Top Headlines: స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు - బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర!, టాప్ హెడ్ లైన్స్ @3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Top Headlines In AP And Telangana:
1. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు
రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Speed Of Doing Business) దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే సీఐఐ భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం (Consultative Forum) ఏర్పాటు చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ జీవో విడుదల చేసింది. ఫోరం ఛైర్మన్‌గా మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) వ్యవహరించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామికవేత్తల మధ్య అనుసంధానకర్తగా ఈ పోరం పని చేయనుంది. ఇంకా చదవండి.
2. తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలు
విశాఖలో (Visakha) ఐదుగురు సైబర్ నిందితులను కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. ఢిల్లీలో సైబర్ నేరాల (Cyber Crime) కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారు. నగరంలో నివాసం ఉంటున్న అక్షయపత్వాల్, ధీరజ్ జోషి, హిమాన్షుశర్మ, పార్త్‌బాలి, పి.నవీన్ చంద్ర పటేల్ స్థానిక బిర్లా జంక్షన్ వద్ద ఓ కాల్ సెంటర్‌లో పని చేస్తున్నారు. వీరు గత కొంతకాలంగా ఆన్ లైన్‌లో మోసాలకు పాల్పడుతూ.. పలువురి నుంచి డబ్బులు కాజేస్తున్నారు. ఈ క్రమంలో సీబీఐ, ఇతర రాష్ట్రాల పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడులు చేసి వీరిని అదుపులోకి తీసుకుంది. ఇంకా చదవండి.
3. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద ఇద్దరు రెక్కీ
బీజేపీ ఫైర్ బ్రాండ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) ఇంటి వద్ద ఇద్దరు వ్యక్తులు ఆదివారం రెక్కీ నిర్వహించడం కలకలం రేపింది. ఇంటి పరిసరాల్లో సంచరిస్తుండగా తొలుత అంతగా పట్టించుకోని స్థానికులు.. తర్వాత అదే పనిగా అక్కడే ఉండడంతో అనుమానంతో చెక్ చేశారు. వారి వద్ద సెల్ ఫోన్లలో గన్, బుల్లెట్లు, రాజాసింగ్ ఫోటోలు కనిపించాయి. దీంతో షాకైన వారు ఇద్దరిని పట్టుకుని మంగళహాట్ పోలీసులకు అప్పగించారు. నిందితులను ఇస్మాయిల్, మహ్మద్ ఖాజాగా గుర్తించారు. ఇంకా చదవండి.
4. సిద్ధిపేట జిల్లాలో బాలికపై లైంగిక దాడి
సిద్ధిపేట జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువకుడు ఏడో తరగతి బాలికపై లైంగిక దాడికి పాల్పడగా.. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు నిందితుని ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురవెల్లి మండలం గురువన్నపేటలో బాలికపై ఇంటి పక్కనే ఉండే ఓ యువకుడు శుక్రవారం లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికకు కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా ఈ దారుణం వెలుగుచూసింది. ఇంకా చదవండి.
5. మరో యూట్యూబర్‌పై అత్యాచార కేసు
ఇటీవల సోషల్ మీడియా సెలబ్రిటీలపై లైంగిక ఆరోపణలు, అత్యాచార అభియోగాలు ఎక్కువవుతున్నాయి. యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు మరువక ముందే మరో యూట్యూబర్‌పై కేసు నమోదైంది. ఓ యువతి ఫిర్యాదు మేరకు యూట్యూబర్, ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‌పై జగిత్యాల (Jagitial) పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. అతని యూట్యూబ్ ఛానల్స్‌లో ఫోక్ సాంగ్ చేసే ఓ యువతి తనపై అత్యాచారం చేశాడని.. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా తరచూ ఫోన్ చేసి వేధిస్తున్నాడని పోలీసులకు తెలిపింది. ఇంకా చదవండి.