Top Headlines: ఏపీలో మళ్లీ హ్యాండ్ ఫుట్ మౌత్ వ్యాధి కలకలం - తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Top Head Lines In AP And Telangana:
1. ఏపీలో హ్యాండ్ ఫుట్ మౌత్ వ్యాధి కలకలం
ఓ వైపు ఎం పాక్స్(M-pox) అంటూ దేశవ్యాప్తంగా మళ్లీ కలవరం మొదలైన వేళ.. ఏపీలోని మూడు జిల్లాల్లో కాక్సాకీ(Coxsackie virus) వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. ప్రతి ఏటా ఈ వైరస్ కి సంబంధించిన కేసులు అక్కడక్కడ బయటపడుతూనే ఉంటాయి. ఈసారి మళ్లీ ఈ సీజన్ మొదలైంది. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైరస్ కేసులు ఎక్కువగా కనపడుతున్నాయి. అటు విశాఖ ప్రాంతంలో కూడా కాక్సాకీ వైరస్ బారినపడిన చిన్నారులు ఆస్పత్రుల్లో అడ్మిట్ అవుతున్నారు. ఇంకా చదవండి.
2. కడప జిల్లాలో వీఆర్ఏ దారుణ హత్య
మంచం కింద జిలెటిన్ స్టిక్ పేల్చి వ్యక్తి దారుణ హత్య కడప జిల్లాలో కలకలం రేపింది. కడప జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో ఈ దుర్ఘటన జరిగింది. వీఆర్‌ఏ నరసింహ తన ఇంట్లో నిద్రించే టైంలో ప్రత్యర్థులు హత్య చేశారు. ఆయన పడుకున్న మంచ కింద డిటోనేటర్లు పెట్టి పేల్చేశారు. అదే మంచంపై నిద్రిస్తున్న నరసింహ భార్య సుబ్బలక్ష్మమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను వేంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కడప రిమ్స్‌కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. దీనికి వివాహేతర సంబంధమే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా చదవండి.
3. తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల
తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖ నిర్వహించిన 'టీజీ డీఎస్సీ-2024' పరీక్ష ఫలితాలు (DSC Results 2024) సోమవారం (సెప్టెంబరు 30) విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ డీఎస్సీ పరీక్ష ఫలితాలను విడుదల చేసారు. రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ మార్చి 1న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. అభ్యర్థులకు జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు రాశారు. ఈ పరీక్షలకు 2.45 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన 56 రోజుల తర్వాత ఫలితాలు విడుదలయ్యాయి. ఇంకా చదవండి.
4. తెలంగాణలో కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్
డీఎస్సీ 2024 ఫలితాలను విడుదల చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు పరిస్థితులు ఖాళీలు చూసుకొని డీఎస్సీపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియ అనేది నిరంతరం సాగేది అన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు డీఎస్సీ ప్రక్రియ నియామక ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఇందులో ఉన్న మిగిలిపోయే ఖాళీలు, కొత్తగా ఏర్పడే ఖాళీలు తెప్పించుకొని డీఎస్సీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇంకా చదవండి.
5. 'హైడ్రా' కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం
హైడ్రా అధికారులపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని రోజులుగూ దూకుడుగా వెళ్తున్న హైడ్రాపై కొందరు బాధితులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిష్ విచారించిన హైకోర్టు అమీన్‌పూర్ తహశిల్దార్, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల మేరు వీళ్లిద్దరు కోర్టు విచారణకు హజరయ్యారు. కోర్టుకు ఆహజరైన రంగనాథ్, అమీన్పూర్ తహశీల్దార్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టు. ఆదివారం కూల్చివేతలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించింది. ఇంకా చదవండి.