News
News
X

AP News Developments Today: వైకుంఠ ఏకాదశి సందర్భంగా కిటకిటలాడుతున్న ఆలయాలు

విశాఖలో నిన్న మృతి చెందిన బీజేపీ సీనియర్ నేత పీవీ చలపతిరావుకి నివాళి అర్పించడం కోసం విశాఖపట్నానికి గవర్నర్ లు బండారు దత్తాత్రేయ, కంభంపాటి హరిబాబు రానున్నారు.

FOLLOW US: 
Share:

వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి.. ముందుగా స్వామి వారికి నిర్వహించే ప్రాత:కాల ఆరాధనలు పూర్తైన తర్వాత అర్ధరాత్రి 12 గంటల 5 నిమిషాలకు వైకుంఠ ద్వార దర్శనాలను ప్రారంభించింది టిటిడి.. ముందుగా అత్యంత ప్రముఖులు, ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు శ్రీవాణి ద్వారా టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతించారు.. ఉదయం 6 గంటల నుంచి సామాన్య భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు..

ముక్కోటి ఏకాదశి రోజు స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ముందుగానే ఆన్‌లైన్‌లో 300, ఆఫ్‌లైన్‌లో టోకెన్లు పొందారు.. ఇవాళ్టి నుంచి ఈ నెల 11వ తేదీ వరకు నిర్దేశిత టోకెన్లు కలిగిన భక్తులను శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామిని తిరుమల శ్రీవారిని ఎస్వీ బట్ కేరళ హై కోర్టు నాయమూర్తి, ఏపీ హై కోర్టు నాయమూర్తి రవేంద్ర బాబు, ఏపీ హై కోర్టు నాయమూర్తి రావినాథ్ తిలహరి, మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి, ఏపీ హై కోర్టు నాయమూర్తి రాజశేఖర్ రావు,‌ తెలంగాణ హై కోర్టు సూర్యపల్లి నంద, ఏపీ హై కోర్టు నాయమూర్తి గంగారాం, డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి,కర్ణాటక హై కోర్టు దినేష్ కుమార్, ఎమ్మెల్యే అంబంటి రాంబాబు, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, గవర్నమెంట్ చీఫ్ విప్  ప్రసాద్ రాజు, మినిష్టర్ ఉషశ్రీ చరణ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ హై కోర్టు ev వేణుగోపాల్, తేవర్చంగ్ గలట్ కర్ణాటక గవర్నర్, మినిస్టర్ మెరుగు నాగార్జున, తమిళనాడు సీజే టి రాజా, గుడివాడ అమర్నాథ్ మినిస్టర్, తిరుపతి ఎంపీ గురుమూర్తి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మినిష్టర్ విశ్వరూప్, ఏపీ మినిస్టర్ జయరాం, కోళ్లు రవేంద్ర టీడీపి మాజీ మంత్రి, కోన  రఘుపతి, ఎమ్మెల్యే రఘునందన్,కడియం శ్రీహరి, దేవి గౌడ కుమారుడు రేవన్న, ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు,ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, మినిస్టర్ కరుమూరి వెంకట నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ మినిస్టర్, తెలంగాణ బిజెపి నాయకుడు కే లక్ష్మణ్, యాక్టర్ రాజేంద్రప్రసాద్, అవంతి శ్రీనివాస్ ఎమ్మెల్యే, వెల్లంపల్లి శ్రీనివాసులు ఎమ్మెల్యే, ప్రకాశ్ జవదేకర్ ఎంపీ లు కుటుంబ సమేతంగా వేర్వేరుగా వైకుంఠ ద్వార గుండా స్వామి వారి‌ సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు.

అనంతరం‌ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. వైకుంఠ ఏకాదశి రోజు స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రులు తెలిపారు. రాష్ట్రంలో అదే అభివృద్ధి కొనసాగాలని వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.. చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కోసం ప్రజల ప్రాణాలు తాడుకుంటున్నారని వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడుకి మంచి బుద్ధి ఇవ్వాలని ప్రార్థించామన్నారు.. గతంలో కూడా చంద్రబాబు నాయుడు పుష్కరాల సమయంలో 30 మంది ప్రాణాలు పోగొట్టారని అదేవిధంగా ఇప్పుడు కూడా సామాన్య ప్రజల ప్రాణాలు ఆడుకుంటున్నాడని మాజీ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాసులు తెలిపారు.. టీడీపీ మాజీ మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో అయినా ప్రభుత్వం మారి ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం రావాలని స్వామి వారిని కోరుకున్నట్లు ఆయన అన్నారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అమర్నాథ్ రెడ్డి, ఉషశ్రీ, జయరాం, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు, నిమ్మకాయ చిన్నరాజప్ప, టిడిపి మాజీ మంత్రి తదితరులు ఉన్నారు.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సీఎం పిలుపు
ఈ సాయంత్రం 5 గంటలకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సీఎం జగన్ ను ప్రత్యేకంగా కలవనున్నారు. ఈ భేటీలో జిల్లా ఇంచార్జి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా హాజరు కావాలని సీఎం ఆదేశించారు. ఇటీవల వరుసగా ప్రభుత్వ అధికారుల పని తీరుపై ఎమ్మెల్యే విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో సీఎం నుండి పిలుపు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సాయంత్రం 4.30 లకు సీఎం క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే చేరుకోనున్నారు.

విశాఖలో నిన్న మృతి చెందిన బీజేపీ సీనియర్ నేత పీవీ చలపతిరావుకి నివాళి అర్పించడం కోసం విశాఖపట్నానికి గవర్నర్ లు బండారు దత్తాత్రేయ, కంభంపాటి హరిబాబు రానున్నారు. అనంతరం అంతిమ యాత్ర జరగనుంది.

ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియామకం కానున్న తోట చంద్ర శేఖర్. నేడు హైదరాబాద్ లో BRS లో చేరిక

రాజకీయ దుమారం సృష్టించనున్న ఉయ్యూరు తొక్కిసలాట
ఉయ్యూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన తొక్కిసలాట లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన సంఘటన రాజకీయంగా  దుమారం లేపుతోంది. మృతులకు 20 లక్షల పరిహారం ఇస్తామని కార్యక్రమ నిర్వహకులు ఇప్పటికే ప్రకటించారు. చంద్రబాబు వెళ్లిపోయాకే ఈ ఘటన జరిగినట్టు వారు చెబుతున్నారు. అయితే చంద్రబాబు పర్యటన సందర్భంగా ఎలాంటి ప్లానింగ్ లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్టు రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.

Published at : 02 Jan 2023 09:46 AM (IST) Tags: AP Latest news Telugu News Today AP News Developments Today AP Headlines Today

సంబంధిత కథనాలు

దర్శకుడు కె.విశ్వనాథ్‌ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి- తెలుగు సినీరంగానికి తీరన లోటని కామెంట్‌!

దర్శకుడు కె.విశ్వనాథ్‌ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి- తెలుగు సినీరంగానికి తీరన లోటని కామెంట్‌!

AP BRS : ఏపీలో విస్తరణకు బీఆర్ఎస్ ప్లాన్- గంటా శ్రీనివాస్, మాజీ జేడీ లక్ష్మీనారాయణతో మంతనాలు!

AP BRS : ఏపీలో విస్తరణకు బీఆర్ఎస్ ప్లాన్- గంటా శ్రీనివాస్, మాజీ జేడీ లక్ష్మీనారాయణతో మంతనాలు!

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

YSRCP Tensions : వైఎస్ఆర్‌సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?

Anganwadi Jobs: వైఎస్సార్‌ కడప జిల్లాలో 115 అంగన్‌వాడీ పోస్టులు, వివరాలివే!

Anganwadi Jobs: వైఎస్సార్‌ కడప జిల్లాలో 115 అంగన్‌వాడీ పోస్టులు, వివరాలివే!

Republic Day Celebrations 2023: రిపబ్లిక్ డే పరేడ్ లో సత్తా చాటిన ఏపీ, తెలంగాణ ఎన్‌సీసీ క్యాడెట్స్ - ప్రధాని మోదీ చేతుల మీదుగా బెస్ట్ క్యాడెట్ ట్రోఫీ

Republic Day Celebrations 2023:  రిపబ్లిక్ డే పరేడ్ లో సత్తా చాటిన ఏపీ, తెలంగాణ ఎన్‌సీసీ క్యాడెట్స్ - ప్రధాని మోదీ చేతుల మీదుగా బెస్ట్ క్యాడెట్ ట్రోఫీ

టాప్ స్టోరీస్

TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం  

TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం  

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?

K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక

K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక