Shubman Gill Record in Oval Test Match | సునీల్ గవాస్కర్ రికార్డును బ్రేక్ చేసిన కెప్టెన్
ఇంగ్లాండ్ సిరీస్ తో కెప్టెన్ భాద్యతలు చేపట్టిన శుబ్మన్ గిల్ వరుస రికార్డులను బ్రేక్ చేస్తున్నాడు. ది ఓవల్ టెస్ట్ మ్యాచ్ లో ఏకంగా 46 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసాడు. సునీల్ గవాస్కర్ సాధించిన రికార్డును బ్రేక్ చేసి ఇప్పుడు తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక రన్స్ స్కోరు చేసిన భారత కెప్టెన్‌గా నిలిచాడు శుబ్మన్ గిల్.
ఐదవ టెస్ట్ మ్యాచ్ లో తక్కువ స్కోర్ కె ఓపెనర్లు పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన గిల్ లంచ్ బ్రేక్ సమయానికి 15 పరుగులు చేశాడు. దాంతో ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా నిలిచాడు. భారత దిగ్గజ క్రికెట్ సునీల్ గవాస్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ సిరీస్‌లో గిల్ 743 పరుగులు చేశాడు. 1978-79లో వెస్టిండీస్‌పై గావస్కర్ 732 పరుగులు సాధించి టాప్ లో ఉన్నాడు. దీంతో దాదాపు 46ఏళ్లుగా గావస్కర్ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు బాదిన కెప్టెన్‌గా కొనసాగుతూ వచ్చాడు. తాజా సిరీస్‌లో గిల్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో 21 పరుగులు చేసిన గిల్ రన్ అవుట్ అయ్యాడు.





















