అన్వేషించండి

Top Headlines: మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - టీడీపీ కార్యకర్తలకు సీఎం చంద్రబాబు భరోసా, ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

Top News: ఏపీ, తెలంగాణలో నేటి టాప్ 5 హెడ్ లైన్స్ వార్తలు ఇక్కడ మీ కోసం. పూర్తి వివరాల కోసం ఒక్క క్లిక్ చేయండి.

Top Five Headlines In AP And Telangana:

1. మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

రాష్ట్రంలో మహిళా ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం (AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగినులకు అవసరమైన ప్రతి చోటా వసతి గృహాలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల హామీల అమల్లో భాగంగా ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్ స్థాయిలో 100 వసతి గృహాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు సీఎంకు వివరించగా.. ఉద్యోగినుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైతే డివిజన్ స్థాయిలోనూ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇంకా చదవండి.

2. టీడీపీ కార్యకర్తలకు సీఎం చంద్రబాబు భరోసా

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి ఎన్ని వినతులు వచ్చినా.. వాటన్నింటినీ  పరిష్కారమే లక్ష్యంగా పెట్టుకున్నానని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. పార్టీ కార్యాయంలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.  గత 5ఏళ్ల కాలంలో జరిగిన రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని..  రెవెన్యూ సమస్యలకు కారణమై, అక్రమాలకు పాల్పడిన అధికారులు పై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.  ప్రతీ మండలంలోనూ ఓ భూ కుంభకోణం వెలుగు చూస్తోందని..  రికార్డులు కూడా తారుమారు చేశారన్నారు. ఇంకా చదవండి.

3. టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

సంచలనాలకు కేరాఫ్‌గా ఉండే టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన కామెంట్స చేశారు. ఎంపీ కేశినేని నాని జన్మదిన వేడుకలు తన ఆఫీస్‌లో నిర్వహించిన ఆయన... తనకు అండగా ఉంటాలంటూ విజయవాడ ఎంపీకి రిక్వస్ట్ చేశారు. తన మాట చెల్లుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొన్న వారిలో తాను ముందు వరసలో ఉంటానని చెప్పుకొచ్చారు బుద్దావెంకన్న. ఇంకా చదవండి.

4. ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) నిర్మాణానికి సంబంధించి మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) శనివారం కీలక ప్రకటన చేశారు. పథకంలో భాగంగా ఈ నెలాఖరులోపు మొదటి విడత కింద రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఇంకా చదవండి.

5. తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు

తెలంగాణలో మరోసారి ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఎనిమిది మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వికాస్ రాజ్‌కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ని రవాణా, హౌసింగ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్  ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది. స్మార్ట్ గవర్నెన్స్‌తోపాటు కేంద్రంతో కోఆర్డినేషన్ బాధ్యత ఇచ్చారు. కమర్షియల్ ట్యాక్స్ శాఖ కమీషనర్‌గా ఉన్న శ్రీదేవిని షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌గా బదిలీ చేసింది ప్రభుత్వం. సయ్యద్‌ అలీ ముర్తుజా రిజ్వీకి వాణిజ్య శాఖకు సంబంధించి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇంకా చదవండి.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
OLA EV Showroom: ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Telangana: కేటీఆర్ అరెస్టు ఖాయమా ? ఆ రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయి ?
కేటీఆర్ అరెస్టు ఖాయమా ? ఆ రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయి ?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
Embed widget