Tirumala News: తిరుమలలో కొన్ని విశేష పూజలు రద్దు చేసింది అందుకోసమే: టీటీడీ ఈవో

ఏప్రిల్‌లో శ్రీవారిని 20లక్షల 64 వేల మంది దర్శనం పొందారు. హుండీ ద్వారా 127 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ హుండీ కానుకులు రూ. 4.41 కోట్లు లభించింది. 99.07 లక్షలు లడ్డూలు విక్రయించారు.

FOLLOW US: 

స్లాట్ విధానం ద్వారా సామాన్య భక్తులకు త్వరలో స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తామని టిటిడి ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తుల సలహాలు, సూచనలు ఈవో ధర్మారెడ్డి తీసుకున్నారు. ఏప్రిల్ 12వ తేదీన భక్తులు అధిక సంఖ్యలో రావడం ద్వారా స్లాట్ విధాన టిటిడి రద్దు చేశామని వివరించారు. 

సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నామన్నారు ధర్మారెడ్డి. టిటిడిలో సమయాన్ని బట్టి, రద్దీ బట్టీ సేవలను రద్దు చేసే వ్యవస్ధ తిరుమలలో ఉందని, అందుకే వివిధ పర్వదినాల్లో కొన్ని ఆర్జిత సేవలు రద్దు చేయడం జరుగుతుందన్నారు.‌

సహస్ర కలశాభిషేకం, విశేష పూజ, వసంతోత్సవాన్ని ఉత్సవర్లను అరుగుదల నుంచి కాపాడేందుకు అర్చకులు, జియ్యంగార్ల ఆదేశాల మేరకు రద్దు చేసామని చెప్పారు ధర్మారెడ్డి. అష్టదళ, తిరుప్పావడ జూన్ 30వ తేదీ వరకూ తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందని తెలిపారు. 

అధిక భక్తుల రద్దీ ఉన్న పరిస్థితుల్లో ఆర్జిత సేవల సమయంలో మరింత మంది భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఈవో. వయోవృద్దులకు సంబంధించిన విషయాలపై కొందరు భక్తుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చామన్నారు. వయోవృద్దులకు ప్రతి రోజు ఆన్లైన్ స్లాట్ విధానం ద్వారా వెయ్యి మందికి దర్శనం కల్పిస్తున్నట్లు వివరించారు. చంటి బిడ్డల తల్లిదండ్రులకు, ఎన్.ఆర్.ఐ దర్శనాలు కూడా ప్రస్తుతం తిరుమలలో యథావిధిగా కొనసాగుతుందని తెలియజేశారు. 

ఏప్రిల్ నెలలో శ్రీవారి ఇరవై లక్షల అరవై నాలుగు వేల మంది దర్శనం పొందారని, హుండీ ద్వారా 127 కోట్లు ఆదాయం రాగా, ఈ హుండీ కానుకులు 4.41 కోట్లు ఆదాయం లభించిందన్నారు ధర్మారెడ్డి. 99.07 లక్షలు శ్రీవారి లడ్డూలు విక్రయించడం జరిగిందని ఈవో ధర్మారెడ్డి తెలియజేశారు. పరకామణిలో ఓ సిబ్బంది నగదు తీసుకెళ్తుండగా విజిలెన్స్ సిబ్బంది పట్టుకుని రిమాండ్ చేయడం జరిగిందని, పరకామణిలో కఠినంగా పరిశీలిస్తున్నాం, స్వామి వారి సొత్తును దొంగలిస్తే కచ్చితంగా పట్టుబడుతారని ఆయన చెప్పారు. 

Published at : 13 May 2022 02:38 PM (IST) Tags: ttd Tirumala Tirupati Devasthanam dharma reddy TTD EO

సంబంధిత కథనాలు

Srikalahasti News : శ్రీకాళహస్తి ఫైనాన్స్ సంస్థలో భారీ చోరీ, ఉద్యోగినిని కట్టేసి రూ. 80 లక్షల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు

Srikalahasti News : శ్రీకాళహస్తి ఫైనాన్స్ సంస్థలో భారీ చోరీ, ఉద్యోగినిని కట్టేసి రూ. 80 లక్షల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు

Balakrishna Warning: మళ్లీ రిపీట్ అయితే ఖబడ్దార్! బాలకృష్ణ తీవ్ర హెచ్చరిక

Balakrishna Warning: మళ్లీ రిపీట్ అయితే ఖబడ్దార్! బాలకృష్ణ తీవ్ర హెచ్చరిక

Chittoor News : రూ. ఐదు నాణెం మింగేసిన బాలుడు, తల్లిదండ్రులకు వైద్యుల నిర్లక్ష్య సలహా!

Chittoor News : రూ. ఐదు నాణెం మింగేసిన బాలుడు, తల్లిదండ్రులకు వైద్యుల నిర్లక్ష్య సలహా!

Bhubaneswar ttd temple : భువనేశ్వర్ లో కొలువుదీరిన శ్రీవారు, వైభవంగా ఆలయ మహాసంప్రోక్షణ

Bhubaneswar ttd temple : భువనేశ్వర్ లో కొలువుదీరిన శ్రీవారు, వైభవంగా ఆలయ మహాసంప్రోక్షణ

Annamayya District: అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురి దుర్మరణం

Annamayya District: అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురి దుర్మరణం

టాప్ స్టోరీస్

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!