Top Headlines: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - హైడ్రా మరో బిగ్ ఆపరేషన్, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: ఏపీ, తెలంగాణలో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Today Top Headlines In Ap And Telangana:
1. తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్
జనవరి వచ్చిందింటే చాలు కొత్త ఏడాదిలో మంచి జరగాలని చెప్పి భారీగా భక్తులు శ్రీనివాసుడి దర్శనానికి క్యూ కడతారు. అలాంటి ఆలోచన ఉంటే మాత్రం కచ్చితంగా ముందు ఈ డేట్స్‌ను మీ క్యాలెండర్‌లో మార్క్ చేసుకోవాలి. లేదంటే జనవరిలో మీకు శ్రీవారి దర్శనం లేనట్టే. శ్రీవారి దర్శనం కోసం లక్షల మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్లే పరిస్థితి ఉండదు. దర్శనం టికెట్లు కూడా అంత ఈజీగా లభించవు. ఫ్రీ టికెట్లు ఉన్నా అందుకు చాలా టైం వెచ్చించాల్సి ఉంటుంది. ఇంకా చదవండి.
2. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితులు క్రమంగా కొలిక్కి వస్తున్న వేళ ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా ఇప్పటికే డీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. సామాజిక పింఛన్లు కూడా వెయ్యి రూపాయలు పెంచి అందిస్తోంది. ఇప్పుడు మరో పథకాన్ని ప్రజలకు అందించేందుకు రెడీ అవుతోంది. సూపర్ సిక్స్ పేరుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందులో కీలకమైన హామీ తల్లికి వందనం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దీన్ని అమ్మఒడి పేరుతో అందించింది. ఇంకా చదవండి.
3. హైడ్రా మరో బిగ్ ఆపరేషన్
చెరువులు, ప్రభుత్వం స్థలాలు ఆక్రమించి చేపట్టే నిర్మాణాలతో హైదరాబాద్ ఎంతలా ఇబ్బంది పడుతుందో.. ఫుట్‌పాత్‌లు లేక అంతకంటే ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటోంది. దీనిపై ఇప్పుడు ఫోకస్ చేసింది హైడ్రా. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో కలిసి కీలక ఆపరేషన్ చేపట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సంచనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉన్న హైడ్రా మరో బిగ్ ఆపరేషన్ చేపట్టనుంది. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌లో ప్రధాన కారణంగా ఉన్న పుట్‌పాత్‌లు, రోడ్లు ఆక్రణమలపై బుల్డోజర్ల రంగప్రవేశం చేయనున్నాయి. ఇంకా చదవండి.
4. మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్
రాజకీయాల్లో సీనియార్టీ ముఖ్యం కాదు. రాజకీయ వ్యూహాలే ముఖ్యం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అలాంటి వ్యూహాల్లో ఎవరికీ అందనంత ఎత్తులో కనిపిస్తున్నారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు ఆయన ఒక్క ప్రెస్ మీట్ ద్వారా చెక్ పెట్టారు. అంతే కాదు అసెంబ్లీలో చర్చకు సవాల్ విసరడం ద్వారా ఆ రెండు పార్టీలకు తేల్చుకోలేని సమస్యను తెచ్చి పెట్టారు. ఎందుకంటే మూసి ప్రక్షాళనను ఆ రెండు పార్టీలు వ్యతిరేకించలేవు. మారిపోయిన రాజకీయంలో స్వాగతిస్తే రేవంత్ ట్రాప్‌లో పడినట్లు అవుతుంది. ఇంకా చదవండి.
5. టికెట్ రిజర్వేషన్లపై రైల్వే నిర్ణయం వెనుక కారణం!
రైలు టికెట్ల రిజర్వేషన్ ముందస్తు బుకింగ్ గడువును 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గిస్తూ భారతీయ రైల్వే తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా గందరగోళం చెలరేగడంతో, అన్ని అనుమానాలను తీరుస్తూ రైల్వే బోర్డ్ (Indian Rail Board) ఒక ప్రకటన విడుదల చేసింది. ఒకవిధంగా చూస్తే, గడువు తగ్గింపు నిర్ణయంపై వివరణ ఇచ్చింది. రైలు టిక్కెట్ల అడ్వాన్స్ రిజర్వేషన్ పిరియడ్ (ARP) ఎక్కువగా ఉండటం పెద్ద సంఖ్యలో క్యాన్సిలేషన్స్ జరుగుతున్నాయని, బెర్తులు వృథా అవుతున్నాయని రైల్వే బోర్డ్ తన వివరణలో వెల్లడించింది. ఇంకా చదవండి.