అన్వేషించండి

Batukamma Festival Stories: అందాల బతుకమ్మ.. బతుకునిచ్చే అమ్మ - తెలంగాణ అస్తిత్వానికి చిహ్నంగా నిలిచే ఈ పండుగ వెనుక కథలెన్నో!

Batukamma 2024: తెలంగాణ అస్తిత్వానికి చిహ్నం ..ప్రకృతే పరమాత్మ అని తలుస్తూ పూలనే అమ్మవారిగా భావించి పూజించే పండుగ బతుకమ్మ. తొమ్మిది రోజులు సాగే ఈ పండుగ వెనుక ఎన్ని కథలో..

Batukamma Festival Stories: గుట్టలు, గట్లు, చేలు, అడవి..ఇలా ఎక్కడెక్కిడి నుంచో ఏరితీసుకొచ్చి పూలను ఓ చోట అందంగా పేర్చి బతుకునిచ్చే బతుకమ్మగా భావించి పూజిస్తారు. అదే బతుకమ్మ పండుగ.

అందరూ బతుకమ్మలను ఒకేలా పేరుస్తారు కానీ చిన్న వ్యత్యాసం కనిపిస్తుంది. కొందరు శివలింగంలా పేరిస్తే..మరికొందరు బౌద్దుల స్థూపాకారంలో పేర్చుతారు.  

అప్పట్లో బౌద్దులు..మత ఆరాధానలో భాగమైన స్తూపాలును పూలు, మట్టి, ఇసుక, రాళ్లుతో తయారు చేసుకుని పూజించేవారట. ఎందుకంటే వీళ్లు నిత్యం ప్రయాణాల్లో ఉండడంతో సమయానుకూలంగా అక్కడ తమకు అందుబాటులో ఉన్న వస్తువులతో స్తూపం తయారుచేసుకునేవారు. బుద్ధుడికి ప్రతీకగా స్తూపానికి నమస్కరించి..ఆ తర్వాత ఆ సమీపంలో ఉండే నీటిలో కలిపేవారు. అలా వాళ్లు తిరిగిన ప్రదేశాల్లో  తెలంగాణ ఒకటి. 

Also Read: బతుకమ్మ పండుగ డేట్స్ 2024 ...ఈ రోజు ఏ బతుకమ్మని పూజించాలి!

బౌద్దులు స్తూపాలుగా పూలను పేర్చడం చూసి గిరిజనులు వీరిని అనుకరించడం మొదలుపెట్టారు. రంగు రంగు పూలను స్తూపంలా పేర్చి వనదేవతను పూజించిన తర్వాత అమ్మవారి కరుణాకటాక్షాలు లభించాయట. అప్పటి నుంచీ ఈ బౌద్ద స్తూపాకారంలో పూలను పేర్చి పూజించడం ప్రారంభించారు. 

ఆశ్వయుజమాస పాడ్యమి నుంచి దసరా ప్రారంభం అయితే..అందుకు ఓ రోజు ముందు వచ్చే భాద్రపద అమావాస్య/మహాలయ అమావాస్య/పితృ అమావాస్య నుంచి బతుకమ్మ ప్రారంభమవుతుంది. అంటే శక్తి తో పాటూ పితృదేవతలను తలుచుకోవడం కూడా ఈ పండుగ ఆంతర్యం.  

బతుకమ్మ వేడుకలలో భాగంగా తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ అని 2 బతుకమ్మలను పేరుస్తారు. స్త్రీలో మాతృత్వ కోణం అనువణువునా ఈ పండుగలో కనిపిస్తుంది. ఆడబిడ్డలకు పుట్టింటితో అనుబంధం..తోబుట్టువులతో మగపిల్లల ఆప్యాయత అన్నీ బతుకమ్మలో కనిపిస్తాయి. అందంగా పేర్చిన బతుకమ్మ బతుకునిచ్చే అమ్మలా దీవిస్తున్నట్టుంటుంది. 

బతుకమ్మ సంబరాలను తెలంగాణ నేలపై శతాబ్ధాలుగా జరుపుకుంటున్నారు...ఈ సంప్రదాయం ఎలా మొదలైందో చెప్పేందుకు ఎన్నో కథలున్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారీతనాన్ని భరించలేక తెలంగాణ గ్రామీణ మహిళల ఆత్మహత్యలు చేసుకునేవారు. వారందర్నీ తలుచుకుంటూ...వారికి గుర్తుగా రంగురంగుల పూలను పేర్చి..మధ్యలో శక్తి రూపాన్ని పెట్టి బతుకమ్మ అంటూ పూజించడం ప్రారంభించారు. 

Also Read: బతుకమ్మకు ఏ రోజు ఏ నైవేద్యం పెడతారో తెలుసా? రెసిపీలు ఇవే

కాకతీయ రాణి రుద్రమదేవి తన మనవళ్లకు అనారోగ్యం కలిగినప్పుడు బతుకమ్మ పండుగ చేయడం ద్వారా వంశాన్ని కాపాడుకుందని.. అప్పటి నుంచి బతుకమ్మ వైభోగంగా జరుగుతోందని చెబుతారు. 

ఓ దంపతులకు పిల్లలు పుట్టినట్లే పుట్టి చనిపోతుంటే.. గౌరమ్మను పూజించారు. అప్పుడు జన్మించిన బిడ్డకి బతుకమ్మ అని పేరు పెట్టారు. అందుకే ఆడబిడ్డకు ప్రతీకగా పూలను పేర్చి..ఆ బిడ్డను ప్రసాదించిన గౌరమ్మను మధ్యలో పెట్టి పూజించారని మరో కథ..

పరమేశ్వరుడు తలపై ఉన్న గంగని చూసి పార్వతీ దేవి అసూయ చెందిందట. అందరూ గంగనే పూజిస్తున్నారని తల్లితో చెప్పిందట. అప్పుడు ఆ గంగమ్మపై నిన్ను పూల తెప్పలా తేలించి పూజిస్తారని మాట ఇచ్చిందట. అలా బతుకమ్మ వేడుక వెనుక మరో కథ చెబుతారు. 

పూర్వం పిల్లలు లేని దంపతులు  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తుండగా వారికి ఓ బిడ్డ దొరికింది. ఆ చిన్నారిని అమ్మవారి ప్రసాదంగా భావిస్తూ పెంచుకున్నారని.. ఆమె ఎన్నో మహిమలు చూపడంతో అందరూ దేవతగా భావించారని ..ఆమే బతుకమ్మ అని మరో కథ..

జానపదుల పండుగగా ప్రారంభమైన బతుకమ్మ నగరాలకు..ఆ తర్వాత సరిహద్దులు దాటి విదేశాలకు పాకింది. తెలంగాణ ఆడబిడ్డలు ఏ దేశంలో ఉన్నా బతుకమ్మ జరుపుకోవడం మాత్రం మానేయరు. వారి జీవితాల్లో బతుకమ్మ అంతలా భాగమైపోయింది. సంతోషాన్ని - బాధను పాటల రూపంలో బతుకమ్మకి చెప్పుకుంటారు..ఆమె కదా అందరకీ అమ్మ...

Also Read : బతుకమ్మ పూలలో ఎన్ని ఔషధగుణాలు ఉంటాయో తెలుసా? ఈ పండుగ ఆనందానికే కాదు ఆరోగ్యానికి కూడా 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Rohit Sharma: రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
NITW: వరంగల్ నిట్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా
NITW: వరంగల్ నిట్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Embed widget