Karun Nair Half Century | హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న కరుణ్ నాయర్
ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో అందరి అట్టెన్షన్ గ్రాబ్ చేసిన ప్లేయర్ కరుణ్ నాయర్. 2016 తర్వాత ఫార్మ్ కోల్పోవడంతో ఇండియా సెలెక్టర్లు అతని పక్కన పెట్టేసారు. కానీ మళ్ళి టీం ఇండియా లోకి రావడానికి కరుణ్ చాలా కష్టపడాల్సి వచ్చింది. దేశవాళీ క్రికెట్ తోపాటు ఐపీఎల్ లో తన సత్తా చాటి సెలెక్టర్ల కళ్ళలో పడ్డాడు. ఆలా ఇంగ్లాండ్ సిరీస్ లో భాగమయ్యాడు కరుణ్ నాయర్. ఈ టెస్ట్ సిరీస్ లో జరిగిన మ్యాచులో మాత్రం కరుణ్ దారుణంగా విఫలమైయ్యాడు. దాంతో ఒక సారిగా కరుణ్ పై ట్రోల్ల్స్ మొదలైయ్యాయి. కరుణ్ ను టీం లోకి అనవసరంగా తీసుకున్నారని అందరు కామెంట్ చేయడం మొదలు పెట్టారు. ఇక చేసేదేమి లేక మాంచెస్టర్ లో జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో కరుణ్ ను ప్లేయింగ్ 11 లో చేర్చలేదు. ఇక కరుణ్ టెస్ట్ కెరీర్ ముగిసిపోయిందని అందరు ఫిక్స్ అయిపొయ్యారు.
ఓవల్ లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో కరుణ్ ను ప్లేయింగ్ 11 లో చేర్చి టీం ఇండియా అందరికి షాక్ ఇచ్చింది. ఈ గోల్డెన్ ఛాన్స్ ని మాత్రం కరుణ్ పూర్తిగా వినియోగించుకున్నాడు. టీం ఇండియా వరుస వికెట్లు కోల్పోతున్న టైం లో వచ్చి 52 చేసి అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పిచ్ కఠినంగా ఉండటం... వికెట్లు పడుతున్నా కూడా ఇంగ్లాండ్ బౌలర్లను బాగా ఎదుర్కున్నాడు. మొదటి రోజు ఆటలో కరుణ్ ప్రత్యేకంగా నిలిచాడు. 8 ఏళ్ల తర్వాత కరుణ్ ఇలా మళ్ళి హాఫ్ సెంచరీ చేసి కంబ్యాక్ ఇవ్వడంతో ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.



















