అన్వేషించండి

Tirumala News: శ్రీనివాసుడికి మంగళవారం ఏఏ ప్రసాదాలు నివేదిస్తారో తెలుసా?

Tirumala News: తిరుమల శ్రీవారి  సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నవంబర్ 14వ తేదీ ఒక్కరోజే 69 వేల 814 మంది స్వామి వారిని దర్శించుకోగా.. 4.17 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.

Tirumala News: తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల‌ రద్దీ కొనసాగుతుంది. ప్రతి మంగళవారం స్వామి వారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి, మిరియాల పొంగలిని నైవేధ్యంగా సమర్పిస్తారు. సోమవారం అంటే నవంబర్ 14వ తేదీ 2022వ రోజున 69,814 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 29,228 మంది తలనీలాలు సమర్పించగా, 4.17 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వ దర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో బయట క్యూలైన్లలో కూడా భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వ దర్శనానికు 36 గంటల సమయం పడుతోంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం పడుతోంది.

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు.. ఇందులో‌ భాగంగానే మంగళవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారము తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో  కలిపిన నువ్వుల పిండిని స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాస మూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు, చక్కెర పొంగలి, మిరియాలు పొంగలి, పగిలిన కుండలో వెన్నతో కలిపిన అన్నం(మాత్ర), దద్దోజనం స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. 

సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వీఐపీ భక్తులను స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండో గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి "మంగళవారం" రోజు నిర్వహించే "అష్టదళపాద పద్మరాధన" 108 సువర్ణ పద్మాలతో శ్రీవారిని అర్చించారు. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తులు అయిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి,‌ ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మంపానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు. అనంతరం ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు. సాయంకాలం సహస్రదీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం నిర్వహిస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం ,ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు. 

శ్రీవారి‌ సేవలో పలువురు ప్రముఖులు..

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన తెలంగాణ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలని, అనిల్, ‌ముకేష్ అంబానీలు విడిపోయినా వ్యాపార రంగంలో ఏ స్ధాయిలో ‌నిలిచారో మన ఉమ్మడి రాష్ట్రాలు సైతం ఆ స్ధాయిలో‌ అభివృద్ధిలో పోటీ పడి దేశంలో మొదటి రెండు స్ధానాల్లో నిలవాలన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad: ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
Andhra Pradesh Postal Ballots : తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ : ఐఎండీ
నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ : ఐఎండీ
In Pics: పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Shubman Gill And Sai Sudharsan Centuries | GT vs CSK Highlights | కీలక మ్యాచులో చెన్నై ఓటమి| ABPRaja Singh Insulted in PM Modi Public Meeting | ఎల్బీ స్టేడియంలో రాజాసింగ్ కు అవమానం.. ఏం జరిగిందంటేChiranjeevi on Pawan Kalyan | Pithapuram | పవన్ తరపున ప్రచారానికి వెళ్లనన్న చిరంజీవి |YS Sharmila Interview | ఒక్కోసారి జగన్‌ను చూస్తుంటే అసలు నా అన్నయ్యేనా అనిపిస్తోంది... | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad: ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
ఓటు వేసిన వారికి షాపు యజమాని ఆఫర్, ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకుంటున్న ఓనర్
Andhra Pradesh Postal Ballots : తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
తేలిన ఏపీ పోస్టల్ బ్యాలెట్స్ లెక్క - రికార్డే !
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ : ఐఎండీ
నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ : ఐఎండీ
In Pics: పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ రోడ్‌ షో, జనాల్లో జోష్ చూసేయండి - ఫోటోలు
SBI News: టెక్కీలకు శుభవార్త చెప్పిన ఎస్బీఐ.. భారీ రిక్రూట్మెంట్ ప్లాన్ ఇదే..
SBI News: టెక్కీలకు శుభవార్త చెప్పిన ఎస్బీఐ.. భారీ రిక్రూట్మెంట్ ప్లాన్ ఇదే..
IPL 2024: రికార్డుల జోరు ముంబైదే, ప్రస్తుత హోరు కోల్‌కత్తాదే
రికార్డుల జోరు ముంబైదే, ప్రస్తుత హోరు కోల్‌కత్తాదే
Unhealthy Food: మన ఆయుష్షును హరిస్తున్నవి ఇవేనట - ఇలాంటివి తిన్నా.. తాగినా లైఫ్ మటాషే, తాజా పరిశోధన వెల్లడి
మన ఆయుష్షును హరిస్తున్నవి ఇవేనట - ఇలాంటివి తిన్నా.. తాగినా లైఫ్ మటాషే, తాజా పరిశోధన వెల్లడి
UDAN Scheme: ఇక పేదవాళ్లూ విమాన ప్రయాణం చేయొచ్చు, కేవలం రూ.500 కంటే తక్కువ ఖర్చుతో ఇలా!
ఇక పేదవాళ్లూ విమాన ప్రయాణం చేయొచ్చు, కేవలం రూ.500 కంటే తక్కువ ఖర్చుతో ఇలా!
Embed widget