అన్వేషించండి

Top Headlines: వరద ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే - జగన్ లండన్ టూర్ వాయిదా, రాజ్ తరుణ్, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్

Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్‌ను ఒక్క క్లిక్‌తో ఇక్కడ చదివేయండి.

Today Top Headlines:

 1. వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

విజయవాడలోని (Vijayawada) వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు (CM Chandrababu) శుక్రవారం ఏరియల్ సర్వే (Aerial Survey) చేశారు. వరదలకు మూల కారణమైన బుడమేరు (Budameru) డ్రైన్, కొల్లేరు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. వరద ప్రవాహం, ముంపు, గండ్లు పడిన ప్రాంతాలను సర్వే చేశారు. ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా నదీ ప్రవాహాన్ని పరిశీలించారు. అంతకుముందు నగరంలో కొనసాగుతోన్న వరద సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో సీఎం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంకా చదవండి.

2. మాజీ సీఎం జగన్ లండన్ టూర్ వాయిదా

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మూడో తేదీన కుటుంబసమేతంగా లండన్ వెళ్లాల్సి ఉంది. కానీ ఆయన ఇంకా వెళ్లలేదు. ఏడో తేదీన వెళ్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి . కానీ ఆ రోజున కూడా వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంంది. దీనికి కారణం పాస్ పోర్టు ఇంకా చేతిలోకి రాకపోవడమే. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న ఆయన పాస్ పోర్టును కోర్టులో సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది. కోర్టు పర్మిషన్ ఇచ్చినప్పుడు తీసుకుని మళ్లీ సమయం ముగిశాక కోర్టులోనే సబ్మిట్ చేయాలి. ఇంకా చదవండి.

3. విజయవాడ మార్గంలో 44 రైళ్లు రద్దు

భారీ వర్షాలు, వరదల నుంచి ఏపీ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. దెబ్బతిన్న రవాణా వ్యవస్థ కూడా సర్దుకుంటోంది. ముఖ్యంగా రైల్వే ట్రాక్‌లపై వరద నీరు చేరడంతో... చాలా వరకు రైళ్ల రాకపోకలను  కూడా నిలిపివేశారు. అయితే.. వరద తగ్గడంతో.. యుద్ధ ప్రాతిపదిక మరమ్మతులు చేసి... రైళ్ల రాకపోకలను పునరుద్దరిస్తున్నారు అధికారులు. రాయనపాడు మార్గంలో ట్రాక్‌ నీట మునిగడంతో... ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపేశారు.  అయితే... ప్రస్తుతం అక్కడ వరద నీరు తగ్గడంతో.. మరమ్మతులు చేపట్టి... రైళ్ల రాకపోకలను పునరుద్దరించారు. ఇంకా చదవండి.

4. రాజ్ తరుణ్, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్

యాక్టర్ రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో హైదరాబాద్‌ పోలీసులు సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. లావణ్య చెబుతున్నట్టు కొన్ని విషయాలు నిజమేనంటూ కోర్టులో ఛార్జ్‌షీట్‌ వేశారు. ఇద్దరూ పదేళ్ల పాటు సహజీవనం చేశారని వివరించారు. ఒకే ఇంట్లో ఉన్నారని కూడా తేల్చారు. ఈ కేసులో రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా పేర్కొన్నారు పోలీసులు. లావణ్య ఇంటిని కూడా సందర్శించి కీలక ఆధారాలు సేకరించారు. ఇప్పటికే ఈ కేసులో రాజ్‌తరుణ్‌ ముందస్తు బెయిల్ తీసుకున్నారు. ఇంకా చదవండి.

5. కేసీఆర్‌కు మరోసారి కోర్టు సమన్లు

మేడిగడ్డ బ్యారేజీ వివాదం... ఎన్నికల ముందు రాజకీయ దుమారం రేపింది. ఆ వివాదం... బీఆర్‌ఎస్‌ పార్టీని ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి నోటీసులు ఇచ్చింది. అక్టోబర్‌ 17వ తేదీన... కోర్టులో హాజరుకావాలని ఆదేశించారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తోపాటు.. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు కూడా నోటీసులు ఇచ్చింది భూపాలపల్లి జిల్లా కోర్టు. ఇంకా చదవండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
AP Local Body Polls: ఏపీ స్థానిక పోరులో రణరంగం.. దాడులపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు!
స్థానిక పోరులో మొదలైన రచ్చ.. దాడులపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు!
Vijayawada Woman Arrest: ప్రేమ మత్తుతో దారి తప్పిన యువతి.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికింది!
ప్రేమ మత్తుతో దారి తప్పిన యువతి.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికింది!
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget