అన్వేషించండి

Tirumala Darshan: బుధవారం రోజు ఆ సేవను టీటీడీ రద్దు చేసేందుకు కారణం ఇదే

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు.

తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల‌ రద్దీ సాధారణంగా కొనసాగుతుంది.. ప్రతి బుధవారం నాడు బెల్లంతో తయారు చేసిన బెల్లం పాయసంను నైవేద్యంగా సమర్పిస్తారు.. మంగళవారం రోజున 62,971 మంది స్వామి వారి దర్శించుకున్నారు.. ఇక స్వామి వారికి 25,534 మంది తలనీలాలు సమర్పించగా, 3.39 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు.. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 01 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు.. దీంతో  టైం స్లాట్ టోకెన్లు లేని భక్తులకు స్వామి వారి సర్వదర్శనంకు 12 గంటల సమయం పడుతుంది.. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు దాదాపు మూడు గంటల సమయం పడుతుంది.. 

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు.. ఇందులో‌ భాగంగా బుధవారం నాడు ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు.. అనంతరం  తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు.. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో  కలిపిన నువ్వుల పిండిని స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు.. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు.. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు, చక్కెర పొంగలి, మిరియాలు పొంగలి, పగిలిన కుండలో వెన్నతో కలిపిన అన్నం(మాత్ర), దద్దోజనం, బెల్లంతో తయారు చేసిన పాయసంను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.. 

సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వి.ఐ.పి భక్తులను స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టిటిడి.. అనంతరం స్వామి వారికి రెండోవ గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి "బుధవారం" రోజు నిర్వహించే "సహస్ర కళషాభిషేకం" ను టిటిడి‌ రద్దు చేసింది.. ఉత్సవిగ్రహాల పరిరక్షణ నేపధ్యంలో ఏడాదికి‌ ఓమారు మాత్రమే నిర్వహించాలని ఆగమ సలహాదారుల మండలి‌ సలహాల మేరకూ నిర్ణయం తీసుకుంది.. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతించారు.. శ్రీవారి ఉత్సవమూర్తు అయినా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవంను నేత్ర పర్వంగా నిర్వహిస్తారు అర్చకులు.. 

అటుతరువాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి,‌ ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మంపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు అర్చకులు.. సాయంకాలం సహస్రదీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం నిర్వహిస్తారు అర్చకులు.. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు అర్చకులు.. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం ,ఘంటాబలి నిర్వహిస్తారు.. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వాము వారి దర్శనంకు అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Mulugu Encounter: 'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!కేజ్రీవాల్‌పై రసాయన దాడి, గ్లాసుతో పోసిన దుండగుడుBobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Mulugu Encounter: 'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Jay Shah: ఐసీసీ చైర్మన్‌గా జై షా పగ్గాలు, భారతీయుడి ముందు నిలిచిన ఎన్నో సవాళ్లు !
ఐసీసీ చైర్మన్‌గా జై షా పగ్గాలు, భారతీయుడి ముందు నిలిచిన ఎన్నో సవాళ్లు !
Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
Gautam Adani: ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
Varun Tej: కొరియా నుంచి ఆర్టిస్టులు - స్టంట్‌మ్యాన్‌లు... వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్
కొరియా నుంచి ఆర్టిస్టులు - స్టంట్‌మ్యాన్‌లు... వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్
Embed widget