అన్వేషించండి

TTD News: ప్రతి ఆదివారం తిరుమల శ్రీవారికి జరిగే పూజలు ఇవే - నిన్న భక్తుల రద్దీ, హుండీ ఆదాయం ఇలా

శ్రీవారి మూలవిరాట్ ముఖ మండపంలో గడ్డం మీద అర్చకులు గడ్డం బొట్టుగా పచ్చ కర్పూరాన్ని అద్దిన తరువాత గొల్ల హారతి సమర్పణ జరుగుతుంది.

శ్రీనివాసుడి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం 05-11-22న స్వామి వారిని 82,604 మంది దర్శించుకోగా, 37,025 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. ఇక స్వామి వారికి భక్తులు కానుకల హుండీ రూపంలో 5.57 కోట్ల రూపాయలు లభించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి పోయింది. మ దీంతో స్వామి వారి సర్వదర్శనంకు 38 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనంకు దాదాపు మూడు గంటల సమయం పడుతుంది..

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. వైఖానస అర్చకులు, సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామి వారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామి వారి తొలి దర్శనం చేసుకుంటారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతం స్తోత్రం, ప్రవర్తి, మంగళ శాసనం వంటివి పటిస్తూ ఉండగా సన్నిధిలో వైఖానస అర్చకుల ప్రత్యూష కాలరాతనలో భాగంగా శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చి పాలను నివేదిస్తారు అర్చకులు. ముందు రోజు రాత్రి పావళింపు సేవలో బంగారు నవారు మంచంపై సేవించి ఉన్న శ్రీవారి కౌతుక బేరం శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి వారిని మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి సింహాసనంపై జీవ స్థానంలో వేయించేపు చేస్తారు. అనంతరం ఏకాంతంగా శ్రీవారికి కర్పూర నిరాజనం సమర్పణ జరుపుతారు అర్చకులు. దీనినే కైకర్యపరుల హారతిని కూడా పిలుస్తారు..


శ్రీవారి మూలవిరాట్ ముఖ మండపంలో గడ్డం మీద అర్చకులు గడ్డం బొట్టుగా పచ్చ కర్పూరాన్ని అద్దిన తరువాత గొల్ల హారతి సమర్పణ జరుగుతుంది. తర్వాత వైఖానస అర్చకులు ముందుగా బ్రహ్మ తీర్థాన్ని తాము స్వీకరించిన తరువాత జియ్యంగార్లలకు, సన్నిధి గొల్లకు బ్రహ్మ తీర్థంను అందిస్తారు. అనంతరం బంగారు వాకిలి వద్ద మంగళ శాసన శ్లోకాలు పఠనం జరుగుతుండగా, సన్నిధిలో శ్రీవారికి కర్పూర నీరాజన సమర్పణ జరుగుతుంది. మహంతి మఠం, మైసూరు రాజావారి ప్రతినిధి,తాళ్ళపాక అన్నమయ్య వంశీయులు తమళపాకు, వక్కలు శ్రీవారికి నివేదించి నవనీత హారతిని సమర్పిస్తారు. ఈ సమయంలో జరిగే దర్శనానికి విశ్వరూప దర్శనం అని కూడా పిలుస్తారు. అనంతరం భోగ శ్రీనివాసమూర్తి వారికి స్నాన పీఠంపై వేయించేపు చేసిన అర్చకులు. తోమాల సేవ ప్రారంభిస్తారు. ముందుగా ఆకాశగంగా తీర్థం, పాలు పరిమళం మొదలైన ద్రవ్యాలతో పురుష సూక్త పఠనంతో అభిషేకం నిర్వహిస్తారు.

తర్వాత శ్రీవారి బంగారు పాదకవచములకు, సాలగ్రామములకు యధా క్రమం తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం పరధా వేసి ప్రాతఃకాల ఆరాధనకు సంకల్పం చేసి ఆకాశగంగా తీర్థంతో పంచ పాత్రలను నింపి భూతశుద్ధి, ఆవాహనాధులను పూర్తి చేసి పరదా తొలగిస్తారు. శ్రీవారి మూలవిరాట్ కు ఆసనం, పాద్యం, అర్ఘ్యం,అచమనం మొదలైన 30 ఉపచారాలతో వేద మంత్రోచ్చారణ జరుగుతుంది. అటుతరువాత వక్షఃస్ధల లక్ష్మీ ,పద్మావతి తాయార్లకు, శ్రీ భోగ శ్రీనివాస మూర్తి వారికి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తికి శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారికి సీతా, లక్ష్మణ, రాములవారికి, రుక్మిణి సమేత శ్రీ కృష్ణ స్వామి వారికి సాలగ్రామ, శఠారిలకు శ్రీ సుదర్శనల వారికి విమాన వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి మూర్తులన్నింటినీ పుష్ప మాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. శ్రీవారి మూలవిరాట్ కు నక్షత్ర హారతి, కర్పూర హారతి సమర్పిస్తారు..ఈ తంతుతో తోమాల సేవ పూర్తి అవుతుంది. అటు తర్వాత ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నాపన మండపంలో శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారి సమక్షంలో దర్బార్ నిర్వహిస్తారు.


శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జమాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని నివేదిస్తారు. నవనీత హారతి సమర్పించిన అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలోకి వేంచేపు చేసి, సన్నిధిలో శ్రీవారికి సహస్రనామ అర్చన సేవ నిర్వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర సహస్రనామావళిలోని 1008 నామాలు పట్టిస్తుండగా తులసీ దళములతో శ్రీవారికి అర్చన నిర్వహిస్తారు. అర్చన తర్వాత స్వామి వారికి నక్షత్ర హారతి, కర్పూర హారతి జరిపి మొదటి నివేదనకు సన్నాహాలు జరుపుతారు. అటు తరువాత శ్రీవారికి ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదన జరుగుతుంది. స్వామి వారి ప్రాతఃకాల నైవేధ్యంలో భాగంగా అన్న ప్రసాదం, లడ్డూ, వడ, వంటి నివేదనలు సమర్పిస్తారు. అటు తర్వాత సన్నిధిలో శ్రీవారికి శ్రీ వైష్ణవ సాంప్రదాయకంగా సాత్తుమొర నిర్వహించిన తరువాత సర్కారు వారి హారతి జరిపి విఐపి బ్రేక్‌ దర్శనంకు భక్తులను అనుమతిస్తారు.

అటు తర్వాత శ్రీవారికి మధ్యాహ్నిక రెండో గంట నివేదన, బలి జరిపి తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతిస్తారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విమాన ప్రకారం ప్రదక్షిణ దిశగా చేస్తూ కళ్యాణోత్సవ మండపంకు వేంచేపు చేసి, స్వామి అమ్మవార్ల కు కళ్యాణోత్సవం కార్యక్రమంను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు అర్చకులు. శ్రీవారి ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు అర్చకులు. అటుతరువాత సహ్రదీపాలంకరణ సేవ నిర్వహించిన‌ అర్చకులు, తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు..అనంతరం ఆలయంకు చేరుకున్న అనంతరం సర్వదర్శనం నిలుపుదల చేసి శ్రీవారికి రాత్రి కైంకర్యాలను ప్రారంభిస్తారు అర్చకులు. ఈ క్రతువులో భాగంగా శ్రీవారి మూలవిరాట్ కు ఉదయం తోమాల సేవలో అలంకరించిన పుష్పమాలను తొలగించి, సన్నిధి పాత్ర శుద్ధి చేస్తారు. అనంతరం శ్రీవారికి రాత్రి తోమాల,రాత్రి అర్చన, రాత్రి గంట, తిరువీసం ఘంటాబలి నిర్వహించి సర్వ దర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతిస్తారు. సర్వదర్శనం పూర్తయిన తర్వాత శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Bail Cancel: సుప్రీంకోర్టుకు హైదరాబాద్ పోలీసులు - అల్లు అర్జున్ బెయిల్ రద్దు ఖాయమేనా ?
సుప్రీంకోర్టుకు హైదరాబాద్ పోలీసులు - అల్లు అర్జున్ బెయిల్ రద్దు ఖాయమేనా ?
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
AIIMS: 'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది'  మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది' మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
BRS MLAs Protest: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన - కేటీఆర్, హరీష్ దొరతనం బయటపడిందన్న మంత్రి సీతక్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన - కేటీఆర్, హరీష్ దొరతనం బయటపడిందన్న మంత్రి సీతక్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పార్లమెంంట్‌కి రకరకాల హ్యాండ్‌బ్యాగ్‌లతో ప్రియాంక గాంధీజమిలి ఎన్నికల బిల్లుని  లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రంసంధ్య థియేటర్ ఘటనలో మరో ట్విస్ట్!Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Bail Cancel: సుప్రీంకోర్టుకు హైదరాబాద్ పోలీసులు - అల్లు అర్జున్ బెయిల్ రద్దు ఖాయమేనా ?
సుప్రీంకోర్టుకు హైదరాబాద్ పోలీసులు - అల్లు అర్జున్ బెయిల్ రద్దు ఖాయమేనా ?
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
AIIMS: 'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది'  మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది' మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
BRS MLAs Protest: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన - కేటీఆర్, హరీష్ దొరతనం బయటపడిందన్న మంత్రి సీతక్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన - కేటీఆర్, హరీష్ దొరతనం బయటపడిందన్న మంత్రి సీతక్క
One Nation One Election Bill : లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
Manchu Manoj Mother Wrote A Letter: మంచు మనోజ్‌ చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల
మంచు మనోజ్‌ చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల
Russia Moscow Blast: రష్యాలో భారీ పేలుడు, న్యూక్లియర్ సెక్యూరిటీ చీఫ్ మృతి 
రష్యాలో భారీ పేలుడు, న్యూక్లియర్ సెక్యూరిటీ చీఫ్ మృతి 
Samyuktha Menon :  సమంత అనుకునేరు సంయుక్త.. పింక్ కలర్ పట్టుచీరలో అదిరిపోయింది కదా!
సమంత అనుకునేరు సంయుక్త.. పింక్ కలర్ పట్టుచీరలో అదిరిపోయింది కదా!
Embed widget