News
News
వీడియోలు ఆటలు
X

Top 5 Headlines Today: సీఎం జగన్‌ను కలిసిన ప్రముఖ క్రికెటర్, తెలంగాణ జేపీఎస్‌లపై మంత్రి కీలక వ్యాఖ్యలు - నేటి టాప్ 5 న్యూస్

నేడు ఏపీ, తెలంగాణలో జరిగిన టాప్ 5 న్యూస్ మీకోసం..

FOLLOW US: 
Share:

సీఎం జగన్‌ను కలిసిన అంబటి రాయుడు - రాజకీయాల్లోకి వస్తున్నారా? 

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్న క్రికెటర్ అంబటి రాయుడు తాడేపల్లిలో సీఎం జగన్ కలిశారు. బుధవారం రాత్రి మ్యాచ్ ఆడిన ఆయన ఉదయం తాడేపల్లిలో సీఎం జగన్ ను కలవడం ఆసక్తికరంగా మారింది. ఆయన ఇటీవలి కాలంలో సీఎం జగన్ ను ప్రశంసిస్తూ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి ఉందని కొన్ని మీడియా సంస్థలకు చెప్పారు. అలాగే క్రికెట్ అకాడెమీ కూడా పెట్టాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ తో భేటీ చర్చనీయాంశమవుతోంది. ఇంకా చదవండి

సీఎం స్పందించకపోవడంతోనే రైతులకు ఇబ్బందులు - న్యాయం జరిగే వరకూ పోరాడతామన్న పవన్ !

రైతులపై కేసులు పెడితే ఊరుకునేది లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  అన్నంపెట్టే రైతు తరచూ కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  రాజమండ్రిలో  జనసేన నూతన కార్యాలయంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు.  అకాల క్షేత్ర స్తాయి పర్యటనలో సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవటం, వ్యవసాయ శాఖ మంత్రి పర్యటించకపోవటం, ముఖ్యమంత్రి స్పందించకపోవటం వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. రుణమాఫీ వద్దని... పావలా వడ్డీకి ఎకరానికి 25 వేలు రుణం ఇస్తే సరిపోతుందని రైతులు చెబుతున్నారని తెలిపారు. గోనె సంచులు ఇవ్వకపోవటం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రతీ రైతుకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇంకా చదవండి

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను చర్చలకు పిలవలేదు - ఎర్రబెల్లి

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం చర్చలకు పిలిచింది అని జరుగుతున్న ప్రచారం నిజం కాదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.  నిబంధనలు, ఒప్పందాలకు విరుద్ధంగా చేస్తున్న సమ్మె ను వారు వెంటనే విరమించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక ప్రకటన విడుదల చేశారు.  ప్రభుత్వం తరపున తాను గానీ, మరెవ్వరు గానీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను చర్చలకు పిలవలేదని స్పష్టం చేశారు. అలా ప్రభుత్వం చర్చలకు పిలిచింది అని జరుగుతున్న ప్రచారం అబద్ధమన్నారు. అలాంటి ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మ వద్దని సూచించారు. 

ఇప్పటికైనా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమిస్తే బాగుంటుందని.. సీఎం కెసిఆర్  మనసున్న మహారాజ  పంచాయతీ కార్యదర్శులపై మంచి అభిప్రాయం ఉందన్నారు.  ఆ పేరును చెడ గొట్టుకోవద్దని సూచించారు. ప్రభుత్వాన్ని శాసించాలని సాహసించడం, నియంత్రించాలని అనుకోవడం తప్పన్నారు.  JPS లు సమ్మె విరమిస్తే, సీఎం వారికి తప్పకుండా సాయం చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు.  జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేయడం  చట్ట విరుద్ధం.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి కూడా విరుద్ధమని స్పష్టం చేశారు. సంఘాలు కట్టబోమని, యూనియన్ లలో చెరబోమని, సమ్మెలు చేయబోమని, ఎలాంటి డిమాండ్ల కు దిగబోమని మీరు ప్రభుత్వానికి బాండ్ రాసి ఇచ్చారని ఎర్రబెల్లి గుర్తు  చేశారు. ఇంకా చదవండి

హైదరాబాద్‌లో ఆ ఏరియాల్లో ట్రాపిక్ ఆంక్షలు, ఏకంగా మూడు నెలలు!

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ హర్షవర్ధన్, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, ఏసీపీ హనుమంతరావు లు ప్రెస్ మీట్ నిర్వహించి మరీ వివరాలు తెలిపారు. గచ్చిబౌలి ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి కొండపూర్ వైపు వెళ్లే నూతన ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుందని.. దాని వల్లే ట్రాఫిక్ డైవర్షన్ చేసినట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. గచ్చిబౌలి ఓఆర్ఆర్ చౌరస్తా నుంచి కొండాపూరు వెళ్లే దారిని కొన్ని రోజుల పాటు మూసివేయనున్నట్లు స్పష్టం చేశారు. మే 13వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు మూడు నెలల పాటు 24 గంటలూ పని జరుగుతుందని.. అప్పటి వరకూ ఈ దారి మూసే ఉంటుందని పేర్కొన్నారు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రయాణికులు ప్రత్యామ్నాయ రహదారులను వినియోగించుకోవాలని సూచించారు. ఇంకా చదవండి

ఏపీలో ముందస్తు ఎన్నికలు - ఇవే సూచనలా ?

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. జరుగుతాయా లేదా అన్నది డిసైడ్ చేయాల్సింది , చేసుకోవాల్సింది సీఎం జగన్ మాత్రమే. ఆయన ఆలోచనల ఎలా ఉన్నాయో కానీ కొన్ని సూచనలు మాత్రం ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న అభిప్రాయం కల్పిస్తున్నాయి. అలాంటివి పెరుగుతూండటంతో రాజకీయ  పార్టీలన్నీ డిసెంబర్‌లోనే ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇంకా చదవండి

Published at : 11 May 2023 03:03 PM (IST) Tags: Breaking News Telangana LAtest News Andhra Pradesh News Todays Top news

సంబంధిత కథనాలు

Top 10 Headlines Today: తెలంగాణలో రాష్ట్రావతరణ వేడుక ఉత్సాహం- ఏపీలో పోస్టర్‌ వివాదం- మార్నింగ్ ఏబీపీ దేశం టాప్‌ న్యూస్

Top 10 Headlines Today: తెలంగాణలో రాష్ట్రావతరణ వేడుక ఉత్సాహం- ఏపీలో పోస్టర్‌ వివాదం- మార్నింగ్ ఏబీపీ దేశం టాప్‌ న్యూస్

AP Flexi War : ఫ్లెక్సీల వార్ చేసుకుంటున్న ఏపీ రాజకీయ పార్టీలు - వైసీపీ పోస్టర్లకు టీడీపీ, జనసేన కౌంటర్లు !

AP Flexi War :  ఫ్లెక్సీల వార్ చేసుకుంటున్న ఏపీ రాజకీయ పార్టీలు -  వైసీపీ పోస్టర్లకు టీడీపీ, జనసేన కౌంటర్లు !

Weather Latest Update: కాస్త చల్లబడ్డ వాతావరణం, నేడు వర్షాలు, ఈదురుగాలుల అలర్ట్ - ఐఎండీ

Weather Latest Update: కాస్త చల్లబడ్డ వాతావరణం, నేడు వర్షాలు, ఈదురుగాలుల అలర్ట్ - ఐఎండీ

Tamil Nadu Crime: అత్తను దారుణంగా హత్య చేసిన కోడలు, సీసీటీవీ ఫుటేజీ చూసి పోలీసులు షాక్!

Tamil Nadu Crime: అత్తను దారుణంగా హత్య చేసిన కోడలు, సీసీటీవీ ఫుటేజీ చూసి పోలీసులు షాక్!

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు

టాప్ స్టోరీస్

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం

అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్‌ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!

Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్‌ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!