Mothevari Love Story Series Song: 'మోతెవరి లవ్ స్టోరీ' నుంచి లవ్ సాంగ్ వచ్చేసింది - సోషల్ మీడియా పదాలతో 'గిబిలి గిబిలి'
Mothevari Love Story Series: లేటెస్ట్ విలేజ్ లవ్ సిరీస్ 'మోతెవరి లవ్ స్టోరీ' నుంచి లవ్ సాంగ్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. సోషల్ మీడియా పదాలతో 'గిబిలి గిబిలి' అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి.

Ghibili Ghibili Song Released From Mothevari Love Story: పచ్చని పల్లెటూరిలో అందమైన లవ్ స్టోరీ కలగలిపి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతోంది 'మోతెవరి లవ్ స్టోరీ' వెబ్ సిరీస్. అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ట్రైలర్ ఇటీవల రిలీజై ఆకట్టుకుంటోంది. తాజాగా... ఈ సిరీస్ నుంచి లవ్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.
సోషల్ మీడియా పదాలతో... గిబిలి గిబిలి
తన మనసులోని ప్రేమను హీరో హీరోయిన్‌కు చెప్పే క్రమంలో వచ్చే ఈ సాంగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. 'ఇష్టమైన ఇన్ స్టా పిల్లా.. ఇకనైన చూడవే నా కళ్లా.. ఇద్దరమూ కలిసి మళ్లా ఇరగ మరగ చేద్దాం పొల్లా... గిబిలి గిబిలి నువ్వే నా జాబిలి.' అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ఫ్రీక్వెంట్‌గా ఉపయోగించే పదాలతో పాట రావడం అందరినీ ఆకర్షిస్తోంది. మల్లెగోడ గంగ ప్రసాద్ ఈ సాంగ్ రాయగా... రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. చరణ్ అర్జున్ సిరీస్‌కు మ్యూజిక్ అందించారు.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఈ సిరీస్‌కు శివకృష్ణ బుర్రా దర్శకత్వం వహించగా... మధుర శ్రీధర్ రెడ్డి, శ్రీరామ్ శ్రీకాంత్ నిర్మాతలుగా వ్యవహరించారు. ప్రముఖ ఓటీటీ 'ZEE5'లో ఈ నెల 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 7 ఎపిసోడ్స్‌గా రాబోతోన్న ఈ విలేజ్ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. అనిల్, వర్షిణిలతో పాటు బలగం మురళీధర్ గౌడ్, సాధన, సుజాత కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌కు శ్రీకాంత్ అరుపుల సినిమాటోగ్రఫీ అందిస్తుండగా... అనిల్ గీల ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
స్టోరీ ఏంటంటే?
తెలంగాణలోని ఆరేపల్లి గ్రామంలో ఓ యువకుడు పక్క ఊరిలో అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి కూడా అతని ప్రేమను అంగీకరిస్తుంది. పెద్దలు అంగీకరించకపోవడంతో లేచిపోయి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. అయితే గ్రామంలో ఉండే ఇద్దరు సోదరులు వారసత్వంగా వచ్చిన భూమి కోసం తగాదా పడుతున్న క్రమంలో వీరికి అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. అసలు వీరి ప్రేమకు ఆ భూ తగాదాలకు సంబంధం ఏంటి?, వారసత్వంగా వచ్చిన భూమి కోసం ఈ అన్నదమ్ములు ఏం చేశారు? అసలు వారి ప్రేమ సక్సెస్ అయ్యిందా? అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. లవ్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్ అన్నీ కలగలిపి ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సిరీస్ రూపొందించినట్లు టీజర్, ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.
ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అవుతుండగా ఆద్యంతం నవ్వులు పూయించే సిరీస్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'మై విలేజ్ షో' నుంచి తొలిసారిగా ఇలా సిరీస్ చేసినట్లు హీరో అనిల్ తెలిపారు. తాను యంగ్ హీరో విజయ్ దేవరకొండ ద్వారానే సినిమాల్లోకి వచ్చానని... ఆయన ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనని చెప్పారు. లవ్, కామెడీ, ఎమోషన్ అన్నీ సిరీస్‌లో ఉంటాయన్నారు.






















