12th Fail OTT Streaming Platform: నేషనల్ బెస్ట్ ఫిల్మ్ '12th ఫెయిల్' ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా? తెలుగులోనూ చూసేయండి!
National Best Film Award 2023 OTT Platform: నేషనల్ అవార్డులు 2023లో విక్రాంత్ మాసే, మేథా శంకర్ జంటగా నటించిన '12th ఫెయిల్' సినిమాకు ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

National Awards 2023 Winners List: నేషనల్ అవార్డ్స్ 2023 విన్నర్స్ లిస్ట్ వచ్చేసింది. ఈ ఏడాది (2021) 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు విజేతల వివరాలను ప్రకటించారు. హిందీ సినిమా '12th ఫెయిల్' ఉత్తమ సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమాను చూడాలంటే ఏ ఓటీటీలో ఉందో తెలుసా?
జియో హాట్‌స్టార్ ఓటీటీలో '12th ఫెయిల్'
12th Fail movie Telugu OTT Platform Jio Hotstar: అవును... '12th ఫెయిల్' జియో హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా విడుదలైనప్పుడు అది డిస్నీ ప్లస్ హాట్ స్టార్. ఇప్పుడు జియోతో చేతులు కలపడంతో జియో హాట్‌స్టార్ అయ్యింది. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
'12th ఫెయిల్' సినిమాకు విధు వినోద్ చోప్రా దర్శకుడు. జస్ కున్వార్ కోహ్లీతో కలిసి ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాలో విక్రాంత్ మాసే హీరో. ఆయనకు జంటగా మేధా శంకర్ నటించారు. అనంత్ జోషి, అన్షుమన్ పుష్కర్, ప్రియాంషు ఛటర్జీ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
View this post on Instagram
నిజ జీవిత కథతో రూపొందిన '12th ఫెయిల్'
ఐపీఎస్ అధికారి మనోజ్ శర్మ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా '12th ఫెయిల్' సినిమా రూపొందింది. ఆయనది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చంబల్ లోయలో గల మౌర్యన ప్రాంతం. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన ఐపీఎస్ ఎలా అయ్యాడు? అనేది సినిమా. నిజాయతీగా ఉన్నాడని మనోజ్ శర్మ తండ్రి సస్పెండ్ అవుతాడు. సరిగ్గా అదే సమయంలో కాపీ కొట్టినా పర్వాలేదని, స్కూల్ స్టూడెంట్స్ అందరూ పాస్ కావాలని ప్రోత్సహించిన హెడ్ మాస్టర్ జైలుకు వెళ్తాడు. ఆయన్ను అరెస్ట్ చేసిన ఐపీఎస్ అధికారి, డిఎస్పీని స్ఫూర్తిగా తీసుకుని ఐఏఎస్ అవుతారు మనోజ్ శర్మ. హిందీలో విడుదలైన సమయంలో విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుందీ సినిమా. ఆ తర్వాత మిగతా భాషల్లో అనువదించారు. అన్ని భాషల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.





















