Top Headlines: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - తెలంగాణలో కలెక్టర్‌పై గ్రామస్థుల దాడి, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Top News In Ap And Telangana:
1. ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉద్యోగ ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లే వాళ్లు ఆకలితో ఇబ్బంది పడకూడదని తీసుకొచ్చిన అన్న క్యాంటీన్లు ప్రజల్లో చాలా ఇంపాక్ట్ తీసుకొచ్చాయి. ఇప్పటి వరకు పట్టణాలు, ప్రధాన నగరాలకే పరిమితమైన ఈ క్యాంటీన్లను ఇకపై గ్రామాల్లో కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రభుత్వం బడ్జెట్‌లో పెట్టింది. 2024-25 సంవత్సరానికి ఐదు నెలల కాలం కోసం బడ్జెట్ తీసుకొచ్చిన ప్రభుత్వం త్వరలోనే గ్రామాల్లో అన్న క్యాంటీన్లు తీసుకొస్తామని చెప్పింది. పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఆహారాన్ని అందించేందుకు 123 ప్రాంతాల పరిధిలో 204 అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేసినట్టు బడ్జెట్ ప్రసంగంలో పయ్యావు కేశవ్ తెలిపారు. ఇంకా చదవండి.
2. ఏపీ బడ్జెట్‌లో కేటాయింపులు ఇలా!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2,94,427.25కోట్లతో 2024-25 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను సభలో ప్రవేశ పెట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన తొలి బడ్జెట్‌ను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఆర్థిక ప్రగతి, సంక్షేమాన్ని సమానంగా ప్రజలకు అందించేందుకు ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా 2,35,916.99 కోట్ల రూపాయలు. మూలధన వ్యయం అంచనా 32,712.84 కోట్ల రూపాయలు. రెవెన్యూ లోటు 34,743.38 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ద్రవ్య లోటు 68,742.65 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు. ఇంకా చదవండి.
3. జగన్‌పై షర్మిల సంచలన ట్వీట్
తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్న మాజీ సీఎం జగన్‌పై (Jagan) ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ తీరు చూస్తుంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుందని మండిపడ్డారు. 'అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసింది.?. ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది.?.' అని మండిపడ్డారు. ఇంకా చదవండి.
4. వికారాబాద్‌లో కలెక్టర్‌పై గ్రామస్థుల దాడి
వికారాబాద్ జిల్లాలో (Vikarabad District) సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్, అధికారులపై గ్రామస్థులు తిరగబడ్డారు. వారి వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఓ మహిళా రైతు కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై (Prteek Jain) చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. దుద్యాల మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫార్మా సంస్థ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ కోసం దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి చెందిన రైతులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఫార్మా సంస్థ ఏర్పాటును అక్కడి రైతులు, గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంకా చదవండి.
5. మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న ఓ యువతిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఆమె చికిత్సకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని వైద్యులకు తెలిపారు. హుజూరాబాద్ (Huzurabad) సమీపంలోని సింగాపూరం సమీపంలో యువతి రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ క్రమంలో యువతి లారీ కింద ఇరుక్కోగా స్థానికులు గుర్తించి కేకలు వేయడంతో డ్రైవర్ లారీని ఆపాడు. ఇంకా చదవండి.