Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆన్ లైన్లో టికెట్ల విడుదలకు టీటీడీ నిర్ణయం, ఎప్పుడంటే!
TTD News In Telugu: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఆన్‌లైన్ టికెట్లను నవంబర్ 16న విడుదల చేయనున్నామని టీటీడీ బోర్డు తెలిపింది.
![Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆన్ లైన్లో టికెట్ల విడుదలకు టీటీడీ నిర్ణయం, ఎప్పుడంటే! Tirumala News TTD to release Sri Srinivasa Divyanugraha Vishesh Homam tickets online Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆన్ లైన్లో టికెట్ల విడుదలకు టీటీడీ నిర్ణయం, ఎప్పుడంటే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/15/0f0e329653c4445f51fc0385c9ae9a0a1700052519592233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tirumala Tickets Online: తిరుపతి: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ (TTD Good News to Devotees) శుభవార్త చెప్పింది. హిందూ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా అలిపిరిలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో నవంబరు 23 నుంచి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేషహోమం ప్రారంభించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం ఆన్‌లైన్ టికెట్లను నవంబర్ 16న మధ్యాహ్నం 2 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. టికెట్ ధర రూ.1000/-గా నిర్ణయించారు. ఒక టికెట్‌పై ఇద్దరిని అనుమతిస్తారు.
భక్తులు ఈ విషయాన్ని గమనించి https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందాలని భక్తులకు సూచించారు. అలిపిరి వద్ద గల సప్తగోప్రదక్షిణశాలలో జరుగుతున్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేషహోమం ఏర్పాట్లను బుధవారం జెఈవో శ్రీ వీరబ్రహ్మం పరిశీలించారు. హోమం నిర్వహణకు, భక్తులు కూర్చునేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)