న ఆయన అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహుర్తం  ఖరారు చేసుకున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, సీనియర్‌ నేత మల్లు రవి... గురువారం తుమ్మల ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.  రేవంత్‌ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మాజీ మంత్రి తుమ్మల... 5న కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో చేరేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పాలేరు అసెంబ్లీ టికెట్‌ ఇచ్చేందుకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.  పూర్తి వివరాలు
 
రేపే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీ-హైదరాబాద్‌లో 12వేల ఇళ్లు
పేదలకు సొంత ఇల్లు ఒక కల. ఆ కల నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చారు. పేదల సొంతిటి కల నిజమై.. వారు ఆత్మగౌరవంతో  జీవించాలనే లక్ష్యంతో ఈ పథకం ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్లు, విద్యుత్‌, డ్రైనేజీ, తాగునీరు వంటి అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లను  నిర్మించారు. వాటిని దశల వారీగా పంపిణీ చేస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రేపే ఆ ఇళ్లను పేదలకు పంపిణీ చేయనున్నారు. 24 నియోజకవర్గాలకు చెందిన  లబ్ధిదారులకు 11వేల 700 గృహాలను అందజేయనున్నారు. పూర్తి వివరాలు
 
టీడీపీ సీనియర్ లీడర్ అయ్యన్న అరెస్టు- శ్రేణులు అడ్డుకోవడంతో విడిచిపెట్టిన పోలీసులు!
లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కేసులో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా పోలీసులు ఆయన్ని విశాఖ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. గన్నవరంలో జరిగిన బహిరంగ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న  కారణంతో టీడీపీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ చేస్తున్న పాదయాత్రలో భాగంగా ఈ మధ్య గన్నవరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.  ఈ సభలో సీఎం, మంత్రులు, ఇతర వైసీపీ లీడర్లపై అయన్న దూషించారని కేసులు రిజిస్టర్ అయ్యింది.  పూర్తి వివరాలు

Published at : 01 Sep 2023 03:04 PM (IST) Tags: BJP YSRCP AP Latest news BRS Telangana LAtest News #tdp

ఇవి కూడా చూడండి

Chandrababu Hunger Strike: నేడు రాజమండ్రి జైల్లో చంద్రబాబు, ఢిల్లీలో లోకేష్ నిరాహార దీక్ష - భువనేశ్వరి సైతం!

Chandrababu Hunger Strike: నేడు రాజమండ్రి జైల్లో చంద్రబాబు, ఢిల్లీలో లోకేష్ నిరాహార దీక్ష - భువనేశ్వరి సైతం!

TTD News: అక్టోబర్ 29న చంద్రగ్రహణం, 28న రాత్రి తిరుమల శ్రీవారి ఆలయం మూత

TTD News: అక్టోబర్ 29న చంద్రగ్రహణం, 28న రాత్రి తిరుమల శ్రీవారి ఆలయం మూత

AP Revenue Services Association: రెవెన్యూ ఉద్యోగులకు సమస్యలున్నాయని తెలుసు, సీఎం దృష్టికి తీసుకెళ్తా: మంత్రి ధర్మాన

AP Revenue Services Association: రెవెన్యూ ఉద్యోగులకు సమస్యలున్నాయని తెలుసు, సీఎం దృష్టికి తీసుకెళ్తా: మంత్రి ధర్మాన

విజయవాడ దుర్గగుడి ఈవోగా శ్రీనివాసరావు నియామకం, భ్రమరాంబపై వేటు!

విజయవాడ దుర్గగుడి ఈవోగా శ్రీనివాసరావు నియామకం, భ్రమరాంబపై వేటు!

Avanigadda: జగనన్నకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతాం - నిరుద్యోగుల హెచ్చరిక

Avanigadda: జగనన్నకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతాం - నిరుద్యోగుల హెచ్చరిక

టాప్ స్టోరీస్

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ

Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!

Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!