అన్వేషించండి

Today Top Headlines: పవన్ కల్యాణ్‌ను వెంటాడుతోన్న ప్రకాష్ రాజ్ - తిరుమలేశునికి మాధవీలత లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3PM

Top News: ఏపీ, తెలంగాణలో ఇప్పటివరకూ జరిగిన టాప్ హెడ్ లైన్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In Telugu States: 

1. పవన్ కల్యాణ్ ను వెంటాడుతోన్న ప్రకాష్ రాజ్

నువ్వు నంద అయితే నేను బద్రి, బద్రీనాథ్ అనేది సినిమా డైలాగ్.. నువ్వు డిప్యూటీ సీఎం అయితే నేను ప్రకాష్, ప్రకాష్ రాజ్.. ఇది రియల్ లైఫ్ డైలాగ్. తిరుమల లడ్డూ వివాదం పవన్ కల్యాణ్(Pawan kalyan), ప్రకాష్ రాజ్(Prakash raj) వీరిద్దరి మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఈ పోరులో ప్రకాష్ రాజ్ ఎక్కడా తగ్గేలా లేరు. మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ని ఉద్దేశిస్తూ ఘాటు ట్వీట్ వేశారు. తిరుమల లడ్డూ(Tirumala Laddu) వివాదంపై పవన్ కల్యాణ్ వేసిన ట్వీట్‌తో ఈ గొడవ మొదలైంది. ఆ ట్వీట్‌కి ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. మీరు డిప్యూటీసీఎంగా ఉన్న రాష్ట్రంలోనే ఈ గొడవ జరిగింది. దీనిపై మీరు ఇన్వెస్టిగేషన్ చేయించండి. ఇంకా చదవండి.

2. తిరుమలేశునికి మాధవీలత లేఖ

తిరుమల లడ్డూ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో అసదుద్దీన్‌పై పోటీ చేసిన మాధవీలత అయితే తిరుమలేశుడికి లేఖ రాశారు. క్షమాపణ కోరుతూ రాసిన ఆ లేఖను హుండీలో వేయనున్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామి అంటే తెలుగు రాష్ట్రాల్లోనో దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలోనే హిందువులు పవిత్రంగా భావిస్తారన్నారు రాజాసింగ్. అలాంటి పవిత్రమైన గుడిలో ఇచ్చే ప్రసాదాన్ని అపవిత్రం చేసి అందులో జంతువుల కొవ్వును కలపడం దారుణమన్నారు. ఇంకా చదవండి.

3. వెంకట్రామిరెడ్డి నిర్వాకంతో సచివాలయ ఉద్యోగ సంఘం రద్దు

వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగ సంఘం నేతలు కూడా  వైసీపీకి మద్దతుగా ప్రకటనలు చేశారు. సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి ఒక అడుగు ముందుక వేసి వైసీపీ కోసం ప్రచారం  చేశారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఆయన అదే పని చేయడంతో ఎన్నికల సంఘం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. అప్పట్నుంచి ఆయన సస్పెన్షన్ లోనే ఉన్నారు. తాజాగా ఆయన అధ్యక్షుడిగా ఉన్న ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రభుత్వం ఆ సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఇంకా చదవండి.

4. బతుకమ్మ పండుగ వెనుక కథలెన్నో

గుట్టలు, గట్లు, చేలు, అడవి..ఇలా ఎక్కడెక్కిడి నుంచో ఏరితీసుకొచ్చి పూలను ఓ చోట అందంగా పేర్చి బతుకునిచ్చే బతుకమ్మగా భావించి పూజిస్తారు. అదే బతుకమ్మ పండుగ. అందరూ బతుకమ్మలను ఒకేలా పేరుస్తారు కానీ చిన్న వ్యత్యాసం కనిపిస్తుంది. కొందరు శివలింగంలా పేరిస్తే..మరికొందరు బౌద్దుల స్థూపాకారంలో పేర్చుతారు. ఇంకా చదవండి.

5. హైదరాబాద్‌లో బాంబులతో ఇంటిని కూల్చేసిన అధికారులు

హైదరాబాద్‌లో హైడ్రా ప్రభావంతో అక్రమ కట్టడాలు నేల కూలుతున్నాయి. ఎన్ని విమర్శలు రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నా  అధికారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అక్రమంగా కట్టిన నిర్మాణాలకు నోటీసులు ఇచ్చి కూల్చేస్తున్నారు. అలానే సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లోని మల్కాపూర్‌లో కట్టడం కూల్చివేత కోసం బాంబులు వాడాల్సి వచ్చింది. ఇంకా చదవండి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan Tirumala tour controversy : హిందూసంఘాల ఆందోళనల నడుమ తిరుమలకు జగన్ - కల్తీ ఇష్యూని డీల్ చేయడంలో తడబడుతున్నారా ?
హిందూసంఘాల ఆందోళనల నడుమ తిరుమలకు జగన్ - కల్తీ ఇష్యూని డీల్ చేయడంలో తడబడుతున్నారా ?
Devara Movie Review - దేవర రివ్యూ: ఎన్టీఆర్‌కు 'ఆర్ఆర్ఆర్' రేంజ్ హిట్ వస్తుందా? కొరటాల శివ తీసిన సినిమా ఎలా ఉందంటే?
దేవర రివ్యూ: ఎన్టీఆర్‌కు 'ఆర్ఆర్ఆర్' రేంజ్ హిట్ వస్తుందా? కొరటాల శివ తీసిన సినిమా ఎలా ఉందంటే?
Love Sitara Movie Review - 'లవ్ సితార' రివ్యూ: శోభితా ధూళిపాళ పెళ్లి సినిమా - Zee5 OTTలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్
'లవ్ సితార' రివ్యూ: శోభితా ధూళిపాళ పెళ్లి సినిమా - Zee5 OTTలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్
Janasena : వైఎస్ఆర్‌సీపీ బలం, బలగం అంతా జనసేనలోకి - ప్రత్యామ్నాయంగా అవతరించబోతోందా ?
వైఎస్ఆర్‌సీపీ బలం, బలగం అంతా జనసేనలోకి - ప్రత్యామ్నాయంగా అవతరించబోతోందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్‌పై మరోసారి ప్రకాశ్ రాజ్‌ సెటైర్లు, జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్లక్కీడ్రాలో అదిరిపోయే గిఫ్ట్‌లు, ఈ యువకుల ఆలోచన అదుర్స్మహారాష్ట్రలో భారీ వర్షాలు, నీట మునిగిన ముంబయి!లెబనాన్‌పై మరింత దూకుడుగా ఇజ్రాయేల్, మరో లెవెల్‌కి వార్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Tirumala tour controversy : హిందూసంఘాల ఆందోళనల నడుమ తిరుమలకు జగన్ - కల్తీ ఇష్యూని డీల్ చేయడంలో తడబడుతున్నారా ?
హిందూసంఘాల ఆందోళనల నడుమ తిరుమలకు జగన్ - కల్తీ ఇష్యూని డీల్ చేయడంలో తడబడుతున్నారా ?
Devara Movie Review - దేవర రివ్యూ: ఎన్టీఆర్‌కు 'ఆర్ఆర్ఆర్' రేంజ్ హిట్ వస్తుందా? కొరటాల శివ తీసిన సినిమా ఎలా ఉందంటే?
దేవర రివ్యూ: ఎన్టీఆర్‌కు 'ఆర్ఆర్ఆర్' రేంజ్ హిట్ వస్తుందా? కొరటాల శివ తీసిన సినిమా ఎలా ఉందంటే?
Love Sitara Movie Review - 'లవ్ సితార' రివ్యూ: శోభితా ధూళిపాళ పెళ్లి సినిమా - Zee5 OTTలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్
'లవ్ సితార' రివ్యూ: శోభితా ధూళిపాళ పెళ్లి సినిమా - Zee5 OTTలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్
Janasena : వైఎస్ఆర్‌సీపీ బలం, బలగం అంతా జనసేనలోకి - ప్రత్యామ్నాయంగా అవతరించబోతోందా ?
వైఎస్ఆర్‌సీపీ బలం, బలగం అంతా జనసేనలోకి - ప్రత్యామ్నాయంగా అవతరించబోతోందా ?
Mobile Addiction : పిల్లలకు ఫోన్ వ్యసనంగా మారిందా? ఇదిగో ఈ సూచనలు పాటిస్తే సరి
పిల్లలకు ఫోన్ వ్యసనంగా మారిందా? ఇదిగో ఈ సూచనలు పాటిస్తే సరి
Tirupati Laddu row: టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! అందుకే రియాక్ట్ కావడం లేదా?
టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! అందుకే రియాక్ట్ కావడం లేదా?
Tirupati Laddu Row: తిరుపతి లడ్డూ వివాదం - నెల రోజుల పాటు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు
తిరుపతి లడ్డూ వివాదం - నెల రోజుల పాటు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు
Game Changer Second Single : నెవ్వర్ బెఫోర్ అనేలా
"రా మచ్చా మచ్చా" సాంగ్ సాంగ్ గురించి ఈ విషయాలు తెలుసా?
Embed widget