అన్వేషించండి

Andhra Pradesh : వెంకట్రామిరెడ్డి నిర్వాకంతో సచివాలయ ఉద్యోగ సంఘం రద్దు - ఆయన ఉద్యోగమైనా కాపాడుకోగలరా ?

AP Government : ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘాన్ని రద్దు చేసే దిశగా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. సస్పెన్షన్ లో ఉన్న ఆయనను ఉద్యోగం నుంచి తొలగించేదిశగా అభియోగాలు నమోదు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

AP Secretariat Employees Union Leader Venkatrami Reddy : వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగ సంఘం నేతలు కూడా  వైసీపీకి మద్దతుగా ప్రకటనలు చేశారు. సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి ఒక అడుగు ముందుక వేసి వైసీపీ కోసం ప్రచారం  చేశారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఆయన అదే పని చేయడంతో ఎన్నికల సంఘం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. అప్పట్నుంచి ఆయన సస్పెన్షన్ లోనే ఉన్నారు. తాజాగా ఆయన అధ్యక్షుడిగా ఉన్న ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రభుత్వం ఆ సంఘానికి నోటీసులు జారీ చేసింది.

వ్యక్తిగత హోదాలోనే వైసీపీ కోసం ప్రచారం చేశారని వివరణ ఇచ్చిన ఇతర కార్యవర్గ సభ్యులు 

వెంకట్రామిరెడ్డి తమ సంఘం అధ్యక్షుడే అయినా ఆయన వ్యక్తిగత హోదాలోలోనే ఎన్నికల ప్రచారం చేశారని ఆయన ప్రచారానికి తమ సంఘానికి సంబంధం లేదని కార్యవర్గంలోని ఇతర సభ్యులు ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. అదే సమయంలో కార్యవర్గంలోని కొంత మంది రాజీనామా చేశారు. ప్రభుత్వం ఈ సంఘానికి గుర్తింపు రద్దు చేస్తే ఇక ఎన్నికలు ఉండవు. వైసీప అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకట్రామిరెడ్డి ఈ అసోసియేషన్ అధ్యక్షుడిగా అయ్యారు. వైఎస్ జగన్ సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. నేరుగా క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లగలరు. ఆయన సిఫారసులతో చాలా మంది అనర్హులకు ప్రమోషన్లు  వచ్చాయన్న ఆరోపణలు ఉన్నాయి. 

పవన్ కల్యాణ్ ని వెంటాడుతున్న ప్రకాష్ రాజ్.. జస్ట్ ఆస్కింగ్ అంటూ మరో ఘాటు ట్వీట్

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడే సస్పెన్షన్ 

అయితే ఎన్నికల సమయంలో ఆయన కడపకు వెళ్లి ఆర్టీసీ సంఘాలతో సమావేశమయ్యారు. మరికొంత మంది ఉద్యోగులతో కలిసి .. ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల్లో మళ్లీ వైసీపీని గెలిపించాలని కోరారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో వెంకట్రామిరెడ్డిని అప్పుడే సస్పెండ్ చేశారు. అప్పట్నుంచి ఆయన హెడ్ క్వార్టర్స్ లోనే ఉండాల్సి ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పదిహేను రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.ఆ నోటీసులకకు వెంకట్రామిరెడ్డి వివరణ ఇవ్వలేదు. వివరణ ఇచ్చేందుకు ఆయనకు కొన్ని అవకాశాలు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

బయటకి రావద్దని జగన్‌కి రాజాసింగ్ సలహా- తిరుమలేశుడికి లేఖ రాసిన మాధవీ లత

సర్వీస్ రూల్స్ ఉల్లంఘించినందున ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం         

సస్పెన్షన్ లో ఉన్న ఆయన గతంలోనూ వివాదాస్పద ప్రవర్తనతో షోకాజ్ నోటీసులు అందుకున్నారు. సస్పెండ్ కూడా అయ్యారు. ఈ క్రమంలో ఆయన సర్వీస్ రూల్స్ పూర్తి స్థాయిలో ఉల్లంఘించిన ఉద్యోగం నుంచి ఉద్వాసన పలకాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.  ఆయన పూర్తిగా ఓ రాజకీయ  పార్టీకి తొత్తుగా మారినందున.. అధికార రహస్యాలను రహస్యంగా ఉంచే అవకాశం లేదని.. పలుమార్లు తీవ్రమైన తప్పులు చేసినందన ఆయనను.. ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Laddu Row: జగన్‌ పర్యటనపై ఎన్డీఏ నేతల కీలక నిర్ణయం- శాంతియుత నిరసనకు పిలుపు
జగన్‌ పర్యటనపై ఎన్డీఏ నేతల కీలక నిర్ణయం- శాంతియుత నిరసనకు పిలుపు
Tirumal Laddu Row: తిరుపతి లడ్డూ వివాదంతో అయోధ్య రామాలయ పూజారి సంచలన వ్యాఖ్యలు- ప్రధాన దేవాలయాల్లో బయట ప్రసాధాలు నిషేధం
తిరుపతి లడ్డూ వివాదంతో అయోధ్య రామాలయ పూజారి సంచలన వ్యాఖ్యలు- ప్రధాన దేవాలయాల్లో బయట ప్రసాధాలు నిషేధం
Jagan Tirumala tour controversy : హిందూసంఘాల ఆందోళనల నడుమ తిరుమలకు జగన్ - కల్తీ ఇష్యూని డీల్ చేయడంలో తడబడుతున్నారా ?
హిందూసంఘాల ఆందోళనల నడుమ తిరుమలకు జగన్ - కల్తీ ఇష్యూని డీల్ చేయడంలో తడబడుతున్నారా ?
Karimnagar: ఆయన పేరు ఆరోగ్యం- పోలీసు వ్యవస్థకే అనారోగ్యం- కరీంనగర్‌ పోలీస్ కమిషనర్‌కు బాధితుల ఫిర్యాదు!
ఆయన పేరు ఆరోగ్యం- పోలీసు వ్యవస్థకే అనారోగ్యం- కరీంనగర్‌ పోలీస్ కమిషనర్‌కు బాధితుల ఫిర్యాదు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్‌పై మరోసారి ప్రకాశ్ రాజ్‌ సెటైర్లు, జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్లక్కీడ్రాలో అదిరిపోయే గిఫ్ట్‌లు, ఈ యువకుల ఆలోచన అదుర్స్మహారాష్ట్రలో భారీ వర్షాలు, నీట మునిగిన ముంబయి!లెబనాన్‌పై మరింత దూకుడుగా ఇజ్రాయేల్, మరో లెవెల్‌కి వార్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Laddu Row: జగన్‌ పర్యటనపై ఎన్డీఏ నేతల కీలక నిర్ణయం- శాంతియుత నిరసనకు పిలుపు
జగన్‌ పర్యటనపై ఎన్డీఏ నేతల కీలక నిర్ణయం- శాంతియుత నిరసనకు పిలుపు
Tirumal Laddu Row: తిరుపతి లడ్డూ వివాదంతో అయోధ్య రామాలయ పూజారి సంచలన వ్యాఖ్యలు- ప్రధాన దేవాలయాల్లో బయట ప్రసాధాలు నిషేధం
తిరుపతి లడ్డూ వివాదంతో అయోధ్య రామాలయ పూజారి సంచలన వ్యాఖ్యలు- ప్రధాన దేవాలయాల్లో బయట ప్రసాధాలు నిషేధం
Jagan Tirumala tour controversy : హిందూసంఘాల ఆందోళనల నడుమ తిరుమలకు జగన్ - కల్తీ ఇష్యూని డీల్ చేయడంలో తడబడుతున్నారా ?
హిందూసంఘాల ఆందోళనల నడుమ తిరుమలకు జగన్ - కల్తీ ఇష్యూని డీల్ చేయడంలో తడబడుతున్నారా ?
Karimnagar: ఆయన పేరు ఆరోగ్యం- పోలీసు వ్యవస్థకే అనారోగ్యం- కరీంనగర్‌ పోలీస్ కమిషనర్‌కు బాధితుల ఫిర్యాదు!
ఆయన పేరు ఆరోగ్యం- పోలీసు వ్యవస్థకే అనారోగ్యం- కరీంనగర్‌ పోలీస్ కమిషనర్‌కు బాధితుల ఫిర్యాదు!
Love Sitara Movie Review - 'లవ్ సితార' రివ్యూ: శోభితా ధూళిపాళ పెళ్లి సినిమా - Zee5 OTTలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్
'లవ్ సితార' రివ్యూ: శోభితా ధూళిపాళ పెళ్లి సినిమా - Zee5 OTTలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్
Devara Movie Review - దేవర రివ్యూ: ఎన్టీఆర్‌కు 'ఆర్ఆర్ఆర్' రేంజ్ హిట్ వస్తుందా? కొరటాల శివ తీసిన సినిమా ఎలా ఉందంటే?
దేవర రివ్యూ: ఎన్టీఆర్‌కు 'ఆర్ఆర్ఆర్' రేంజ్ హిట్ వస్తుందా? కొరటాల శివ తీసిన సినిమా ఎలా ఉందంటే?
Janasena : వైఎస్ఆర్‌సీపీ బలం, బలగం అంతా జనసేనలోకి - ప్రత్యామ్నాయంగా అవతరించబోతోందా ?
వైఎస్ఆర్‌సీపీ బలం, బలగం అంతా జనసేనలోకి - ప్రత్యామ్నాయంగా అవతరించబోతోందా ?
Mobile Addiction : పిల్లలకు ఫోన్ వ్యసనంగా మారిందా? ఇదిగో ఈ సూచనలు పాటిస్తే సరి
పిల్లలకు ఫోన్ వ్యసనంగా మారిందా? ఇదిగో ఈ సూచనలు పాటిస్తే సరి
Embed widget