కోర్టు అనుమతితో విదేశీ పర్యటనకు సీఎం జగన్ రెడీ- నేతలకు టాస్క్‌లు ఇవ్వకపోవడంపై చర్చ
ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ఇంకా ప్రారంభం కాకుండానే ఆయన తిరిగి రాగానే సమ్ థింగ్ అనే ఊహాగానాలు మాత్రం పార్టీలో హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. పార్టీ వర్గాలు కూడా ఇదే విషయం పై చర్చిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటకు రెడీ అయ్యారు. సీబీఐ న్యాయ స్థానం నుంచి కూడా అనుమతి రావటంతో ఇక ఆయన ఫ్లైట్ ఎక్కటమే తరువాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విదేశీ పర్యటనకు వెళుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరిగి రాగానే ఏదో అద్భుతం జరుగుతుందనే అభిప్రాయంలో పార్టీ వర్గాలు ఉన్నాయి.
ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ఇంకా ప్రారంభం కాకుండానే ఆయన తిరిగి రాగానే సమ్ థింగ్ అనే ఊహాగానాలు మాత్రం పార్టీలో హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. పార్టీ వర్గాలు కూడా ఇదే విషయం పై చర్చిస్తున్నాయి. ఎన్నికలకు సంబంధించిన హీట్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసింది. డిసెంబర్‌లో తెలంగాణా ఎన్నికలు జరుగుతాయని ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉంటాయి అనేది అందరికి తెలిసిందే. కానీ అంతకన్నా ముందే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నికలు జరిగే ఛాన్స్ లేకపోలేదనే ప్రచారం ఊపందుకుంది.
విదేశీ పర్యటనకు రెడీ...
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా విదేశీ పర్యటకు వెళుతున్నారు. పది రోజుల పాటు ఆయన విదేశీ పర్యనలో ఉంటారు. లండన్, యూకే వంటి దేశాల్లో ముఖ్యమంత్రి జగన్ ఆయన కుటుంబ సభ్యులు పర్యటిస్తారని అధికార వర్గాలు అంటున్నాయి. దీనిపై ఇప్పటికే పెద్ద చర్చ కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు వెళుతున్న సమయంలో రాష్ట్రంలోని రాజకీయాలపై కూడా ఊహాగానలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో ముందస్తు ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ప్రచారం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ముందస్తు ఎన్నికలకు సంబంధించి చర్చ మొదలైందని అంటున్నారు.
ముందస్తు ఎన్నికలకు సంబంధించిన ప్రచారాలను సైతం పార్టీ వర్గాలు ముమ్మరం చేశాయి. జిల్లాల వారీగా పార్టీ నేతలతో రాజ్యసభ సభ్యుడు విజయ సాయి కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీలో విభేదాలను క్లియర్ చేసుకునే పనిలో ఉన్నారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకొని రాగానే నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల లిస్ట్ కన్‌ఫార్మ్ చేస్తారని అంటున్నారు.
అప్పుడు అలా... ఇప్పుడు ఇలా...
గతంలో ముఖ్యమంత్రి విదేశీ పర్యటకు వెళ్ళిన సమయంలో పరిస్థితులను కూడా ఇప్పుడు రాజకీయ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి. పెట్టుబడులకు సంబంధించి నిధులను సమీకరించేందుకు ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అదే సమయంలో విదేశీ పర్యటకు వెళ్తున్న జగన్ మంత్రులకు టాస్క్ ఇచ్చారు. తెలుగు దేశం పార్టీ నిర్వహించే మహానాడుకు దీటుగా మంత్రులు బస్సు యాత్ర నిర్వహించారు. రాష్ట్రం మొత్తం మూడు రోజుల పాటు పర్యటించారు.
ఈసారి మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. పార్టీలో ఏదో జరగబోతోందనే ఆసక్తి నేతల్లో ఉంది. ఎన్నికల సమయ దగ్గర పడుతున్న టైంలో నేతలకు ఎటువంటి టాస్క్‌లు ఇవ్వకుండానే కూల్‌గా విదేశీ పర్యటనకు ప్లాన్ చేసుకోవటంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
ముఖ్యమంత్రి షెడ్యూల్ ఇది...
సెప్టెంబర్ ఒకటో తేదీన అంటే నేడు రాత్రికి ముఖ్యమంత్రి జగనమ మోహన్ రెడ్డి ఇడుపులపాయకు చేరుకునే ఛాన్స్ ఉంది. శనివారం ఉదయం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్దంతి సందర్భంగా సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. ఆ తరువాత అక్కడ నుంచి మధ్యాహ్నం తిరిగి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. 2 సాయంత్రం డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు కుమారుడి వివాహానికి హజరు అవుతారు.