By: Arun Kumar Veera | Updated at : 28 Apr 2024 01:24 PM (IST)
ఆదాయ పన్ను భారం రూ.లక్షన్నర తగ్గినట్లే
Post Office Schemes: ప్రస్తుతం, ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్ (Income Tax Return Filing 2024) సీజన్ నడుస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరం లేదా 2024-25 మదింపు సంవత్సరానికి ఇప్పుడు ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేయవచ్చు, జులై 31 వరకు దీనికి గడువు ఉంది. ఆదాయ పన్నుకు, పోస్టాఫీస్ పథకాలకు లింక్ ఉంది. ప్రస్తుతం, పోస్టాఫీస్ ద్వారా అనేక రకాల పెట్టుబడి లేదా పొదుపు పథకాలు ప్రజలకు చేరవయ్యాయి. పోస్టాఫీస్ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు కాబట్టి వాటిలో నష్టభయం ఉండదు.
పోస్టాఫీస్ పథకంలో పెట్టుబడితో మంచి రాబడి సంపాదించడం మాత్రమే కాదు, ఆదాయ పన్నును కూడా ఆదా (Tax saving) చేయవచ్చు. అంటే.. ఒక చేత్తో ఆదాయం సంపాదించొచ్చు, మరో చేత్తో ఆదాయ పన్ను భారాన్ని తప్పించుకోవచ్చు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇదే.
పోస్టాఫీస్ పథకాల్లో జనాదరణ పొందిన వాటిలో టైమ్ డిపాజిట్ (Post Office Time Deposit) ఒకటి. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతాలు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల మెచ్యూరిటీ పిరియడ్‌తో, వివిధ వడ్డీ రేట్లతో (Interest on Post Office Time Deposits) అందుబాటులో ఉన్నాయి. ఇవి బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల (Fixed Deposits) వంటివే.
1 సంవత్సరం టైమ్ డిపాజిట్ మీద 6.90 శాతం వడ్డీ ఇస్తున్నారు.
2 సంవత్సరాల కాల డిపాజిట్ మీద 7.00 శాతం వడ్డీ ఆఫర్ చేశారు.
3 సంవత్సరాల కాల డిపాజిట్ మీద 7.10 శాతం వడ్డీ చెల్లిస్తారు.
5 సంవత్సరాల కాల డిపాజిట్ మీద 7.50 శాతం వడ్డీ లభిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: సెక్షన్ 80C పరిధి చాలా పెద్దది - దీని రేంజ్‌లోకి వచ్చే పెట్టుబడుల పూర్తి వివరాలు ఇవిగో
ఏ డిపాజిట్‌పై టాక్స్ బర్డెన్ తగ్గుతుంది?
వీటిలో... 5 సంవత్సరాల కాల డిపాజిట్ మీద మాత్రమే ఆదాయ పన్ను మినహాయింపు లభిస్తుంది. మిగిలిన టైమ్ డిపాజిట్లకు ఈ వెసులుబాటు లేదు. 5 సంవత్సరాల కాల పరిమితి ఖాతాలో పెట్టిన పెట్టుబడిపై, ITR ఫైలింగ్ సమయంలో, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మినహాయింపు పొందొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో (Financial Year) గరిష్టంగా 1.50 లక్షల రూపాయల వరకు పన్ను భారం తగ్గించుకోవచ్చు.
NSCలోనూ గరిష్ట వడ్డీ ఆదాయం + పన్ను నుంచి ఉపశమనం
పోస్టాఫీస్ ఖాతాల్లో పాపులారిటీ ఉన్న మరో పథకం 'నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్' (National Saving Certificate - NSC) స్కీమ్. ప్రస్తుతం, ఈ పథకం కింద 7.70 శాతం వడ్డీ (Interest on NSC) లభిస్తుంది. ఈ ఏడాది జూన్ 30 వరకు ఇదే రేటు వర్తిస్తుంది. NSCలో పెట్టుబడి పెడితే ఆకర్షణీయమైన వడ్డీ ఆదాయంతో పాటు ఆదాయ పన్నును కూడా ఆదా చేయవచ్చు. ఈ పథకంలో పెట్టుబడికి సైతం, ఒక ఆర్థిక సంవత్సరంలో, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ. 1.50 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: సొంత హెల్త్ ఇన్సూరెన్స్ Vs కంపెనీ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ - మీకు ఈ విషయాలు తెలియాలి
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్
Gold-Silver Prices Today 21 Nov: రూ.78,000 పైనే పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Provident Fund: ఈపీఎఫ్ బకాయిలను మీ కంపెనీ ఎగ్గొట్టిందా?, ఇలా చేస్తే మీ డబ్బు తిరిగొస్తుంది!
Investment Tips: పిల్లల చదువు ఖర్చుల కోసం మీరు కష్టపడొద్దు, మార్కెట్‌కు ఆ పని అప్పజెప్పండి
Gold-Silver Prices Today 20 Nov: యుద్ధభయంతో పెరుగున్న పసిడి - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ