By: Arun Kumar Veera | Updated at : 28 Apr 2024 08:17 AM (IST)
సెక్షన్ 80C పరిధి చాలా పెద్దది
Section 80C of the Income Tax Act: ఆదాయ పన్ను చెల్లింపుదార్లు, తమ పన్ను బాధ్యతను గుర్తించేందుకు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C అత్యంత కీలకం. ఈ సెక్షన్ పరిధి చాలా విస్త్రతం. దీని గురించి తెలుసుకుంటే ఐటీఆర్ ఫైలింగ్ పని సగం పూర్తయినట్లే లెక్క. ఈ సెక్షన్ ఒక టాక్స్ పేయర్‌కు చాలా రకాల మినహాయింపులు (Tax Exemptions) అందిస్తుంది, డబ్బు ఆదా చేస్తుంది.
సెక్షన్ 80C కింద, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు పొందొచ్చు. వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదార్లు (Individual Income Tax Payers), హిందూ అవిభక్త కుటుంబాలు (Hindu Undivided Family - (HUF) మాత్రమే ఈ ప్రయోజనాన్ని అందుకోగలవు.
పాత పన్ను విధానంలో మాత్రమే
పాత పన్ను విధానానికి (Old Tax Regime) మాత్రమే ఆదాయ పన్ను సెక్షన్లు వర్తిస్తాయి. కాబట్టి, మీరు పాత పన్ను విధానాన్ని ఫాలో అయితేనే సెక్షన్ 80C ప్రయోజనాలను పొందొచ్చు. వాటిని సద్వినియోగం చేసుకుంటే, రూ.1.5 లక్షల ఆదాయం వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు.
సెక్షన్ 80C కిందకు వచ్చే పెట్టుబడులు
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC), యులిప్ (ULIP), ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF), పబ్లిక్ పావిడెంట్ ఫండ్ (PPF), లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం (Life Insurance Premium), ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ (ELSS), ఇంటి రుణం (Home loan), సుకన్య సమృద్ధి యోజన (SSY), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) వంటి పథకాల్లో జమ చేసే డబ్బును ఈ సెక్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ - సెక్షన్ 80C కింద, PPFలో జమ చేసిన డబ్బుకు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షలు మినహాయింపు లభిస్తుంది.
జీవిత బీమా ప్రీమియం - జీవిత బీమా పాలసీ కోసం చెల్లించిన ప్రీమియంపై పన్ను ప్రయోజనం లభిస్తుంది. మీ కుటుంబ సభ్యుల కోసం పాలసీ తీసుకుని, ఆ పెట్టుబడిని క్లెయిమ్ చేసుకోవచ్చు. హిందు అవిభాజ్య కుటుంబం (HUF) సభ్యులు కూడా ఇలాంటి ప్రయోజనాలకు అర్హులు.
యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (ULIP) - దీర్ఘకాలంలో మంచి రాబడిని అందిస్తుంది. సెక్షన్ 80C కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల పెట్టుబడికి పన్ను మినహాయింపు పొందొచ్చు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ - తక్కువ రిస్క్ ఉన్న పథకాల్లో NSC ఒకటి. ఇది కాల గడువు 5 నుంచి 10 సంవత్సరాలు. ఇందులో ఎంత డబ్బయినా పెట్టుబడి పెట్టవచ్చు. కానీ, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల పెట్టుబడికి మాత్రమే మినహాయింపు అందుబాటులో ఉంటుంది.
పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్ (Tax saving fixed deposit) - పన్ను మినహాయింపు కోసం, బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ద్వారా పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిడ్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. వీటి లాక్-ఇన్ పీరియడ్ 5 సంవత్సరాలు. ఈలోపు డబ్బు వెనక్కు తీసుకోవడం కుదరదు.
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ - ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్‌లో జమ చేసిన మొత్తం, దానిపై వచ్చిన వడ్డీ.. ఈ రెండూ పన్ను మినహాయింపును అందిస్తాయి. ఈ ప్రయోజనాన్ని పొందడానికి మీరు కనీసం 5 సంవత్సరాలు ఉద్యోగంలో ఉండాలి.
మౌలిక సదుపాయాల బాండ్లు (Infrastructure Bonds) - ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్, సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని అందిస్తాయి.
ELSS - ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ కింద కూడా పన్ను మినహాయింపు పొందుతారు. ఈ పథకాల లాక్-ఇన్ వ్యవధి 3 సంవత్సరాలు.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ - SCSSలో సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడికి పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇందులో పెట్టుబడి పెట్టాలంటే మీ వయస్సు 60 ఏళ్లు పైబడి ఉండటం తప్పనిసరి.
హోమ్ లోన్ - గృహ రుణం కింద చెల్లించే అసలుపై (Principal Amount) పన్ను మినహాయింపు పొందొచ్చు.
సుకన్య సమృద్ధి యోజన - బాలికల కోసం నిర్వహిస్తున్న ఈ పథకంపై 8.2 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో జమ చేసే డబ్బుకు కూడా పన్ను మినహాయింపు లభిస్తుంది.
నాబార్డ్ రూరల్ బాండ్ - నాబార్డ్ రూరల్ బాండ్స్‌లో డబ్బు ఇన్వెస్ట్ చేసినా పన్ను మినహాయింపు లభిస్తుంది.
సెక్షన్ 80Cతో పాటు మరికొన్ని ఉప సెక్షన్లు కింద కూడా టాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి.
సెక్షన్ 80CCC - పెన్షన్ ప్లాన్స్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన పెట్టుబడులపై టాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు.
సెక్షన్ 80CCD(1) - నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS), అటల్ పెన్షన్ యోజన (APY) వంటి ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడులపై పన్ను మినహాయింపు పొందుతారు.
సెక్షన్ 80 CCD(1B) - NPSలో రూ. 50,000 వరకు కంట్రిబ్యూషన్‌కు ఈ సెక్షన్ కింద మినహాయింపు ఉంటుంది. సెక్షన్ 80C కింద లభించే రూ. 1.50 లక్షలకు ఇది అదనం.
సెక్షన్ 80 CCD(2) - NPSలో కంపెనీ యాజనమాన్యం వాటాకు ఈ సెక్షన్ కింద మినహాయింపు ఉంటుంది.
PF Withdrawal: పీఎఫ్ విత్‌డ్రా చేయడానికి రెండు ప్రధాన ఆప్షన్లు, ఏది ఎంచుకుంటారో మీ ఇష్టం
New Banking Rules: ఈ ఏప్రిల్ నుంచి మారే బ్యాంకింగ్ రూల్స్ ఇవే! తెలుసుకోకపోతే మోత మోగిపోద్ది!
10-Minute Smartphone Delivery: స్మార్ట్ ఫోన్ ఆర్డర్ చేస్తే 10 నిమిషాల్లో హోమ్ డెలివెరీ - స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ దూకుడు
Cash Withdraw: ATM నుంచి డబ్బు తీసే ముందు ఓసారి ఆలోచించండి, ఇన్ ఫ్రంట్ క్రొకోడైల్ ఫెస్టివల్
Gold-Silver Prices Today 26 Mar: మళ్లీ షాక్ ఇచ్చిన గోల్డ్, సిల్వర్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Telangana Assembly: సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై రేవంత్ ప్రసంగం - బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం - రేవంత్ పరిధి దాటారని విమర్శలు
Pastor Praveen Kumar Death Mystery : ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!
IPL 2025 KKR VS RR Result Update: డికాక్ అజేయ ఫిఫ్టీ.. కేకేఆర్ 8 వికెట్లతో సునాయాస విజయం.. రాజస్థాన్ తో మ్యాచ్
UPI Down : దేశవ్యాప్తంగా యూపీఐ సేవలకు ఆటంకం - తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు