Anasuya Bharadwaj: చెప్పు తెగుద్ది... మీ అమ్మ, చెల్లి అయితే ఇలా చేస్తారా? - యాంకర్ అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్
Anasuya: ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో యాంకర్ అనసూయ యువకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అసభ్యకర కామెంట్స్ చేసిన వారిపై ఫైర్ అయ్యారు.

Anasuya Bharadwaj Strong Warning To Youth In Markapuram: అనసూయ భరద్వాజ్... పరిచయం అక్కర్లేని పేరు. ఓ వైపు యాంకర్‌గా మరోవైపు మూవీస్‌లోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అసభ్య కామెంట్స్ చేసిన యువకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
చెప్పు తెగుద్ది అంటూ...
ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనసూయ స్టేజీపై స్పీచ్ ఇస్తుండగా కొందరు యువకులు అసభ్యకర కామెంట్స్ చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె... 'చెప్పు తెగుద్ది' అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 'మీ ఇంట్లో మీ అమ్మ, చెల్లి, భార్య, కుటుంబ సభ్యులను ఇలాగే కామెంట్స్ చేస్తే మీరు ఊరుకుంటారా? పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వాలంటూ మీ ఇంట్లో మీకు నేర్పలేదా?' అంటూ ఫైర్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన నెటిజన్లు అలానే బుద్ధి చెప్పాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.
చెప్పుతో కొడతానంటూ యువకులకు వార్నింగ్ ఇచ్చిన యాంకర్ అనసూయ
— Team_ChandrababuNaidu (@TEAM_CBN1) August 2, 2025
ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అసభ్యకర కామెంట్స్ చేశారని యువకులకు వార్నింగ్ ఇచ్చిన అనసూయ#Anasuyabharadwaj pic.twitter.com/QWH1ha88Gf
సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనసూయ సామాజిక అంశాలపైనా అప్పుడప్పుడూ స్పందిస్తారు. అసభ్య కామెంట్స్ చేసిన నెటిజన్లపై తనదైన రీతిలో కౌంటర్ ఇస్తారు. గతంలో జరిగిన ఈవెంట్స్‌లోనూ ఇలానే అభ్యంతరకర కామెంట్స్ చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అనసూయ.






















