By: Arun Kumar Veera | Updated at : 20 Nov 2024 01:32 PM (IST)
మీ పిల్లల చదువు కోసం మార్కెట్ డబ్బులిస్తుంది ( Image Source : Other )
Investing In Equity Index Funds: పిల్లల భవిష్యత్తే ప్రతి తల్లిదండ్రి ప్రథమ లక్ష్యం. చిన్నారులకు బంగారు భవిష్యత్‌ను అందించడానికి మంచి చదువు అవసరం. కానీ, విద్య ఖర్చులు ద్రవ్యోల్బణం కంటే వేగంగా పెరుగుతున్నాయి. ఈ వేగానికి సరితూగడమే కాదు, దానిని అధిగమించే ఆదాయ మార్గాన్ని ఎంచుకోవడం ప్రతి తల్లిదండ్రికి చాలా అవసరం.
విద్యా ద్రవ్యోల్బణం సంవత్సరానికి దాదాపు 12 శాతంగా ఉంటుందని అంచనా. ఈ ప్రకారం, రాబోయే కాలంలో విద్య ఖర్చులు ఆకాశాన్ని తాకవచ్చు. దీనిని సిద్ధంగా ఉండాలంటే ఇప్పట్నుంచే తెలివిగా పెట్టుబడులు పెట్టాలి. పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఎంచుకోగల ఉత్తమ మార్గాల్లో ఈక్విటీ ఇండెక్స్ ఫండ్‌లు ఒకటి. అధిక రాబడులు ఇచ్చిన చరిత్ర వీటికి ఉంది. పెరుగుతున్న విద్య ఖర్చుల కంటే ఎక్కువ రాబడులు అందించి, తల్లిదండ్రల మీద ఆర్థిక భారాన్ని తగ్గించగలవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
విద్య ద్రవ్యోల్బణం ప్రభావం
ఈ రోజు ఒక ఎడ్యుకేన్ ప్రోగ్రామ్‌కు రూ.లక్ష ఖర్చవుతుంటే, 12 శాతం విద్య ద్రవ్యోల్బణం రేటు ప్రకారం 18 ఏళ్లలో అదే ప్రోగ్రామ్‌కు దాదాపు రూ.8 లక్షల ఖర్చు అవుతుంది. సాధారణ పొదుపు ఖాతా లేదా సాంప్రదాయ ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా ఇంత వేగంగా వృద్ధి చెందవు. అయితే, నిఫ్టీ 50 లేదా సెన్సెక్స్ వంటి ఈక్విటీ సూచీలు గత 20 ఏళ్లలో వరుసగా 14 శాతం & 15 శాతం వార్షిక రాబడిని అందించాయి. వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీ పిల్లలకు చాలా తక్కువ ఖర్చుతో మంచి విద్యాభ్యాసం అందుతుంది. ఈ లక్ష్యం నెరవేరాలంటే.. సగటున 13 శాతం వార్షిక రాబడి ఇచ్చే సాధనంలో రూ.5000 నెలవారీ SIP చేస్తూ, ఈ మొత్తాన్ని ఏటా 10% పెంచుకుంటూ వెళ్తే, 18 సంవత్సరాలలో రూ.79 లక్షలకు పైగా కార్పస్ సృష్టించొచ్చు.
ఈక్విటీ ఇండెక్స్ ఫండ్స్ ఎందుకు ప్రత్యేకం?
ఈక్విటీ ఇండెక్స్ ఫండ్స్.. నిఫ్టీ 50 లేదా సెన్సెక్స్ 30 వంటి మార్కెట్ ఇండెక్స్ పనితీరును ట్రాక్ చేస్తాయి, తక్కువ పెట్టుబడితో అధిక రాబడిని అందిస్తాయి. ఇండెక్స్‌ను ట్రాక్ చేసే అన్ని ఫండ్స్‌ను పాసివ్ ఫండ్స్ అంటారు. యాక్టివ్ ఫండ్స్ తరహాలో ఇండెక్స్ ఫండ్‌లు ఫండ్ మేనేజర్ నైపుణ్యంపై ఆధారపడవు. కానీ, మార్కెట్ వృద్ధి చెందేకొద్దీ పెరుగుతుంటాయి. దీర్ఘకాలంలో స్థిరమైన & ఘనమైన రాబడిని అందిస్తాయి. గత సంవత్సరం కాలంలో నిఫ్టీ 50 & సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లు వరుసగా 22 శాతం & 21 శాతం పెరిగాయి. యాక్టివ్ ఫండ్‌లతో పోలిస్తే ఇండెక్స్ (పాసివ్) ఫండ్‌ల కోసం చెల్లించాల్సి ఖర్చు అతి స్వల్పంగా ఉంటుంది. అంటే, ఈ రూపంలోనూ డబ్బు ఆదా అవుతుంది. సాధారణంగా, పాసివ్ ఫండ్స్‌పై ఖర్చు 0.10 శాతం కంటే తక్కువగా ఉంటుంది.
పెరుగుతున్న విద్య ఖర్చులను తట్టుకోవడానికి మీరు కష్టపడడం మానండి, ఆ పనిని స్టాక్ మార్కెట్‌కు అప్పగించండి. ఈక్విటీ ఇండెక్స్ ఫండ్స్‌లో పెట్టుబడి అనేది మీ పిల్లల విద్యకు నిధులు సమకూర్చగల తెలివైన వ్యూహం. దీని ద్వారా మీ పిల్లలకు సురక్షితమైన భవిష్యత్తును బహుమతిగా అందించొచ్చు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఆర్థిక సంక్షోభంలో ఆపద్బాంధవి 'గోల్డ్ లోన్' - ఎన్ని రకాల ప్రయోజనాలో తెలుసా?
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
Gold-Silver Prices Today 20 Dec: మీ నగరంలో చవకగా మారిన గోల్డ్, సిల్వర్ నగలు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Instant Loan Apps: అర్జంట్‌గా డబ్బులు కావాలా?, నిమిషాల్లో రుణం ఇచ్చే ఇన్‌స్టాంట్ లోన్ యాప్స్ ఇవి, కానీ జాగ్రత్త!
Instant Loan: తక్షణం రూ.10,000 లోన్ తీసుకోవచ్చు - ఎవరికి ఇస్తారు, ఎలా అప్లై చేయాలి?
Trending Gold Jewellery: ధర తక్కువ, మన్నిక ఎక్కువ - ఇప్పుడు ఎవరి ఒంటిపై చూసినా ఇవే నగలు!
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు