TG DSC Results 2024: తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలను విడుదల చేసిన రేవంత్ రెడ్డి - దసరాలోపు ఫైనల్ లిస్ట్ పెడతామన్న సీఎం
Telangana DSC 2024 Results: తెలంగాణలో డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. జులై నుంచి ఆగస్టు మధ్య జరిగిన పరీక్ష ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు.
DSC Results 2024: తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖ నిర్వహించిన 'టీజీ డీఎస్సీ-2024' పరీక్ష ఫలితాలు (DSC Results 2024) సోమవారం (సెప్టెంబరు 30) విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ డీఎస్సీ పరీక్ష ఫలితాలను విడుదల చేసారు. రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ మార్చి 1న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. అభ్యర్థులకు జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు రాశారు. ఈ పరీక్షలకు 2.45 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన 56 రోజుల తర్వాత ఫలితాలు విడుదలయ్యాయి. డీఎస్సీ పరీక్షలకు సంబంధించి తుది ఆన్సర్ కీ పై అభ్యర్థుల అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వాటిని పట్టించుకోకుండా ఫలితాలను విడుదల చేయడంపై కొందరు అభ్యర్థులు మండిపడుతున్నారు.
దసరాలోపు ఫైనల్ లిస్ట్
ఫలితాలు విడుదల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే... " చాలా తక్కువ సమయంలో ఉద్యోగాలు అందేంచేందుకు అధికారులు చాలా శ్రమించారు. ఈ ఫలితాలు 1:3 ప్రాతిపదికను విడుదల చేశాం. ఇప్పుడు అధికారులు అభ్యర్థుల సర్టిఫికేట్లను వెరిఫై చేయాలి. ఫైనల్ ఫలితాలు దసరా లోపు విడుదల చేయాలని అధికారులను ఆదేశిస్తున్నాం. ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్‌లో నియామక పత్రాలు ఇవ్వబోతున్నాం.
తుది కీపైనా అభ్యంతరాలు..
డీఎస్సీ పరీక్షలు 2024కు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ 'కీ'ని విద్యాశాఖ ఆగస్టు 13న ఆన్‌లైన్‌లో పెట్టింది. సెప్టెంబరు 6న డీఎస్సీ ఫైనల్ ‘కీ’ని విడుదల చేసింది. ప్రాథమిక ఆన్సర్ కీపై 28 వేల వరకు అభ్యంతరాలు వస్తే.. ఫైనల్ ఆన్సర్ కీపై కూడా 210కిపైగా అభ్యంతరాలొచ్చాయి. వీటిని పట్టించుకోవడం లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి సంబంధించిన ఆధారాలను అధికారుల దృష్టి తీసుకొచ్చారు.
తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ఫిబ్రవరి 29న 'డీఎస్సీ-2024' నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. మార్చి 4 నుంచి జూన్ 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకున్నారు. ఈ నోటిఫికేషన్‌లో 6,508 ఎన్జీటీ పోస్టులు, 2,629 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు, 727 లాంగ్వేజ్ పండిట్ పోస్టులు, 182 పీఈటీలు పోస్టులు, స్పెషల్ కేటగిరీలో 220 పోస్టులు స్కూల్ అసిస్టెంట్లు , 796 పోస్టులు ఎస్జీటీలు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల కోసం జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. ఈ ఉద్యోగాలకు మొత్తం 2,79,957 మంది దరఖాస్తు చేస్తే 2,45,263 మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. ఎక్కువ సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టులకు పోటీ పడుతున్నారు. ఈ పరీక్షకు 92.10 శాతం మంది హాజరయ్యారు.