By: ABP Desam | Updated at : 14 May 2022 10:23 PM (IST)
ఏపీలో గ్రామ వాలంటీర్లుపై వేటు
Village Volunteers Suspended: తిరుపతి : గ్రామాల్లోని పేదలకు సైతం నేరుగా సంక్షేమ పథకాలు అందించే విధంగా గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఏపీ ప్రభుత్వం ఒకటి తలిస్తే.. గ్రామాల్లోని వాలంటీర్లు నిబంధనలు బేఖాతరు చేస్తూ పలు అంశాల్లో ఏపీ ప్రభుత్వానికి కొందరు తలనొప్పిగా మారారు. ప్రభుత్వ పధకాలపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వ పథకాలు పేదలకు అందే విధంగా చర్యలు చేపట్టాల్సిన వాలంటీర్లు తమ ఇష్టరీతిన ప్రవర్తిస్తున్న ఘటనలు రోజురోజుకి రాష్ట్ర వ్యాప్తంగా అనేకం వెలుగు చూస్తున్నాయి.
తాజాగా విధుల్లో నిర్లక్ష్యం చేశారంటూ అన్నమయ్య జిల్లాలో ఓ ఎంపిడివో ఆగ్రహం చెంది ఏకంగా 23 మంది గ్రామ వాలంటీర్లు (23 AP Grama Volunteers) ను విధుల నుంచి తొలగించారు. 7 పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసు జారీ చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. 23 వాలంటీర్లను పూర్తిగా విధుల నుంచి తొలగించి, వారి వద్ద నుంచి ప్రభుత్వం అందించిన మొబైల్ ఫోన్లు సహా సామాగ్రిని తీసుకోవడంతో పాటు వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని సైతం ఉత్తర్వులలో పేర్కొన్నారు. గ్రామ వాలంటీర్లు మండల ప్రజా పరిషత్, ములకల చెరువు గ్రామ సచివాలయం పరిధిలో పనిచేస్తున్న గ్రామ వాలంటీర్లు ప్రభుత్వ నిబంధనల మేరకు అటెండెన్స్ నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించిన కారణంగా విధుల నుంచి పూర్తి తొలగించారు.
ఆ వివరాలిలా ఉన్నాయి.. అన్నమయ్య జిల్లా, మొలకలచెరువు మండల పరిధిలోని విధులు నిర్వర్తిస్తున్న పంచాయతీ కార్యదర్శులు, వాలంటీర్లపై గత కొద్ది రోజులుగా వస్తున్న ఫిర్యాదుల క్రమంలో మొలకలచెరువు ఎంపీడివో రమేష్ బాబు ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల్లో వాలంటీర్లు, పంచాయతీ కార్యదర్శులు నిర్వర్తిస్తున్న విధులపై ఎప్పటికప్పుడు ఆరా వస్తున్నారు. అయితే గత కొంత కాలంగా గ్రామాల్లో ప్రభుత్వం పధకాలు అమలుపై నేరుగా గ్రామ ప్రజలతో భేటీ అయ్యిన ఏంపిడివో రమేష్ గ్రామ స్ధాయిలో వాలంటీర్లు ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ గ్రామాల స్ధాయిలో వాలంటీర్లు బయోమెట్రిక్ హాజరు వేయక పోవడం, వాలంటీర్లు, పంచాయతీ కార్యదర్శుల పని తీరులో ఎటువంటి మార్పు కనిపించలేదు. అయితే ఇదే విషయంను ఏంపీడివో రమేష్ సమావేశంమై వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ వారి పని తీరులో ఎటువంటి మార్పులు రాలేదు. దీంతో ఆగ్రహానికి గురైన రమేష్ బాబు వాలంటీర్లు, పంచాయతీ కార్యదర్శుల వార్నింగ్ సైతం ఇచ్చాడు. పై అధికారి మాటలను ఏమాత్రం పట్టించుకోక పోవడం, ప్రభుత్వ నిబంధనల్ని తుంగలో తొక్కారన్న కారణంగా మండలం పరిధిలోని 23 మంది వాలంటీర్లను డిస్మిస్ చేస్తూ, ఏడుగురు పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
మొలకలచెరువు మండలంలోని బురకాయలకోట, గూడుపల్లె, కదిరినాధునికోట, కాలువపల్లె, మద్దినాయునిపల్లె, ములకలచెరువు, సోంపల్లె, చౌడసముద్రం, గ్రామాలకు చేందిన వాలంటీర్లకు సస్పెండ్ చేయడమే కాకుండా వారికి ప్రభుత్వం అందజేసిన మొబైల్ ఫోన్స్, బయోమెట్రిక్ స్కానర్లను స్వాధీనం చేసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే మిగిలిన వారికి కూడా ఇదే తరహాలో కఠిన చర్యలు తీసుకుంటానని మొలకలచెరువు ఏంపీడివో రమేష్ బాబు హెచ్చరించారు. ఏదీ ఏమైనప్పటికీ ఎంపీడీవో తీసుకున్న చర్యలకు మిగిలిన సిబ్బంది గుండెల్లో భయం మొదలైంది.
గ్రామ సచివాలయ సిబ్బంది ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 5 గంటలకు బయోమెట్రిక్ హాజరు నమోదు చేసుకోవాలి. గ్రామ వాలంటీర్లు వారంలో 3 సార్లు .. సోమవారం, బుధవారం, శుక్రవారం బయోమెట్రిక్ హాజరు నమోదు చేసుకోవాలి. ఓ నెలలో ఓవరాల్‌గా 12 రోజులు కనీసం హాజరు ఉండాలి. దీనిపై వార్నింగ్ ఇచ్చినా నిర్లక్ష్యం వహించిన కారణంగా ఎంపీడీవో కీలక నిర్ణయం తీసుకున్నారు.
Ward Volunteers, Grama Volunteers, AP Grama Sachivalayam, AP Ward Volunteers, AP Grama Volunteers
Top 10 Headlines Today: పోలవరం టూర్‌కు జగన్, నాగర్ కర్నూల్‌లో కేసీఆర్ పర్యటన, తిరుపతిలో ఆదిపురుష్ వేడుక
Top 10 Headlines Today: ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం, ఒడిశా ప్రమాద బాధితులపై మమత
AP Contract Employees: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, పర్మినెంట్ చేయాలని నిర్ణయం
Minister Peddireddy: ఏపీలో ముందస్తు ఎన్నికలపై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు - స్పష్టత ఇచ్చిన మంత్రి
Nara Lokesh: రాయలసీమపై టీడీపీ ఫోకస్, త్వరలో కీలక ప్రకటనలు చేయనున్న నారా లోకేష్!
KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన
RBI: కొత్త వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్‌బీఐ సమీక్ష, రెపో రేట్ ఎంత పెరగొచ్చు?
Bro Special Song Cost : ఏంటిది పవన్ 'బ్రో' - ఊర్వశి స్పెషల్ సాంగ్‌కు అంత ఖర్చా?
దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!