అన్వేషించండి

TTD Chairman: కల్తీ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ లేదని సిట్ నిర్దారించలేదు - చార్జిషీట్‌లో లోపాలు - టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు

TTD Chairman Naidu: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంపై టీటీడీ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

TTD Chairman expresses anger over YSR Congress Party campaign: తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారంపై టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు  కీలక వ్యాఖ్యలు చేశారు.  వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో తిరుమలను ఒక ప్రణాళికాబద్ధమైన కుట్రతో భ్రష్టు పట్టించారని ఆరోపించారు.  వైసీపీ నేతలు చేస్తున్న యజ్ఞాలు, ఇస్తున్న క్లీన్ చిట్ ప్రకటనలపై తీవ్రంగా స్పందిస్తూ, హిందూ సమాజానికి జగన్ ,  ఆయన అనుచరులు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  సిట్ నివేదికలో ఎక్కడా జంతువుల కల్తీ జరగలేదని నిర్దారించలేదని ఆయన స్పష్టం చేశారు. 

 కల్తీ నెయ్యి కొనుగోలు - రూ. 20 కోట్ల లడ్డూల పాపం

వైసీపీ హయాంలో నిబంధనలను తుంగలో తొక్కి, సామర్థ్యం లేని డైరీలకు టెండర్లు కట్టబెట్టారని నాయుడు ఆరోపించారు. సుమారు 60 లక్షల కిలోల కల్తీ నెయ్యిని  కొనుగోలు చేసి, దానితో 20 కోట్ల లడ్డూలను తయారు చేసి పంపిణీ చేశారని అన్నారు.   భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. నెయ్యిలో జంతు కొవ్వు లేదని వైసీపీ నేతలు చెబుతుండటం సిగ్గుచేటని, అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ వాడి నెయ్యి తయారు చేశారని సిట్ ఛార్జ్ షీట్ లోనే స్పష్టంగా ఉందని ఆయన గుర్తు చేశారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడి హిందువుల ప్రాణాలతో ఆడుకున్నారని దుయ్యబట్టారు. ఎన్డీడీబీ రిపోర్టులో కొవ్వు ఉందని రిపోర్టు వచ్చింది కాబట్టే సీఎం, మంత్రులు స్పందించారని అన్నారు. 

 సిట్ విచారణ ,  పెద్దల ప్రమేయం

సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కొన్ని లోపాలు ఉన్నాయని, కేవలం చిన్న స్థాయి వ్యక్తులపైనే కాకుండా ఈ కుట్ర వెనుక ఉన్న పెద్ద తలకాయలను వెలికితీయాలని బి.ఆర్. నాయుడు డిమాండ్ చేశారు. జగన్, వైవీ సుబ్బారెడ్డిల ప్రమేయం లేకుండా కేవలం పీఏ స్థాయి వ్యక్తులు ఇంత పెద్ద కుంభకోణం చేయలేరని ఆయన అభిప్రాయపడ్డారు. వైవీ సుబ్బారెడ్డి దంపతులు తమ బ్యాంక్ వివరాలను సిట్ కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నెయ్యి కల్తీపై నూటికి నూరు శాతం నిజం బయటపడాలంటే  మైక్రో డీఎన్ఏ టెస్ట్ చేయాలని, ఇందుకోసం కోర్టును ఆశ్రయిస్తామని ఆయన వెల్లడించారు.

యజ్ఞాలపై ఎద్దేవా - భూమనకు ప్రాణభయం

మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న  యాగంపై బి.ఆర్. నాయుడు సెటైర్లు వేశారు.  తప్పు చేసిన వారికి తల వెయ్యి ముక్కలు అవుతుందనే భయం ఉండబట్టే భూమన ఇలాంటి యాగాలు చేస్తున్నారు  అని ఎద్దేవా చేశారు. ఎన్ని యాగాలు చేసినా చేసిన పాపం పోదని, హిందూ సమాజంపై దాడి చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. తిరుమలను వాటికన్ సిటీలా మార్చాలని చూశారని, భక్తుల రక్షణ కోసం హిందువులందరూ ఏకం కావాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు.

 తిరుమల ప్రక్షాళన  

గత ప్రభుత్వం చేసిన అరాచకాల నుంచి తిరుమలను కాపాడుకోవడమే తమ మొదటి ప్రాధాన్యతని నాయుడు స్పష్టం చేశారు. సిట్ సమర్పించింది కేవలం ప్రాథమిక ఛార్జ్ షీట్ మాత్రమేనని, ముందు ముందు మరిన్ని నిజాలు బయటకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కల్తీకేటుగాళ్లను జైలుకు పంపించే వరకు తాము విశ్రమించబోమని, ప్రతి విషయంలోనూ నిబంధనలను తూట్లు పొడిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.  

టాప్ హెడ్ లైన్స్

YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
YSRCP DSC Protests: ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!
ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget